- అన్‌లాక్ వన్‌తో ఆ పక్రియ మొదలైంది
- భారతీయ నైపుణ్యం, ఆవిష్కరణ ద నమ్మకం ఉంది
- కొరోనా సవాళ్లు తాత్కాలికమేనన్న ప్రధాని మోదీ
- సిఐ సదస్సులో ప్రసంగించిన ప్రధాని
భారత ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలోపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్టీ(సీఐఐ) 125వ సంవత్సరం సందర్భంగా ఆర్థికవేత్తలను ఉద్దేశించి మంగళవారం ప్రధాని మాట్లాడారు. కరోనా వైరస్ లాక్డౌన్ నుంచి భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని, అన్‌లాక్ వన్‌తో ఆ పక్రియ మొదలైనట్లు ఆయన పేర్కొన్నారు. కచ్చితంగా మళ్లీ వృద్ధి సాధిస్తామన్నారు. నేనింత దృఢవిశ్వాసంతో ఎలా ఉన్నానని రు ఆశ్చర్యపోతారని, భారతీయ నైపుణ్యం, ఆవిష్కరణ ద తనకు నమ్మకం ఉన్నదన్నారు. కష్టపడే తత్వం, అకుంఠితదీక్ష మన వ్యాపారవేత్తలకు ఉన్నట్లు ఆయన తెలిపారు. మనం లాక్డౌన్ దశ నుంచి అన్‌లాక్ దశకు చేరుకున్నామంటే.. ప్రగతి పథం మళ్లీ మొదలైనట్లే అని మోదీ అన్నారు. భారత్‌ను స్వయం సమృద్ధిగా మార్చాలంటే.. ఉత్సాహాం, సమష్టితత్వం, పెట్టుబడి, మౌళికసదుపాయాలు, ఆవిష్కరణలు అవసరమని ప్రధాని తెలిపారు. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను.. మేడ్ ఫర్ ద వరల్డ్‌గా తయారు చేయాలన్నారు. కోవిడ్-19 నుంచి ప్రజలను కాపాడుకుంటూనే ఆర్థికవ్యవస్థను మెరుగుపర్చాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. తొలి దశ అన్‌లాక్ ప్రారంభమైందని, వారంలో రెండో దశ ప్రారంభమవుతుందని తెలిపారు. కరోనా కాలంలో ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఆవశ్యకత తెలిపిన ఆయన ప్రభుత్వం సైతం ఆ దిశగా పయనిస్తోందని ఉద్ఘాటించారు. ఇక దేశంలో ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకుంటు న్నామని వివరించారు. కరోనా సవాళ్లు తాత్కాలికమేనని మళ్లీ వృద్ధిరేటు పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంతో ప్రాధాన్యత వహిస్తామని ప్రధాని మోదీ అన్నారు. ఇంటెంట్, ఇన్‌క్లూజన్, ఇన్వెస్ట్మెంట్, ఇన్‌ఫ్రాస్టక్చ్ర ఇన్నోవేషన్‌పై తాము దృష్టి సారించామని ప్రధాని మోదీ అన్నారు. విపత్కర సమయంలో ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ ప్రకటించామని గుర్తు చేశారు. ఎంఎస్ఎంఈలు నిలదొక్కుకునేలా చర్యలు తీసుకున్నామని మోదీ వెల్లడించారు. ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేలా మేడిన్ ఇండియా ఉత్పత్తులను తయారు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ దిశగా స్వయం సమృద్ధి దిశగా చర్యలు కీలకమని చెప్పారు. బలమైన ఆకాంక్ష, సమ్మిళిత వృద్ధి, పెట్టుబడులు, మౌలిక వసతులు, వినూత్న ఆలోచనలు వంటి పంచ సూత్రాలు స్వయం సమృద్ధికి అవసరమని చెప్పారు. భారత పరిశ్రమలు, మన సామర్ధ్యం, సాంకేతికత పట్ల సర్వత్రా విశ్వాసం ఉందని అన్నారు. కోవిడ్-19 బారి నుంచి ప్రజలను కాపాడుకుంటూ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలోకి తేవడంపైనే ప్రభుత్వం దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ముందస్తు లాక్‌డౌన్‌తో మనం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఎంఎస్ఎంఈలు నిలదొక్కుకునేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆత్మనిర్భర్ ప్యాకేజ్‌తో దీర్ఘకాల వృద్ధికి బాటలు పరిచామన్నారు. ఉపాథి అవకాశాలు పెంచేందుకు సంస్కరణలు అవసరమని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ సత్వరం కోలుకునేలా చూడాలని ఆర్థిక వ్యవస్థ బలోపేతమే తమ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. వైరస్‌ను ఎదుర్కొనేందుకు కఠిన చర్యలు అవసరమని అన్నారు. ఇక వ్యవసాయ ఉత్పత్తులకు ఈ ట్రేడింగ్ విధానం ప్రవేశపెడతామని, రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. వినూత్న ఆలోచనలతో అన్ని రంగాల్లో వృద్ధి సాధ్యమని అన్నారు.