Take a fresh look at your lifestyle.

ఆడంబరాల అనారోగ్యాలు

అనంత కాలచక్ర గమనంలో..
నరులంతా నగదు వేటలో..
ధన కోసమే జీవితం అంటూ..
ఆడంబరాల అనారోగ్య ఆశయాలు !

జీవనయాన నవ్యనర క్షేత్రంలో..
శ్రమలేని విత్తం సాగుబడిలో..
ఆనందమనే కలుపును తొలగిస్తూ..
హైఫై దిగుబడే ఆనందమైతున్నాయి !

ఆనందమా… ఐశ్వర్యమా…
కావాలసింది అసలేమిటీ..
ఐశ్వర్యం విలాసాలను జోడిస్తే…
ఆనందమే అందించు ఆయురారోగ్యాల్ని !

విత్తం వెంటపడితే..
నీడలా వస్తాయి ఖాయంగా..
జబ్బుల కుప్పల సత్వర ఆస్తులు..
కరువగును నిత్య నవ్వుల పువ్వులు !

నిరాడంబర గుణాలే కదా..
అసలైన అందాల ఆభరణాలు
చక్కని సంతోషాల ఊట బావులు
ఆడంబరాలన్నీ అస్థిర సంపదలే !

పరిమళ చెమట చెలిమలే..
శాశ్వత సంబురాల ఊటలు..
శ్రమ ఫలాలే కదా సుఖ నిద్రలు..
ఆనంద క్షణాలే నికార్సైన ఆస్తులు !

    – డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
          కరీంనగర్‌ -?9949700037

Leave a Reply