Take a fresh look at your lifestyle.

పేదల భూములను బలవంతంగా లాక్కోవాలనే ఆలోచన మానుకోవాలి

సూర్యాపేట, సెప్టెంబర్‌30, ‌ప్రజాతంత్ర ప్రతినిధి): పేదల ఆధీనంలో ఉన్న భూములను లాక్కోవాలనే ఆలోచనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు డిమండ్‌ ‌చేశారు. బుధవారం మండల పరిధిలోని బుర్కాచర్ల గ్రామంలో అభివృద్ది పేరుతో దళితుల ఇనాం భూమి తీసుకోవాలనే ఆలోచనను ఉపసంహరించుకోవాలని కోరుతు సర్వే నెంబర్‌ 223‌లోని 9ఎకరాల్లో ఎర్ర జెండాలు పాతి గుడిసెలు వేశారు.

అనంతరం భారీ ర్యాలీ తీసి మాట్లాడుతు గత 70సంవత్సరాలుగా పేదల పేరుపై ఉన్న భూమిని ప్రభుత్వం లాక్కోవాలని ప్రయత్నించడం హేయమైన చర్యఅని, పాస్‌ ‌పుస్తకాలను ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు మానుకొని పేదలకు సర్వహక్కులు పట్టా భూములు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం గోపాల్‌ ‌రెడ్డి, జంపాల స్వరాజ్యం, గుంట గాని ఏసు, కక్కిరేణి సత్యనారాయణ, కొండ ప్రకాష్‌, ‌సామ్రాజ్యం, కొండ వీరస్వామి, బుజ్జమ్మ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply