Take a fresh look at your lifestyle.

భార్యను హత్య చేసిన భర్త

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోఓ మహిళ భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఘోరమైన సంఘ టన స్థానిక ప్రజలను భయభ్రాం తులకు గురిచేసింది. మున్సిపాలిటి పరిధిలోని సుందరయ్యనగర్‌లో జరిగిన ఈ హత్య సంఘటనలో సుధ అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. హత్యకు సంబంధించిన విషయం  ఆమె కుమారుడి ద్వారా స్థానికులు తెలుసుకుని విషయాన్ని పోలీసులకు అందించారు. సంఫ •టన స్థలానికి చేరుకున్న సిఐ షెకూర్‌ ‌బృందం పూర్తి వివరాలు సేకరిం చారు. ఈ సంఘటనకు సంబం ధించి మణుగూరరు సిఐ షెకూర్‌ ‌తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బత్తుల సుధ మహిళను భర్త శ్రీనివాస్‌ ‌దారుణంగా పీక కోసి హతమార్చి నట్లు సిఐ తెలిపారు.

శ్రీనివాస్‌ ‌మద్యంతో పాటు వివాహేతర సంబంధాలు కలిగి ఉండేవాడని,  ఈ క్రమంలోనే వారి మధ్య వైవాహిక జీవితంలో గత కొంతకాలంగా అంతర్గత గొడవలు జరిగాయని ఈ గొడవలు తీవ్ర స్థాయికి చేరుకోవడం వలనే ఈ సంఘటన జరిగిందని తమ విచారణలో తెలిసిందన్నారు. గురువారం రాత్రి కూడ సుధ, శ్రీనివాస్‌ ‌దంపతులు వారి కుమారుడి ఎదుట తీవ్ర స్థాయిలో గొడవ జరిగినట్లు తెలిపారు. గొడవ అనంతరం తెల్లవారుజామున 5గంటల సమయంలో కూరగా యలు కోసేందుకు ఉపయోగించే కత్తితో సుధ పీక కోసి శ్రీనివాస్‌ ‌పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో సుధ తను నిద్రిస్తున్న మంచంపైనే మృతి చెందింది. కుమారుడు కార్తీక్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ సంఘటనకు శ్రీనివాస్‌ అ‌క్రమ సంబంధాలే కారణమని తెలిసిందని అన్నారు.ఈ కోణంలో దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు సిఐ పేర్కొన్నారు. ప్రస్తుతం సిఐ పరారీలో ఉన్నట్లు సిఐ తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!