Take a fresh look at your lifestyle.

ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై బడ్జెట్ సమావేశాల ప్రసంగం-2

వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత
వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతను ఇచ్చింది. రైతుబీమా కింద చనిపోయిన రైతు కుటుంబానికి రూ. 5 లక్షల బీమా ఇస్తున్నామని తెలిపారు. రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ. 10 వేల చొప్పున ఇస్తున్నామని చెప్పారు. రుణాల కింద వ్యవసాయ పరికరాలను అందించి రైతులను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. 2.10 కోట్ల ఎకరాలు సాగులో ఉన్నాయన్నారు. 2020-21 ఏడాదిలో 1.04 కోట్ల ఎకరాల్లో వరి ధాన్యాన్ని సాగు చేశారన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు. పత్తి సాగులో కూడా తెలంగాణ అద్భుతమైన రికార్డును సృష్టించింది. పత్తి సాగులో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందన్నారు. గోడౌన్‌లను కూడా పెంచామన్నారు.

వ్యవసాయ రంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి, అద్భుతాలు సృష్టిస్తున్నామని తెలిపారు.ఆసరా పెన్షన్లు అందించి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. కుటుంబంలోని ప్రతి సభ్యుడికి 6 కిలోల చొప్పున అందిస్తున్నామని తెలిపారు. ప్లలె ప్రగతి ద్వారా గ్రామాల రూపురేఖలు మారాయన్నారు. తెలంగాణ గ్రామాలను దేశానికి ఆదర్శంగా నిలిపే విధంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు.

తండాలను, గూడెలను కూడా గ్రామపంచాయతీలను తీర్చిదిద్దిన ఘనత మా ప్రభుత్వానిది అని తెలిపారు. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ, గ్రామాల అభివృద్ధికి నిధులు ఆపకుండా విడుదల చేశామన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీ, డంప్‌యార్డు, రైతువేదిక, స్మశానవాటిక, హరిత వనాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రగతి ద్వారా మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తున్నామని గవర్నర్‌ ‌తెలిపారు.

Leave a Reply