Take a fresh look at your lifestyle.

ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై బడ్జెట్ సమావేశాల ప్రసంగం-3

ఐటి సెక్టార్‌ అభివృద్దికి పెద్దపీట
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ సెక్టార్‌కు అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గవర్నర్‌ ‌తమిళిసై సౌందర్‌ ‌రాజన్‌ ‌తెలిపారు. టీఎస్‌ ఐపాస్‌తో పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. సులభతర వాణిజ్య విధానంలో టాప్‌-3 ‌రాష్ట్రాల్లో తెలంగాణ ఉందన్నారు. టీఎస్‌ ఐపాస్‌ ‌ద్వారా ఇప్పటి వరకు 15,252 పరిశ్రమలకు అనుమతి ఇచ్చామన్నారు. పరిశ్రమల ద్వారా 15.51 లక్షల ఉద్యోగాలకు అవకాశం కల్పించా మన్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలకు హైదరాబాద్‌లో డేటా బేస్‌ ‌సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక 250 ఐటీ కంపెనీలు వచ్చాయన్నారు. 250ఐటీ కంపెనీల ద్వారా 5.82లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు.2019-20లో ఐటీ ఎగుమతుల విలువ రూ. 1.28 లక్షల కోట్లకు చేరిందని అన్నారు.

రాష్ట్రంలో ఐటీ వృద్ధి శాతం 17.93కు చేరిందని గవర్నర్‌ ‌తెలిపారు. శాంతి భద్రతలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అధునాతన టెక్నాలజీతో కొత్త వాహనాలను పోలీసు శాఖకు సమకూర్చామని తెలిపారు. పేకాట క్లబ్బులను మూసేశామన్నారు. పోలీసు నియామకాలను చేపట్టామని అన్నారు. రాష్ట్రంలో 6.65 లక్షల కెమెరాలను ఏర్పాటు చేసి దేశంలోనే రికార్డు సృష్టించామన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటులో హైదరాబాద్‌ది ప్రపంచంలోనే 16వ స్థానంలో నిలిచిందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామని తెలిపారు. అధునాతన పద్ధతుల ద్వారా సైబర్‌ ‌నేరాలను అరికడుతున్నామని గవర్నర్‌ ‌చెప్పారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2.28 లక్షలకు పెరిగింది.

తెలంగాణలో 39,36,521 మందికి పెన్షన్లు అందిస్తున్నాం. పెన్షన్ల కోసం ప్రతి ఏటా రూ. 8710 కోట్లు కేటాయింపు జరుగుతోంది. త్వరలోనే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి. సోలార్‌ ‌పవర్‌ ‌రంగంలోనూ అభివృద్ధి సాధించాం. పారిశ్రామికీకరణ ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించాం. గిరిజన గ్రామాలు, తండాలకు తాగునీరు అందిస్తున్నాం. 57.26 లక్షల ఇళ్లకు మంచినీటి కనెక్షన్లు. కొత్త మున్సిపల్‌, ‌రెవిన్యూ చట్టంతో పాలనలో సమూల మార్పులు. ధరణి పోర్టల్‌ ‌విప్లవాత్మక సంస్కరణ అని రాష్ట్ర గవర్నర్‌ ‌డా.తమిళిసై తన ప్రసంగంలో తెలిపారు.

Leave a Reply