పేదల ఆరోగ్యమే లక్ష్యంగా బస్తీ దవాఖానాలు
నగరంలో పెద్ద సంఖ్యలో బస్తీదవాఖానాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నగరంలో వివిధ ప్రాంతాల్లో మంత్రులు వీటిని ప్రారంబించారు. మున్సిపల్‌శాఖ మంత్రి కె. తారక రామారావు శుక్రవారం జూబ్లీహిల్స్ నియోజక వర్గంలోని ఎర్రగడ్డ సుల్తాన్‌నగర్ కమ్యూనిటీ హాల్, వెంగళరావు నగర్‌లోని యాదగిరి నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన బస్తీదవాఖానాలను ప్రారంబించారు. ఈసందర్భంగా బస్తీ దవాఖానాలో ఉన్న ల్యాబ్సౌకర్యాలతో పాటు దవాఖానాలో చేసిన ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన వైద్య సిబ్బందితో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఇప్పటికే 123 బస్తీదవాఖానాలు ఉండగా తాజాగా మరో 45 ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ బస్తీదవాఖానాలు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓపి సేవలు అందిస్తాయని తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులను అందజేస్తారని తెలిపారు.
పేద మధ్య తరగతి ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువగా తీసుకెళ్లడానికి బస్తీదవాఖానాలు ఎంతో ఉపకరిస్తాయన్నారు. ఈసందర్భగా మంత్రి కేటీఆర్ వెంట స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్, మేయర్బొంతురామ్మోహన్ తదిత రులు ఉన్నారు. నిరుపేదలు నివసించే ప్రాంతాల్లో వారికి అన్ని హంగులతో వైద్య కేంద్రాలను నెలకొల్పే పద్దతి వల్ల భవిష్యత్‌లో వైద్య సేవలు మరింత పెరుగుతాయని శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు అన్నారు. నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జంటనగరాల్లోని వివిధ ప్రాంతాల్లో కొత్త బస్తీదవాఖానాల ప్రారంభోత్సవంలో భాగంగా శుక్రవారం స్ధానిక ప్రజా ప్రతినిధులతో కలిసి భోజగుట్ట, ఆసిఫ్‌నగర్, దత్తాత్రేయనగర్, గగన్‌మహల్, లంబాడిబస్తీ ప్రాంతాల్లో నాలుగు బస్తీదవాఖాలను పద్మారావు లాంఛనంగా ప్రారంభించారు. దోమలగూడలో స్థానిక ఎమ్మెల్యే ముఠాగోపాల్,బోజగుట్టలో ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఆసిఫ్‌నగర్‌లో స్థానిక ఎమ్మెలేఓ?య మహమ్మద్యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు మాట్లాడుతూ ప్రస్తుతం జీహెచ్ఎంసి పరిధిలో 123 బస్తీదవాఖానాలు ఉన్నాయి. వాటి ద్వారా రోజూ 10వేల మందికి వైద్యసేవలు అందుతున్నాయని అన్నారు. కొత్తగా శుక్రవారం 45 దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. దీని వల్ల మరో 4వేల మందికి వైద్య సేవలు అందుతాయని అన్నారు.