Take a fresh look at your lifestyle.

ప్రయివేటు పాఠశాలల అధిపతి ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రతినిధా..!

‘‘ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికలలో ఉపాధ్యాయ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమ పైరవీలకే ప్రాధాన్యత ఇస్తున్న సంఘాలకు సరైన గుణపాఠం నేర్పరనే భావించవచ్చు. ప్రస్తుతం గెలుపొందిన అభ్యర్థి సైతం ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చారు.నిజాయితీగా అట్టి హామీల అమలుకు కృషి చేయాలి.’’

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల ఫలితం ప్రస్తుతం ఉపాధ్యాయ లోకంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారి ంది.ఉపాధ్యాయ లోకం ఒక ప్రయి వేటు పాఠశాల అధిపతిని శాసన మండలిలో తమ ప్రతినిధిగా ఎన్ను కోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక రాజకీయ విశ్లేషకులు సైతం తలలు పట్టుకుంటున్నారు. మహబూబ్‌ ‌నగర్‌ -‌రంగారెడ్డి-హైదరాబాద్‌ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో గతంలో మూడుసార్లు అధ్యాపక, ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉపాధ్యాయులకె పట్టం కట్టిన్నప్పటికి ఇప్పుడెందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులని కాదని ఒక ప్రయివేటు పాఠశాలల అధిపతికి పట్టం కట్టినట్లు?. ఉపాధ్యాయుల సమస్యలపై సక్రమంగా స్పందించక, సొంత పైరవీలకే ప్రాధాన్యతనిచ్చిన వారికి సరైన గుణపాఠం చెప్పాడానికా? అసంతృప్తి అత్యున్నత స్థాయికి చేరినప్పుడు వోటును ఆయుధంగా ఉపయోగించి సమాజానికి ఆదర్శంగా నిలిచామని చూపాడనికా?. తమ సమస్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి హెచ్చరిక పంపాడానికా?ఎలా అర్థం చేసుకోవాలి?.
స్వయం కృతం..
ఇక్కడ ముందుగా చేర్చించాల్సింది, స్వయం కృతంతో ఓటమిని మూటగట్టుకున్న ఒక  ఉపాధ్యాయ సంఘాన్ని గూర్చి. మాటలతో కాలయాపన చేయడమే తప్ప చేతలు కార్యరూపం దాల్చకపోవడంతో సొంత సంఘం సభ్యులులే చివరి నిమిషంలో చేయిచ్చారు.ఉపాధ్యాయులు ఎదుర్కున్న అతి ముఖ్యమైన సమస్య 317 జీ ఓ. ఆ జీ ఓ పై ఆ సంఘం స్పందించక పోవడమే కాక అంత బాగుందని చెప్పడం, పండిత, పీ ఈ టి ల ఉన్నతీకరణపై గోడమీద పిల్లివాటం ప్రదర్శించడం,సి పి యెస్‌ ‌రద్దు పై నేలవిడచి సాము చేయడం,ఏకీకృత సర్వీస్‌ ‌రూల్స్ ‌పత్త లేకపోవడం,పీఆర్సీ ఏరియర్స్ ‌విషయంలో గాని,పెండింగ్‌ ‌డి ఎలపై గాని,సకాలంలో జీతాలు రాకపోవడంపై గాని, ఈ కుబేరులో పెండింగ్‌ ‌బిల్లులు,మెడికల్‌ ‌రీయంబర్స్మెంట్‌ ‌పెండింగ్‌ ‌బిల్లులు,జీపిఎఫ్‌ ‌పెండింగ్‌ ‌బిల్లులు మొదలైన పెండింగ్‌ ‌బిల్లుల విషయంలో స్పందించకపోవడంతో ఉపాధ్యాయులుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.ఆ సంఘం ఉపాధ్యాయుల అసంతృప్తిని గుర్తించి అభ్యర్థిని మార్చినప్పటికీ అతివిశ్వాసం వారి కొంప ముంచింది.
అందరికన్నా ముందే ప్రచారం పర్వం ప్రారంభించినప్పటికి, నియోజకవర్గంలో ఉన్న అన్ని పాఠశాలలను అందరికంటే ఎక్కువసార్లు సందర్శించినప్పటికీ ప్రచార పర్వంలో పాల్గొన్న సంఘ బాధ్యులు ఉపాధ్యాయులు అడిగిన ప్రశ్నలకు సంయ మనంతో సమాధానాలు ఇచ్చి ఉంటే సంతృప్తి చెందేవారు.అలా ఇవ్వకుండా ఎదురుదాడికి దిగిన సందర్భాలు చాలా ఉన్నాయి.స్వయంగా రాష్ట్ర బాధ్యులే సహనం కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ సంఘం అభ్యర్థి గతంలో ఉపాధ్యాయులపై చేసిన వ్యాఖ్యలు  వాట్సాప్‌ ‌లో వైరల్‌ ‌కావడం,ఏముందిలే చివరికి నిమిషంలో ఆశ చూపిస్తే వారే వోట్లేస్తారులే అని మాట్లాడడం ఉపాధ్యాయ లోకంలో చర్చనీయంశం అయింది.కేజీబీవీ ఉపాధ్యాయినియులకు, కాంట్రాక్ట్ ‌లెక్చరర్స్‌కు ఆర్థికంగా ఆశ చూపడం,ఉపాధ్యాయులకు ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయడం కూడా ఉపాధ్యాయ లోకాన్ని ఆలోచింపజేసింది.
అదిగాక గత ఎన్నికల్లో 54 సోదర ఉపాధ్యాయ సంఘాల మద్దతు కూడగట్టినప్పటికీ అతి విశ్వాసంతో ఆ ప్రయత్నాలు చివరి నిమిషంలో చేశారని చెప్పాలి.ఈసారి రాష్ట్ర ప్రభుత్వ మద్దతు సంపాదించకపోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.ప్రభుత్వమే మద్దతు ఇచ్చిఉంటే ప్రభుత్వ అనుకూల ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసొచ్చేవి.ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రభావం చూపించే వారు.అలా చేయకపోవడం వల్ల సంఘాలన్నీ తలోదారి చుసుకున్నాయి.ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తికి ఇప్పటికే ఎంతో నమ్మకంతో రెండు సార్లు అవకాశం ఇచ్చినప్పట్టికి ఆయన  ఉపాధ్యాయుల ఆకాంక్షలను పట్టించుకోకపోవడం,ఉపాధ్యాయుల ప్రతినిధిగా కాక రాజకీయ ప్రతినిధిగా వ్యవహరించడంతో ఈ సారి చిత్తు గా ఓడించారు. ఇక పోటీలో పోరాట సంఘం ఉన్నప్పటికీ ఉపాధ్యాయుల మనసును గెలువలేక పోయింది.ఉపాధ్యాయుల సమస్యలపై ప్రశ్నిస్తు,నిబద్ధతతో పోరాడుతున్నప్పటికి,మునుగోడు మరక వారిని వెంబడించింది.
సైద్ధాంతిక భావజాలానికి భిన్నంగా..
ఫలితాల విడుదల సందర్భంగా మొదటి ప్రాధాన్యత వోటులోను,రెండవ ప్రాధాన్యత వోటులోను ఒకరిద్దరు ఎలిమినెట్‌ అయినప్పుడు తప్ప ఎక్కడ,ఎప్పుడు గెలిచిన అభ్యర్థికి మెజార్టీతో పాటు వస్తున్న వోట్లు తగ్గకపోవటం ఆశ్చర్యాన్ని కల్గించింది. మొదటి ప్రాధాన్యత వోట్లు లెక్కిస్తున్నపుడు మొదటి నుంచి మొదటి స్థానంలో ఉంటూ చివరి వరకు సమీప ప్రత్యర్థి పై సుమారు వెయ్యి వోట్ల మెజార్టీతో ముందు వరుసలో కొనసాగారు.రెండవ ప్రాధాన్యత వోట్లు ప్రారంభమై మొదటి ఏడు మంది ఎలిమినెట్‌ అయినప్పుడు కూడా గెలిచిన అభ్యర్థి అందరి కంటే ఎక్కువ వోట్లు పొంది మొదటి వరుసలోనే ఉన్నారు. భిన్న సైద్ధాంతిక భావాజాలం ఉన్న సంఘాల అభ్యర్థులు ఎలిమినెట్‌ అవుతున్న సందర్భంలో కూడా ఎక్కువ రెండవ ప్రాధాన్యత వోట్లు గెలిచిన అభ్యర్థికి వేయడం విస్మయాన్ని గురిచేసింది.చివరికి సమీప ప్రత్యర్ది ఎలిమినెట్‌ అయినప్పుడు కూడా 30% వోట్లు గెలిచిన అభ్యర్థికి కి రావడం ఆశ్చర్యం కల్గించ్చింది.
ఉపాధ్యాయుల్లో అసంతృప్తి..
317 జీ ఓ.ద్వారా స్థానికతను కాలరాయడం, బదిలీలు, ప్రమోషన్డ్లులేకపోవడం, పండిత పీ ఈ టి ల ఉన్నతీకరణపై తేల్చకపోవడం,ఏకీకృత సర్వీస్‌ ‌రూల్స్ ‌పత్త లేకపోవడం,మొదటి వారం దాటినా జీతాలు రాకపోవడం,పీఆర్సీ ఏరియర్స్,‌పెండింగ్‌ ‌డి ఎ లు,మెడికల్‌ ‌రీయంబర్స్మెంట్‌ ‌బిల్లులు, జీపిఎఫ్‌ ‌బిల్లులు నెలల తరబడి ఈ కుబేరులో పెండింగ్‌ ‌లో ఉండడం మొదలైన విషయాల వల్ల  ఉపాధ్యాయులుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గెలిచిన అభ్యర్థి సంఘబలం తక్కువే అయినప్పటికి ఆర్థిక పరమైన అంశాలు కూడా కొంత వరకు దోహదం చేశాయని చెప్పవచ్చు.ఉపాధ్యాయులలో ఉన్న అసంతృప్తితోడై వారిని గెలుపుతీరానకి చేర్చింది.
ఎంపిక సరైనదేనా?.
అయితే ఉపాధ్యాయ లోకం అంతగా ఆలోచించి ఇచ్చిన తీర్పుపై సమాజంలో,విశ్లేషకుల్లో,ఉపాధ్యాయ లోకంలో భిన్నభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి.నిజంగానే ఉపాధ్యాయ లోకం సరైన వ్యక్తిని గెలిపించిందా? ఉపాధ్యాయ సమస్యల పట్ల ఒక్కనాడంటే ఒక్కనాడు,ఒక్క మాటంటే ఒక్క మాట మాట్లాడని వ్యక్తిని ఎలా  గెలిపించారు? ఈ ఫలితాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఉపాధ్యాయలోకం ఆ అభ్యర్థి ఇచ్చే ఆర్థిక ప్రలోభాలు ఆశించి వోట్లు వేశారా? లేక రాజీలేని పోరాటం చేస్తారని భవించారా? లేక ప్రభుత్వాన్ని ఎదిరించగల వ్యక్తి అని భావించారా? అలా భావించిన పక్షంలో పోటీల్లో ఉపాధ్యాయులుగా పనిచేసిన వ్యక్తులు,ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తులు చాలామంది ఉన్నారు.వారినైనా గెలిపించుకోవాల్సింది. ఇప్పటివరకు ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తికి,ఆ సంఘానికి గుణపాఠం చెప్పాలని భావించారా? లేదా తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంఘాలకు బుద్ధి చెప్పాలనుకున్నరా? అలా అనుకున్న పక్షంలో సమస్యల పట్ల పోరాడే వ్యక్తులు,సంఘాలు పోటీలో ఉన్నాయి.వారిని గెలిపించి ఉంటే సమాజానికి సరైనటువంటి సందేశం పొయేది. కాని ప్రైవేట్‌ ‌పాఠశాలల అధిపతిని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు గెలిపించుకోవడం ఆశ్చర్యంగా ఉంది.
ముద్ర చేరిపేయాలి..
ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికలలో ఉపాధ్యాయ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమ పైరవీలకే ప్రాధాన్యత ఇస్తున్న సంఘాలకు సరైన గుణపాఠం నేర్పరనే భావించవచ్చు. ప్రస్తుతం గెలుపొందిన అభ్యర్థి సైతం ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చారు.నిజాయితీగా అట్టి హామీల అమలుకు కృషి చేయాలి.తన పైన ఉన్న ప్రయివేటు పాఠశాల అధిపతి ముద్రను చేరిపివేస్తూ వోటు వేసి గెలిపించుకున్న ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండి ఉపాధ్యాయుల పక్షపాతిగా గుర్తిపు పొందాలి.అటు గెలుపొందిన అభ్యర్థి,ఇటు ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయుల సమస్యల పట్ల రాజీలేని పోరాటం చేయాలి.ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది.
image.png
జుర్రు నారాయణ యాదవ్‌,
‌తెలంగాణ టీచర్స్ ‌యూనియన్‌,
‌జిల్లా అధ్యక్షులు,మహబూబ్‌ ‌నగర్‌
9494019270.

Leave a Reply