Take a fresh look at your lifestyle.

దేశంలో పెరుగుతున్న కేసుల సంఖ్య

  • 24 గంటల వ్యవధిలో 35,662 మందికి పాజిటివ్‌..281 ‌మంది మృతి
  • ఒక్క కేరళలలోనే 23 వేలకు పైగా కేసులు

ఈ వారం మొదట్లో తగ్గినట్టే కనిపించిన కొరోనా కేసులు..మళ్లీ పెరుగుతున్నాయి. క్రితం రోజుతో పోల్చితే తాజాగా 3.6 శాతం మేర పెరిగి కేసులు 35 వేలకు చేరాయని శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 35,662 మందికి కొరోనా సోకింది. 281 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.34 కోట్లకు చేరగా..3.26 కోట్ల మంది వైరస్‌ను జయించారు. ఒక్క రోజే 33 వేల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3.4 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. గత ఏడాది జనవరి నుంచి మహమ్మారి కారణంగా 4,44,529 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు.

ప్రస్తుతం క్రియాశీల కేసుల రేటు 1.02 శాతంగా ఉండగా..రికవరీ రేటు 97.65 శాతానికి చేరింది. 14.48 లక్షల మందికి కొరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. సగానికిపైగా కేసులు ఒక్క కేరళలోనే నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో శుక్రవారం 23 వేలకుపైగా కేసులు వెలుగు చూడగా..131 మరణాలు చోటుచేసుకున్నాయి. ఇక మహారాష్ట్రలో 3,586 మంది వైరస్‌ ‌బారినపడ్డారు. ఇప్పటి వరకు మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 79.42 కోట్లకు చేరింది. ఈ క్రమంలో థర్డ్ ‌వ్‌వ్‌ ‌లేకున్నా మళ్లీ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది.

Leave a Reply