Take a fresh look at your lifestyle.

సిరిసిల్లలో పెను విషాదం

  • చెక్‌ ‌డ్యామ్‌లో ఈతకు వెళ్ళి 6గురు విద్యార్థులు గల్లంతు
  • గాలింపు చర్యల్లో 5 గురి మృతదేహాలు లభ్యం
  • తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్‌

సిరిసిల్ల పట్టణం నెహ్రునగర్‌ ‌శివారులోని చెక్‌ ‌డ్యామ్‌ ‌వద్ద సోమవారం 9 మంది విద్యార్థులు మానేరు నీటిలో ఈతకు వెళ్ళినట్లు గుర్తించారు. 9 మందిలో ముగ్గురు చిన్నారులు క్షేమంగా ఉండగా అందులో 6 గురు గల్లంతయ్యారు. గల్లంతైన 6గురు చిన్నారుల కొరకు సోమవారం నుండి గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం సాయంత్రం కొలిపాక గణేష్‌ అనే విద్యార్థి మృతదేహం లభ్యం కాగా మిగతా వారి కోసం మంగళవారం కూడా గాలింపు చేపట్టగా మరో నలుగురు జడల వెంకటసాయి, కొంగ రాకేష్‌, ‌శ్రీరామ్‌ ‌క్రాంతి కుమార్‌, అజయ్‌ల మృతదేహాలు లభ్యయయ్యాయి.

వీరితో పాటు సింగం మనోజ్‌ అనే ఇంటర్‌ ‌విద్యార్థి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. కాగా 5గురి మృతదేహాలను ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. విద్యార్థుల మృతితో పట్టణంలో విషాద చాయలు అలుముకున్నాయి. కాగా విద్యార్థుల గల్లంతు సమాచారం అందుకున్న మంత్రి కేటీఆర్‌ ‌యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపటాలని ఆదేశించారు. విద్యార్థుల మృతి బాధాకరమని, వారి కుటుంబాలకు సానుభూతిని తెలుపుతూ ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని తెలిపారు.

కాగా సంఘటనా స్థలాన్ని టెస్కాబ్‌ ‌చైర్మన్‌ ‌కొండూరి రవీందర్‌రావు, జిల్లా ఎస్పి రాహుల్‌హెగ్డె జడ్పి చైర్‌పర్సన్‌ ‌న్యాలకొండ అరుణ, మున్సిపల్‌ ‌చైర్‌పర్సన్‌ ‌జిందం కళ పలువురు ప్రజాప్రతినిదులు చేరుకుని గాలింపు చర్యలను పర్యవేక్షించారు.

Leave a Reply