Take a fresh look at your lifestyle.

గ్రేటర్‌ ఎన్నికలు ఆపాలంటూ హైకోర్టులో పిల్‌ ‌స్టే ఇవ్వలేమన్న ధర్మాసనం

గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికలు ఆపాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధంగా ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారనీ, అత్యవసరంగా విచారణ జరిపి ఎన్నికలు జరగకుండా స్టే ఇవ్వాలని ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ఈ ‌పిల్‌ను దాఖలు చేశారు. దీంతో సోమవారం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. త్వరలో జీహెచ్‌ఎం‌సి ఎన్నికల నోటిఫికేషన్‌ ‌విడుదల కానున్న నేపథ్యంలో రాజకీయంగా వెనుకబడిన బీసీలకు గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం నిర్వహించలేదనీ పిటిషనర్‌ ‌తరఫు న్యాయవాది పేర్కొన్నారు. విద్యారంగంలో బీసీల రిజర్వేషన్లు, రాజకీయ బీజీ రిజర్వేషన్లు వేర్వేరు ప్రక్రియలనీ, హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

పిటిషనర్‌ ‌తరఫు న్యాయవాది వాదలను విన్న హైకోర్టు ధర్మాసనం ఈ అంశంపై సుప్రీం కోర్టు పదేళ్ల క్రితం తీర్పు ఇస్తే ఇప్పటి వరకు ఏం చేశారని ప్రశ్నించింది. ఎంబీసీలపై ప్రేమ ఉంటే ఎందుకు స్పందించలేదని పేర్కొంది. ఎన్నికల షెడ్యూల్‌ ఇవ్వబోయే చివరి క్షణంలో ఆ విషయం గుర్తుకొచ్చిందా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దురుద్దేశంతో దాఖలు చేసినట్లు కనిపిస్తున్నదని వ్యాఖ్యానించింది. ఎన్నికలు ఆపే రాజకీయ ప్రణాళికతో పిల్‌ ‌దాఖలు చేశారనీ, ఈ సమయంలో స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. పిల్‌పై విచారణ చేపట్టడానికి సిద్ధమే కానీ, ఎన్నికలను ఆపేది లేదని వ్యాఖ్యానించింది. పిటిషనర్‌ ‌వ్యక్తం చేసిన అభిప్రాయాలపై కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, జీహెచ్‌ఎం‌సికి నోటీసలు జారీ చేసింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply