[ads_color_box color_background=”#71ebe7″ color_text=”#444″]’1977లో ఒక సందర్భంలో పోలీసులు నక్సలైట్స్ మధ్య ఎదురుకాల్పులు బూటకాలే అని ప్రస్తావనరాగా ‘‘నేను ముఖ్యమంత్రి అయిన తరువాత తీవ్రవాదులపై నిషేధం తొలిగించి శాంతియుతంగా స్వేచ్ఛగా వారు ప్రజలవద్దకు వెళ్లే అవకాశం కల్పిస్తాను’’ అన్నారు రెడ్డి. అయన కొద్ది నెలల్లో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడై ఆ తరువాత ముఖ్యమంత్రి అయ్యారు. కానీ, మధ్యంతరంగా పదవి నుండి వైదొలగినందున, పదేళ్ల తరువాత మళ్లీ ముఖ్యమంత్రి కాగానే తీవ్రవాద సంస్థలపై నిషేధాన్ని ఆయన తొలగించారు, ఒక పుష్కరకాలం తరువాత ఆయన తన సంకల్పాన్ని నెరవేరుకచకున్నారు. ఎంతటి పట్టుదల!!'[/ads_color_box]
1969 తెలంగాణ ఉద్యమ నాయకుడు,మాజీ కేంద్ర మంత్రి, పలు రాష్ట్రాల గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి డా।। మర్రి చెన్నారెడ్డి శతజయంతి నేడు

హిందూవులు ఆరాధించే ముక్కోటి దేవుళ్లలో ఆదిదైవం శంకరుడు అని ప్రతీతి. ఆ స్వామి సహస్రనామాలలో హరి, శుంభు, హరిహర, మహేశ్వర, పరమేశ్వరలతోపాటు శివనామం భక్తులచే అధికంగా ఉచ్ఛరించబడుతుంటాయి. భోలాశంకరుని అనేక ఆకారాలలో ఆయన లింగాకారం, నందివాహనం, శిరస్సుపై గంగాధారియైన పరమేశ్వరుడినే, మణికంఠుడినే భక్తులు నిత్యం పూజిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో(సమైక్యరాష్ట్రం
రంగారెడ్డి జిల్లాలో కేసరక్షేత్రంలో ప్రాచీన రామలింగేశ్వరస్వామి ఆలయ ఉద్ధరణకు, మల్లేశ్వరం వద్ద ఉన్న మరొక ప్రాచీన ఆలయం పాము గుడికి సౌకర్యాలు కల్పించడానికీ, ఇంకెన్నో శివాలయాలకు మరమ్మత్తు పనులకు డా।। చెన్నారెడ్డ నడుం బిగించటం వల్లనే ఆయన శివభక్తుడు అనే పేరు వచ్చి ఉంటుంది. శివభక్తుడు అనే ముద్ర పడినందుకు శంకరుడు సైతం ఆయనను అతిగా అభిమానిస్తారా అనే అనుమానం పరిశీలకులకు కలిగే సంఘటన ఒకటి 1963లో చెన్నారెడ్డి పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. ఆ రోజులలో జీర్ణదశలో ఉండి ప్రజాదరణకు దూరమైన మూడు ఆలయాలు చెన్నారెడ్డి దృష్టిని ఆకర్షించాయి. కోస్తా ఆంధ్రలో నెలకొని ఉన్న ఈ గుళ్లలో మల్లేశ్వరం పాము గుడి ఒకటి. ప్రభుత్వపరంగా తప్ప ఈ ఆలయాలకు విద్యుచ్ఛక్తి సమకూర్చే అవకావం లేదని అర్థం చేసుకున్న చెన్నారెడ్డి నాటి విద్యుత్‌శాఖమంత్రి ఎ.సి. సుబ్బారెడ్డికి విజ్ఞప్తిచేసి ఈ ఆలయాలకు విద్యుత్ సరఫరా సమకూర్చారు. రెండవ పర్యాయం డా।। రెడ్డి పాముగుడిని సందర్శించిన సందర్భంలో గుడిలో శివలింగానికి చుట్టుకొని ఉన్న సర్పరాజు సరాసరి బైటకు వచ్చి చెన్నారెడ్డి తొడపై కూర్చోవటం అక్కడ ఉన్నవారికి దిగ్భ్రాంతి కలిగించింది. నిత్యం స్నానానంతరం కొంతసేపు శివలింగాన్ని పెనవేసుకొని ఉండడం ఆసర్పానికి అలవాటు. అందువల్లనే ఆ గుడికి పాముగుడి అని ప్రచారం లభించింది.
తాము స్వగ్రామంగా ఎంచుకున్న మార్పల్లిలో చెన్నారెడ్డి ఆయన కుటుంబసభ్యులు సంగమేశ్వరస్వామి ఆలయ నిర్మాణం చేయించారు. కంచికామకొటి పీఠాధిపతి శంకరాచార్యులువారు ఈ ఆలయంలో శివలింగ ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంలో మూడుగంటలపాటు జరిగిన మహారుద్రాభిషేకంలో చెన్నారెడ్డి ఆద్యంతం భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.1970 సంవత్నరం డిసెంబర్ 17వ తేదీన హైదరాబాదు నుండి డాక్టర్ సాబ్ ఢిల్లీ వెళ్లుతున్న ఒక ప్రయాణికుల విమానం బేగంపేట విమానాశ్రయం నుండి గగనతలంలోకి ఎగరగానే అగ్నిగోళంగా మారింది. నిశ్చేష్టులైపోయిన చూపరులు తెప్పరిల్లుకోకమునుపే ఆ విమానం తిరిగి నేలపై వాలడం చెన్నారెడ్డి, ఇతర ప్రయాణీకులంతా బైటకు దూకి ప్రాణాలు రక్షించుకొవడం క్షణంలో, మెరుపులా, నమ్మశక్యం కాకుండా జరిగిపోయాయి.ఆ సంఘటన చూచినవారు నేటికీ ఇది మానవ ప్రయత్న ఫలితం కాదు దైవనిర్ణయం అంటూంటారు. చెన్నారెడ్డి పూర్వీకులు శిరిపురం గ్రామవాసులైనప్పటికీ ఆయన అక్కడే జన్మించినప్పటికి వారిది చాలా పెద్ద కుటుంబం కావడంతో తండ్రి లక్ష్మారెడ్డి మార్పల్లిలో కొంతభూమి కొనుగోలు చేసి స్వంత వ్వవసాయం మొదలుపెట్టారు. ఆ తరువాత కాలంలో డా।। చెన్నారెడ్డి సిరిపురం గ్రామంలో తన తండ్రి వాటాగా లభించిన వ్యవసాయ భూములను గృహాన్ని దాయాదులకే వదిలివేసి మార్పల్లే తన గ్రామంగా ఎంచుకొని అక్కడ వ్వవసాయ వ్యాపకాన్ని విస్తరింప చేసుకున్నారు.
ఆర్థిక వనరులు, అధికారం లేకున్నా 61వ జన్మదినాన్ని ఆనందంగా జరుపున్నవారు ఎందరో మన మధ్య ఉన్నా, వివాహషష్టిపూర్తి, రాజకీయ జీవన షష్టిపూర్తి జరుపుకున్న అసాధారణ వ్యక్తులు చాలా అరుదు. ఈ అసాధారణ కోవకు చెందిన పరిపూర్ణ వ్యక్తి డా।।చెన్నారెడ్డి ఒక్కరేనేమో! అసంఖ్యాక అనుయాయులు, అభిమానులు ‘‘డాక్టర్ సాహెబ్’’ అని ఆప్యాయతలో సంభోదించే ఈ రాజకీయ సవ్యసాచి తన అరవై సంవత్సరాల ప్రజాజీవితంలో విశ్వవ్యాప్తంగా అనేకుల హృదయాలలో చెరగని మహోన్నత స్థానాన్ని సాధించుకొనగలిగారు. ఆయన తన 78 సంవత్సరాల జీవితకాలంలో చేసిన మాధవసేవ, మానవసేవ ఫలితాల మేలి కలయికే విశిష్ఠస్థానాన్ని ఆయనకు ప్రసాదించి ఉంటుంది. కళలు, సంగీతం, సాహిత్యం పట్ల ఎంతో అభిరుచి మెండుగా దైవభక్తికల చెన్నారెడ్డి మన పవిత్ర వేదాల సారాన్నే జీర్ణించుకున్న మహాతపస్వి, అని ఆయనను అభివర్ణించారు ‘విశ్వవిఖ్యాత’ ఆధ్యాత్మిక సంగీత మధురగాయిని శ్రీమతి సుబ్బలక్ష్మి. శ్రీ చిన్మయానందస్వామి డాక్టర్‌ని అభినందిస్తూ ఆయన నిశ్చేష్ఠిత వాతావరణంలో ఒక ప్రభంజనం అని అభివర్ణించారు.ప్రధాన మఠాధిపతులందరూ చెన్నారెడ్డికి తమ ఆశీర్వచన బలాన్ని ప్రసాదించారు. పట్టపర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా డాక్టర్‌కి శతసహస్ర ఆశీస్సులు తెలుపడమే కాక అభిమానించారు. మదర్‌థెరిసా, మా ఆనందమయి కూడా చెన్నారెడ్డి పట్ల ఎంతో ఆప్యాయత, అనురాగం, గౌరవభావం కలిగిన వారనడం అతిశయోక్తి కాదు.
బాల్యంలో వివిధ ఉద్యమాలకు ఆధ్వర్యం వహించి నాయకత్వ లక్షణాలను సంతరించుకున్న చెన్నారెడ్డి 1950లో తాత్కాలిక పార్లమెంటు సభ్యుడై హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోను, కేంద్ర ప్రభుత్వంలోను మంత్రి పదవి నిర్వహించి, రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించి, నాలుగు ప్రధాన రాష్ట్రాలకు గవర్నర్ అవగలిగారు. మానవ మాధవ సేవల ఫలితాలతోపాటు తన గుణగణాలు కూడ ఆయనకు ఎల్లప్పుడూ శ్రీరామరక్షగా నిలిచాయి. సౌమ్యం, స్నేహశీలత, దయ, కరుణ, ఉపకారగుణాలేకాక ఎదుటివారివి వినే ఓపిక, అర్ధం చేసుకున్న తరువాత ఆదరించే గుణాలు ఆయన రక్తంలో మేళవించుకున్నాయి. అయిష్టతను, అసంతృప్తిని, ఆగ్రహాన్ని ఆయన ఎట్టి పరిస్థితులలోను కప్పిపుచ్చుకొనలేదు. హృదయం సుతిమెత్తనిదై, నిర్మలమైనదైనందున ‘ఉత్తమోక్షణ కోపశ్య’ అనే సూత్రాన్ని ఆయన తనకు వర్తింప చేసుకుంటాడు. అవసరమైన సందర్భాలలో రాజఠీవిని, పరిపాలకుడికి అవసరమైన కరకుదనాన్ని ప్రదర్శించడంలో కూడా డాక్టర్‌కి మరొకరుసాటి కాలేరు. నాలుగు దశాబ్దాలకు పైగా చెన్నారెడ్డితో చెలిమిచేసిన సుప్రసిద్ధ సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు పునర్జన్మపై నమ్మకంలేని నాస్తికుడు. అయినా, ‘‘మరొక •న్మే ఉంటే డాక్టర్ చెన్నారెడ్డి లేకుంటే అటువంటి ఉత్తముడే నాకు ఆ జన్మలో కూడా స్నేహితుడుగా లభించాలి’’ అని ఆకాంక్షిస్తున్నాని వ్రాసుకున్నారు.
తాను స్నేహితుడిగా భావించే వ్వక్తిని ఇతరులు ఏమన్నాసరే సహించని వ్యక్తిత్వం డాక్టర్‌ది. సహాయం చేస్తాను అని చెప్పకుండా, చెయ్యరేమోనని అవతలివాళ్లు భయపడేలాగ చేసి, సహాయం చేసే గుణం చెన్నారెడ్డిది. రాజకీయాలలో చతురత, మానవతా హృదయం ఈ రెండూ ఒక్కచోట సమపాళ్లలో మిళితమవడం అరుదు. దానికితోడు కార్యదీక్ష ఉత్తమ ఆశయాలు కలిస్తే, ఇహ చెప్పాలా? అందుకే ఆయన పూర్ణపురుషుడు అంటారు అక్కినేని ఎంతో హుందాగా. రాజకీయవ్యాపకంలో అక్షరాలు చేర్చుకొనకుండానే రాజకీయ రంగప్రవేశం చేసి అనతికాలంలోనే ప్రపంచం నలుమూలల ప్రచారసాధనాలు తరచు తన పేరు ప్రస్తావిచే ప్రేరణ కల్పించగలిగిన మరొక సుప్రసిద్ధ సినీనటుడు స్వర్గీయ నoదమూరి తారకరామారావు రెడ్డి గురించి వ్రాస్తూ ‘‘డాక్టర్ చెన్నారెడ్డి గారు దీక్ష, దక్షత, కార్యశూరతకు ప్రతిరూపం-పట్టుదలకు ప్రజాభిమానానికి సజీవస్వరూరం-సంఘ పురోగమనానికి ఆవేశం -ఆధునిక అభ్యుదయానిక మార్గ దర్శకత్వం’’ అని పేర్కొంటూ, ‘ఇటువంటి సర్వోత్తమ జాతిరత్నం పరిపూర్ణ ఆయురారోగ్యవంతులై, సర్వేశ్వర కరుణా కటాక్ష లబ్దులై, తమ ఆదర్శ సేవానిరతితో తెలుగుతల్లిని పునీతను చేయగలగాలని నా కోరిక’ అన్నారు. సినీపరిశ్రమలో మరో ధృవతార డి.వి.యస్.రాజు చెన్నారెడ్డి గురించి వ్రాస్తూ ‘‘ఆయన చాలా సూక్ష్మగ్రాహి, ఏ సమస్యనైనా ఇట్టే అవగాహన చేసుకోగల్గడమేకాక, దాని పరిష్కారం ఏ మేరకు సాధ్యమో వెంటనే తేల్చి చెప్పకలిగిన దిట్ట. సాధ్యపడే మేరకు నిర్ణయాలు తీసుకొని అమలు జరపడంలోను సాధ్యపడనివాటికి ఇతరమార్గాలు సూచించి తోడ్పడడంలోను ఆయనకు ఆయనే సాటి’’ అని అన్నారు.
పరమేశ్వర అనుగ్రహం వల్లనే కావచ్చు, ఆయాచితంగా అప్పుడప్పుడు రెడ్డి భవిష్యత్తువాణిని వినిపిస్తారు. 1946లో ప్రభుత్వ వైద్యుడుగా రాజీనామా చేసిన అనంతరం తనకు రావలసిన మూడు నెలల వేతనం బకాయిపై డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్‌తో ఘర్షణ పడిన చెన్నారెడ్డి ‘‘నేను మంత్రిని అయిన తరువాత పైసలతో సహా నా డబ్బు వసూలు చేసుకుంటాను’’ అని హెచ్చరించి వెళ్లాడు. తమ సన్నిహిత మిత్రుడు సురవరం వెంకటరెడ్డికి ఆ మర్నాడే ఈ విషయం ఆయన చెప్పారు. ‘‘1952లో అతి పిన్నవయసులో మంత్రిపదవి చేపట్టిన ‘‘కొద్దిరోజుల తరువాత హైదరాబాదు పోవుట తటస్థించినది (రెడ్డిగారిని కలిసినప్పుడు) ‘‘నీకు రావలసిన జీతం తీసుకున్నావా’’ అన్నాను. ‘ఎనిమిదిరోజుల క్రితమే పైసా బకాయిలేకుండా మొత్తం జీతం వసూలు చేసుకున్నాను. ఒక చారిటిఫండ్‌లో ఇచ్చివేశాను.’’ అన్నారు అని సురవరం వెంకటరెడ్డి పేర్కొని, చెన్నారెడ్డిని పట్టువిడవని విక్రమార్కుడుగా అభివర్ణించారు. 1977లో ఒక సందర్భంలో పోలీసులు నక్సలైట్స్ మధ్య ఎదురుకాల్పులు బూటకాలే అని ప్రస్తావనరాగా ‘‘నేను ముఖ్యమంత్రి అయిన తరువాత తీవ్రవాదులపై నిషేధం తొలిగించి శాంతియుతంగా స్వేచ్ఛగా వారు ప్రజలవద్దకు వెళ్లే అవకాశం కల్పిస్తాను’’ అన్నారు రెడ్డి. అయన కొద్ది నెలల్లో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడై ఆ తరువాత ముఖ్యమంత్రి అయ్యారు. కానీ, మధ్యంతరంగా పదవి నుండి వైదొలగినందున, పదేళ్ల తరువాత మళ్లీ ముఖ్యమంత్రి కాగానే తీవ్రవాద సంస్థలపై నిషేధాన్ని ఆయన తొలగించారు, ఒక పుష్కరకాలం తరువాత ఆయన తన సంకల్పాన్ని నెరవేరుకచకున్నారు. ఎంతటి పట్టుదల!! 1989లో అధికారంలో ఉండగా ఒక తెలుగు దినపత్రిక ఆయనను అతిగా పొగిడింది. అర్హతలేకున్నా ఆ పదవి పొందిన పత్రిక సంపాదకుడు అపరిమితంగా, జుగుప్సాకరంగా రెడ్డి భజనచేశారు.
ఒకనాడొక విలేఖరి ఆ పత్రిక ఇస్తున్న ‘‘మద్దతు’’ గురించి ప్రస్తావించగా, నేను అధికారంనుండి వైదొలిగిన అనంతరం ఈ పత్రిక, దాని ప్రధాన సంపాదకుడే అసందర్భంగా, అతిగా నన్ను విమర్శిస్తారు, దూషిస్తారు అని నాకు బాగా తెలుసు. నాకు వ్యతిరేకంగా అవకాశవాద మైత్రికి ప్రయత్నిస్తున్న స్వార్ధపరశక్తులు, విచ్ఛిన్నకారులు తమ ప్రయత్నంలో సఫలం కావచ్చుననీ నాకు తెలుసు అన్నారు చెన్నారెడ్డి. ఆయన మాటలు అక్షరాల నిజమయ్యాయి. ఆ తరువాత, ఆ పత్రిక అతిగా జనార్ధనరెడ్డి భజన చేసి అసందర్భంగా చెన్నారెడ్డిని దూషించింది. తరువాత విజయభాస్కరరెడ్డి భజన చేసింది. రాజకీయ జీవితంలో అత్యున్నతస్థాయికి ఎదిగిన వారికేకాక, సాధారణ నిత్యజీవితంలో కొద్దిపాటి ప్రాధాన్యతను పొందిన వారికి కూడ ప్రత్యర్ధులు, విమర్శకులు, శత్రువులు ఊహాతీతంగా ఉద్భవించడం సర్వసహజం. ప్రత్యర్ధులు లేకుంటే, ప్రాధాన్యతను పొందినవారు మానవమాత్రులే కాజాలరు.అందువలన చెన్నారెడ్డిని విమర్శించేవారు ద్వేషించేవారు కూడ అక్కడో ఇక్కడో ఉండవచ్చు. ఎందుకంటే ఈ ప్రపంచంలో రాజకీయ జీవితాన్ని ఎంచుకొన్నవారిలో ముఖ్యంగా అగ్రనాయకులలో ఎవరూ విమర్శకులు, ప్రత్యర్ధులు, శత్రువు లేకుండా తప్పించుకోలేదు. అయితే, చెన్నారెడ్డి మాత్రం తమ పరమశత్రువులకు కూడ అపకారం జరగాలని కోరేవారు కారు. అంతేకాక ప్రత్యర్ధుల కడుపుమంటకు కారణం ఏమిటో తెలుసుకొని చికిత్సకు ప్రయత్నం చేస్తారు. అది ఆయన సహజగుణం – ‘‘సర్వేజనాసుఖినో భవంతు’’ అనేది ఆయన మనస్థత్వం.
సీనియర్ జర్నలిస్టు,1969
ఉద్యమ సందర్భంగా జైలుకెళ్ళిన ఏకైక జర్నలిస్టు, పలు గ్రంథాల రచయిత ఆదిరాజు వెంకటేశ్వర రావు రాసిన ‘మహానాయకుడు మర్రి చెన్నారెడ్డి’ పుస్తకం నుంచి..!
Tags: marri chennareddy, birthday, sarvejana sukinobhavanthu, dr mirri chennareddy