Take a fresh look at your lifestyle.

రేపు కెసి తండాలో వ్యాక్సినేషన్‌ను పరిశీలించనున్న గవర్నర్‌

‌గిరిజనులతో కలిసి టీకా వేయించుకోనున్న తమిళి సై
ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేసీ తండాలో రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌సోమవారం పర్యటించనున్నారు. పర్యటన సందర్భంగా గిరిజనులతో కలిసి గవర్నర్‌ ‌కొవిడ్‌ ‌టీకా రెండో డోసు వేయించుకోనున్నారు.

టీకాపై గిరిజనుల్లో ఉన్న అపోహలు తొలగించే నిమిత్తం గవర్నర్‌ ‌కేసీ తండాలో టీకా వేయించుకోవాలని సంకల్పించారు. వ్యాక్సినేషన్‌లో మారుమూల ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని గవర్నర్‌ అన్నారు. గిరిజన ఆవాసాల్లో 100 శాతం వ్యాక్సినేషన్‌ ‌జరగాలని పేర్కొన్నారు.

Leave a Reply