Take a fresh look at your lifestyle.

ఈసీ పదవీకాలం నిర్ణయించే అధికారం గవర్నర్‌కు ఉంది

  • 24 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేసిన ఏపీ సర్కార్‌
  • ‌నిమ్మగడ్డ పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేసిన ప్రభుత్వం

ఆం‌ధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై రాష్ట్ర మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ ‌కుమార్‌ ‌ప్రభుత్వాన్ని సంప్రదించలేదని పంచాయతీరాజ్‌ ‌శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ‌పదవి నుంచి తనని తొలగించడంపై మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ‌హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ప్రభుత్వం కౌంటర్‌ ‌దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్‌ ‌శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ఈ కౌంటర్‌ ‌దాఖలు చేశారు. తనను తొలగించేందుకే ప్రభుత్వం ఆర్డినెన్స్ ‌తీసుకొచ్చిందని రమేశ్‌ ‌కుమార్‌ ‌చేస్తున్న ఆరోపణలు ఏవీ నిజం కావని ద్వివేదీ పేర్కొన్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకే ఆర్డినెన్స్ ‌తీసుకొచ్చామని.. ఆర్డినెన్స్ ‌రాజ్యాంగ పరిధిలోనే ఉన్నందున నిమ్మగడ్డ పిటిషన్‌ ‌తిరస్కరించాలని ప్రభుత్వం కోర్టును కోరింది. ఏపీ స్థానిక ఎన్నికల వాయిదాతో మిగతా రాష్టాల్రకు ఎలాంటి పోలిక లేదని పేర్కొంటూ ఒడిశా, మహారాష్ట్ర, బంగాల్‌లో స్థానిక ఎన్నికల వాయిదా పరిస్థితులను అఫిడవిట్‌లో ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు స్థానిక ఎన్నికలు వాయిదా పడినా కోడ్‌ అమల్లో ఉంటుందని నిమ్మగడ్డ ప్రకటించడం సరికాదని ద్వివేదీ అభిప్రాయపడ్డారు. ఎన్నికల వాయిదా తర్వాత నిమ్మగడ్డ చేపట్టిన చర్యలు సరికాదని.. ఆర్టికల్‌ 243 ‌ప్రకారం ఎన్నికల కమిషనర్‌ ‌పదవీకాలానికీ, సర్వీస్‌ ‌రూల్స్ ‌విడిగా చూడాల్సిందేనని ద్వివేదీ స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ‌పదవీకాలాన్ని నిర్ణయించే అధికారం రాష్ట్ర గవర్నర్‌కు ఉంటుందని.. గవర్నర్‌ ఆమోదించాకే ఆర్డినెన్స్ ‌తీసుకొచ్చామని పేర్కొన్నారు.

గవర్నర్‌ ఆమోదించాక ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించడం సరికాదన్నారు. రమేష్‌ ‌కుమార్‌ ‌పిటిషన్‌లో ప్రభుత్వంపై తప్పుడు అభియోగాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. తనను తొలగించడానికే ఆర్డినెన్స్ ‌తొలగించారన్న మాజీ ఈసీ ఆరోపణలను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ప్రభుత్వం తరఫున పంచాయతీ రాజ్‌శాఖ కార్యదర్శి ద్వివేదీ 24 పేజీల అఫిడవిట్‌ను హైకోర్టులో దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకే ఆర్డినెన్స్ ‌తెచ్చామని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిమ్మగడ్డ చేసిన ఆరోపణలవీ సరైనవి కావని వివరించారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ కోసం పంచాయతీరాజ్‌ ‌చట్టంలోనూ సవరణ చేశామని అఫిడవిట్‌లో పేర్కొన్నా రు. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ‌పదవీకాలం నిర్ణయించే అధికారం గవర్నర్‌కు ఉంటుందని హైకోర్టుకు విన్నివించారు. కాగా హైకోర్టు రిటైర్డ్ ‌న్యాయమూర్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)గా నియమించేలా చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ ‌తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఈ మేరకు పంచాయతీరాజ్‌ ‌చట్టం-1994 సెక్షన్‌-200‌కు చేసిన సవరణల ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ‌విశ్వభూషణ్‌ ఆమోద ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ నిమ్మగడ్డ రమేష్‌ ‌హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. తాజాగా ఏపీ ప్రభుత్వం దానిపై కౌంటర్‌ ‌దాఖలు చేసింది. దీనిపై త్వరలోనే న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!