Take a fresh look at your lifestyle.

టీకాల తయారీ, పంపిణీలో భారత్‌ ‌ముందంజ

ఉచిత వ్యాక్సినేషన్‌పై ప్రధానికి గవర్నర్‌ ‌డాక్టర్‌ ‌తమిళిసై కృతజ్ఞతలు
దేశంలో 18 సంవత్సరాలు పైబడిన అందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గవర్నర్‌ ‌డాక్టర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశ వాక్సినేషన్‌ ‌చరిత్రలో,  కోవిడ్‌ ‌మహమ్మారిపై పోరాటంలో ఈ నిర్ణయం ఒక మైలురాయిగా నిలిచిపోతుందని గవర్నర్‌ అన్నారు.

జాతినుద్దేశించి ప్రధానమంత్రి చేసిన ప్రసంగం ద్వారా దేశ ప్రజలందరికీ రాబోయే కొద్ది నెలల్లోనే టీకా అందుబాటులోకి వొస్తుందని గవర్నర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి దార్శనికతతో గత సంవత్సరం మే నెలలోనే టీకా టాస్క్ ‌ఫోర్స్ ఏర్పాటు చేసి దేశీయంగా టీకా ఉత్పత్తికి చర్యలు తీసుకోవడం వల్లనే రెండు దేశీయ టీకాలు అందుబాటులోకి వొచ్చాయన్నారు.

ఏ అభివృద్ధి చెందిన దేశానికీ తీసిపోకుండా భారతదేశం టీకా తయారీలో, పంపిణీలో ముందంజలో ఉందని,  ప్రధానమంత్రి చేపడుతున్న కార్యక్రమాలతో దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సినేషన్‌ ‌జరుగుతుందని డాక్టర్‌ ‌తమిళిసై అన్నారు. ప్రధానమంత్రి యుద్ధ ప్రాతిపదికన తీసుకున్న చర్యలతో మెడికల్‌ ఆక్సిజన్‌ ‌కొరతను అధిగమించామని, అలాగే మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తిని భారతదేశంలో పది రెట్లు పెంచామని గవర్నర్‌ ‌వివరించారు.

Leave a Reply