Take a fresh look at your lifestyle.

అమరుల త్యాగాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి

అమరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రం లో అమరవీరుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యా న్ని వహిస్తుం దని, రాష్ట్ర వ్యాప్తంగా టియూడ బ్య్లూజె తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ ‌వర్కింగ్‌ ‌జర్నలిస్ట్ ‌నిరసన లకు పిలుపునిచ్చింది. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జిల్లా శాఖ ఆధ్వర్యంలో నల్లమాస్క్‌లను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు ఎంతో మం ది అమరుల త్యాగాల వల్లనే తెలంగాణ వచ్చిందని, అటువం టి అమరుల జ్ఞాపకాలను సైతం తెలంగాణ ప్రభుత్వం చెరిపే స్తుందని వాపోయారు.

ప్రభుత్వం అమరుల పట్ల, జర్నలిస్టుల పట్ల చూపిస్తున్న వైఖరి సరిగా లేదని, ప్రభుత్వం తమ ధోరణి మార్చు కోవాలని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చలసాని శ్రీనివాస్‌, ‌విజయ్‌, ‌రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply