Take a fresh look at your lifestyle.

రైతును రాజుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం

  • మార్కెట్‌ ‌యార్డ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తా
  • భౌతిక దూరం పాటించి కరోనానునివారిద్దాం
  • ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ ‌రెడ్డి

తెలకపల్లి, మే 7(ప్రజాతంత్ర విలేకరి):  రైతును రాజుగా అభివృద్ధి చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ ‌రెడ్డి అన్నారు గురువారం మండల పరిధిలోని  లక్నరాం గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ ‌రెడ్డి అధికారులతో మాట్లాడుతూ ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు  అనంతరం ఎమ్మెల్యేకు పలువురు రైతులు మా గ్రామంలో మినీ మార్కెట్‌ ‌యార్డ్ ఏర్పాటు చేయాలని కోరగా గ్రామపంచాయతీ స్థలం కేటాయిస్తే మినీ మార్కెట్‌ ‌యార్డ్ ఏర్పాటుకు కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు అనంతరం రైతులు  పండించిన పంటల వివరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు,కొనుగోలు కేంద్రంలో ఏమైనా ఇబ్బందులు  ఉన్నా యా, గన్ని బాగ్స్ ‌సరైన  సమయంలో  ఇస్తున్నార లేదా అని తెలుసుకున్నారు, దాన్యం తరలించేందుకు లారీల కొరత లేకుండా చూసుకోవాలి అని సింగిల్‌ ‌విండో  అధికారులకు సూచించారు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు భౌతిక దూరం పాటించేలా చూడాలని వారికి మాస్కులు శానిటేషన్‌ ‌వంటి వాటిని అందుబాటులో ఉంచాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ ‌సాయి పల్లవి పిఎసిఎస్‌ ‌చైర్మన్‌ ‌భాస్కర్‌ ‌రెడ్డి వైస్‌ ‌చైర్మన్‌ ‌మామిళ్ళపల్లి యాదయ్య  సింగిల్‌ ‌విండో డైరెక్టర్‌ ‌లు ఉసన్న శ్రీనివాస్‌ ‌గౌడ్‌, అచ్యుతరెడ్డి మాజీ ఎంపిటిసి బంగారయ్య, సాయిరాం సీఈఓ ధర్మవీర్‌ ‌గ్రామపంచాయతీ వార్డు సభ్యులు సాయిరాం టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకులు రైతులు  పాల్గొన్నారు.

Leave a Reply