Take a fresh look at your lifestyle.

మహిళా అధ్యాపకులు, సిబ్బంది పట్ల ప్రభుత్వ తీరు హర్షనీయం

  • ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోషియేషన్
  •  బడ్జెట్ లో మహిళా సిబ్బంది మౌలిక సదుపాయాలు కల్పనకు నిధులు కేటాయించడం పట్ల హర్షం
  •  అరణ్య భవన్ లో మంత్రి హరీశ్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఔటా ప్రతినిధులు

విశ్వవిద్యాలయాల్లో మహిళా సిబ్బందికి అవసరమైన మౌళిక సదుపాయల కల్పనకు బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించినందుకు గాను  ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోషియేషన్  ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో  ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్  అసోషియేషన్ అధ్యక్షులు డాక్టర్.మనోహర్, ఉపాధ్యక్షులు డాక్టర్. లావణ్య ఆధ్యర్యంలో  ఔట్ ప్రతినిధులు మంత్రి హరీశ్ రావును కలిశారు. మహిళలా సమస్యలు, వారి అభ్యున్నతి పట్ల సీఎం కేసీఆర్ చూపించే శ్రద్ధ అభినందనీయమని వారు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ యూనివర్సిటీకి కోటి రూపాయల చొప్పున మహిళల సౌకర్యాల కోసం బడ్జెట్ లో కేటాయింపులు జరపడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ ఉద్యోగుల సమస్యలను మంత్రి హరీశ్ రావు వివరించారు. ఈ సమస్యలను ఆలకించిన మంత్రి , సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి తన వంతు కృషి చేస్తానని హమీ ఇచ్చారు.

Leave a Reply