Take a fresh look at your lifestyle.

పెట్రోదాడి బాధితులకు అండగా ప్రభుత్వం

  • నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం
  • దిశ యాప్‌ ‌ద్వారా సకాలంలో స్పందించిన పోలీసులు
  • బాధితురాలిని పరామర్శించిన మంత్రులు పుష్పశ్రీవాణి, బొత్స

విజయనగరం,ఆగస్ట్ 20 : ‌పెట్రోల్‌ ‌దాడి కేసులో బాధితులకు అన్నివిధాలా అండగా ఉంటామని ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, మంత్రి బత్స సత్యనారాయణ హా ఇచ్చారు. విజయనగరం జిల్లా ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రిలో బాధితురాలు రాములమ్మని వారు పరామర్శించారు. పూసపాటిరేగ మండలం చౌడవాడ గ్రామంలో ప్రియుడు పెట్రోలు దాడిలో గాయపడిన బాధితురాలిని ఏపీ మంత్రులు పుష్పశ్రీవాణి, బొత్స సత్యనారాయణ పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. బాధితురాలికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. దిశా యాప్‌ ‌ద్వారా పోలీసులు బాధితురాలిని రక్షించారని వెల్లడించారు. ఇలాంటి ఘటనల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. జరిగిన ఘటన అమానుషమని తెలిపారు. దిశ యాప్‌ ‌కారణంగానే భాదితులని సకాలంలో కాపాడగలిగామని పేర్కొన్నారు. దిశ యాప్‌ ‌నుండి సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని బాధితులను ఆసుపత్రికి తరలించారని తెలిపారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడని తెలియజేశారు. బాధితులకు మెరుగైన చికిత్స కోసం విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ ఆసుపత్రికి తరలిస్తున్నామని అన్నారు. బాధితులకు అన్నివిధాలా అండగా ఉంటామని హా ఇచ్చారు.

ఇలాంటి ఘటనలను ప్రతిపక్ష నాయకులు రాజకీయం చేయటం తగదన్నారు. చీటికీ మాటికి ప్రభుత్వంపై బురద జల్లటం అలవాటుగా మారిందని విమర్శించారు. యాప్‌ ‌నుంచి సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రక్షించారని చెప్పారు. బాధితులకు మెరుగైన చికిత్స కోసం విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని పేర్కొన్నారు. చీటికీ.. మాటికీ.. ప్రభుత్వంపై బురద జల్లడం, ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ఇలాంటి ఘటనలపై రాజకీయం చేయడం తగదని మంత్రులు హితవుపలికారు. కాగా హత్యాయత్నం చేసిన నిందితుడిని అరెస్ట్ ‌చేశామని ఎస్పీ దీపికా పాటిల్‌ ‌వెల్లడించారు. దిశ యాప్‌ ‌సమాచారంతో బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించామని బాధితురాలికి ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. వారం రోజుల్లో ఛార్జ్‌షీట్‌ ‌వేస్తామని, నిందితుడికి సహకరించిన వారిపై కూడా కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. మహిళల భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు, జిల్లా కలక్టర్‌ ఏ.‌సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply