Take a fresh look at your lifestyle.

ప్రభుత్వం చెప్పిన పంటలే వేయాలి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

ఖమ్మం సిటి, మే 20 (ప్రజాతంత్ర విలేకరి) : తెలంగాణ ప్రభుత్వం సూచించిన విధంగా రైతులు పంటలు వేయాలని అందుకు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నారని రాష్ట్రరవాణా శాఖామంత్రి పువ్వాడఅజయ్‌కుమార్‌ అన్నారు.బుధవారం ఖమ్మంనియోజకవర్గం రఘునాధపాలెం మండలం పంగిడి, చిమ్మపూడి గ్రామాల్లోని చెరువుపూడిక పనుల్లో ఉన్న ఉపాధి హామీ కూలీలకు కూరగాయలు, బత్తాయి కాయలు, మాస్క్‌లు,ఓఆర్‌ఎస్‌ ‌ప్యాకెట్లు,మజ్జిగ ప్యాకెట్లను మంత్రి పంపిణీచేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రైతులు ఎక్కడ కూడా మొక్కజొన్నలు వేయకూడదని, పత్తి, కంది, మిర్చి వేయాలని సూచించారు.

ముఖ్యంగా రఘునాధపాలెం మండలంలో వేసేదే పత్తి,మిర్చి అన్నారు. ప్రభుత్వం చెప్పిన విధంగా రైతులు పంటలు వేయడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తామన్నారు. ప్రభుత్వం కందికి పూర్తి మద్దతు ఇచ్చి పంటలను కొనుగోలు చేస్తుందన్నారు.యాసంగిలోనే మొక్కజొన్న సాగు, వానాకాలం పత్తి,కంది పంటలు ఎక్కువ సాగుచేయాలని కోరారు. మొక్కజొన్న జోలికి వెళ్లవద్దని అన్నారు.ఏఏ జిల్లాల్లో ఏ రకాల పంటలసాగు చేయాలనే అంశంపై ప్రభుత్వం పంటల మ్యాపు సిద్దం చేసి రైతులకు అందించనుందన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ‌కర్ణన్‌, అదనపు కలెక్టర్‌ ‌స్నేహలత, డిఆర్‌డిఎ పిడి పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy