Take a fresh look at your lifestyle.

కొరోనపై ప్రభుతం చిత్తశుద్దితో వ్యవహరించాలి

  • ప్రతి ఒక్కరికి టెస్టులుచేయాలి
  • సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల 

కొరోన‌ ‌వైరస్‌ ‌రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రోజుకొ లెక్క చెబుతు ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శిసాదుల అన్నారు .మంగళ వారం జిల్లాకేంద్రంలో పార్టీ అఖిలభార త కమిటీ పిలుపు మేరకు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కొరోనా వేళా ఎటువంటి ధరన్లు చేయడం నిషిద్ధమని నాయకులను టౌన్‌ ‌పోలీసులు అరెస్టు చేశారు అనంతరం విలేకరులతో జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కరో నా వైరస్‌ ‌విజృభిస్తున్న వేళా దేశంలోలా క్‌డౌన్‌ ‌విధించడం వలన ఎలాంటి పనులు లేక రెక్కాడి తే గాని నొక్కాడని పేద ప్రజలు అనేక ఇబ్బందుల కు గురవుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు వారిని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యా యని దేశంలో అన్ని రాష్ట్రాల్లో వైరస్‌ ‌బాధితులకు టెస్టులు వైద్యంఅందిస్తున్నప్పటికీ తెలంగాణలో ప్రజలకు టెస్టులు చేయడం లేదని ఈ విషయం పై ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు . ఇప్పటికైనా వెంటనే ప్రజలందరికీ టెస్ట్ ‌చేయడం అదేవిధంగా వారందరికీ వైద్య సౌకర్యం అందిం చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు ప్రతి కుటుం బానికి 7500 రూపాయలు ఆర్ధిక సహాయం అందించాలని నిత్యవసర వస్తువులు సరఫరా చేయాలని అన్నారు . పట్టణ ప్రాంతాల్లో జాతీయ ఉపాధి హామీ పనులు కల్పించాలని ఉపాధి 200 రూపాయలు గ్రామీణ ప్రాంతాలలో ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు ప్రజల ని విస్మరించిన ప్రభు త్వాన్ని వెంటనే బర్తరఫ్‌ ‌చేయాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి రాజమౌళి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అప్పలరాజు సూర్ణపు సోమయ్య జిల్లా కమిటీ సభ్యులు ఉంటా ఉపేందర్‌ ‌కుర్ర మహేష్‌ ‌పట్టణ కమిటీ సభ్యులు తోట భిక్షం తోట శ్రీనివాస్‌ ‌నాగన్న ప్రజల ఆవుల రాజు ప్రేమ లేకుండా హేమా నాయక్‌ ఎ‌ర్ర శ్రీనివాస్‌ ఎస్‌ ‌సుధాకర్‌ ‌గాడి పెళ్లి ప్రమీల జిల్లా కమిటీ సభ్యురాలు ఇంకా పట్టణ శాఖ కార్యదర్శులు పాల్గొన్నారు.

నర్సంపేటలో…
నర్సంపేట, జూన్‌ 16 (‌ప్రజాతంత్ర విలేకరి) : కరోనా వైరస్‌ను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని చిత్తశుద్ధి లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య, జిల్లా నాయకుడు పెద్దారపు రమేష్‌ ఆం‌దోళన వ్యక్తం చేశారు. మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసనలో భాగంగా పట్టణ కేంద్రంలోని అంబేద్కర్‌ ‌సెంటర్లో సిపిఎం కార్యకర్తలు, ఫ్ల కార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య, జిల్లా నాయకుడు పెద్దారపు రమేష్‌ ‌మాట్లాడుతూ వందల సంఖ్యలో కరోనా వైరస్‌ ‌కేసులు ఉన్నప్పుడు లాక్‌ ‌డౌన్‌, ‌కర్ఫ్యూ విధించిన పాలకులు లక్షల కేసులు నమోదవుతున్న సందర్భంలో లాక్డౌన్ను ఎత్తివేసి విచ్చలవిడిగా మద్యం షాపులకు, ఇతర ప్రజారవాణాకి అవకాశం కల్పించి ప్రజల్లో కరోనా వ్యాప్తి చెందడానికి పరోక్ష కారకులయ్యారు అని వారు ఆరోపించారు. మోడీ ప్రభుత్వం 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన కష్టజీవులకు ఒక్క రూపాయి కూడా అందలేదన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించి సకాలంలో డబ్బులు చెల్లిస్తానని గొప్పలు చెప్పిన కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఆచరణలో రైతుల్ని ముప్పుతిప్పలు పెట్టింది అన్నారు. వరి మొక్కజొన్న పంటలను అమ్మి నెలలు గడుస్తు న్నా నేటికీ రైతుల అకౌంట్లో డబ్బులు జమ కాలేదన్నారు. మరోవైపు పోడు రైతుల్ని భూమి నుంచి దూరం చేసేందుకు వేధింపులకు గురిచేస్తున్నారని, పేదలపై విద్యుత్‌ ‌ఛార్జీల స్లాబ్‌ ‌పెంచి విపరీతమైన భారం మోపారని ఆరోపిం చారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్‌ ‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఆదుకునేందుకు కనీసం ఆరు నెలలపాటు నెలకు 7,500 రూపాయలు అం దించాలని, ఉపాధి హామీ పని 200 రోజులు పెంచి పట్టణ ప్రాంతాల్లో సైతం అమలు చేయాలని, పోడు రైతులకు రక్షణ కల్పించాలని, విద్యుత్‌ ‌చార్జీలను రద్దు చేయాలని, ప్రభుత్వం కొనుగోలు చేసిన వరి మొక్కజొన్న పంటలకు తక్షణమే రైతులకు డబ్బులు జమ చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి వంగల రాగసుధ, పట్టణ నాయకులు మొత్తం సురేష్‌, ‌చొప్పరి సదానందం, గుజ్జుల వెంకన్న, నక్కిన పోయిన మహేష్‌, ‌భాష, ఖాజా, ప్రమీల, బాబా, రాజు స్వరూప, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

నల్లబెల్లిలో…
తెలంగాణ ప్రభుత్వం కరోనా వైద్య పరీక్షలు ప్రైవేట్‌ ‌చేయుటకు ధర నిర్ణయించడం దారుణ మని సీపీఎం మండల కార్యదర్శి కడియాల వీరాచారి విమర్శించారు. మంగళవారం మండ ల కేంద్రంలో ఫ్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో కరోనా వైరస్‌ ‌విజృంభిస్తున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం వైద్య పరీక్షలకు ధరను నిర్ణయించడం దారుణమని, బీపీఎల్‌ ‌కార్డు ఉన్న అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని సిపిఎం పార్టీ తరఫున కోరుతున్నట్లు ఆయన తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు కార్మిక శాఖ నుండి 1500 రూపాయలతో పాటు బీపీఎల్‌ ‌కార్డుదారులకు నెలకు 1500 చొప్పున అందించాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు బుడిగి సమ్మయ్య, బంగారపు రవి, గంగారపు లింగయ్య, లేఖ్య నాయక్‌, ‌మేర గుర్తి సారయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply