Take a fresh look at your lifestyle.

జర్నలిస్ట్ ‌సమస్యలపై ప్రభుత్వం స్పదించాలి

లాక్‌-‌డౌన్‌ ‌సందర్భంగా జర్నలిస్టులకు సహాయం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడంతో సామాజిక బాధ్యతగా విధులు నిర్వహిస్తున్న  జర్నలిస్ట్ ‌ప్రాణాలు పోతున్న ప్రభుత్వం స్పదించాలి టియుడబ్ల్యూజే (ఐజెయు)జిల్లా ఉపాధ్యక్షుడు గందశిరి రవి పేర్కొన్నారు. సోమవారం మరిపెడ తహశీ ల్దార్‌ ‌కార్యాలయం వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం రవి మాట్లాడుతూ కరోనా మహమ్మారిని ఎదుర్కొనడంలో ప్రాణాలకు సైతం భయపడకుండా సమాచారాన్ని ఎప్పటికప్పుడు బాహ్య ప్రపంచానికి అందిస్తున్న జర్నలిస్టులకు తక్షణ ఆర్థిక సహాయం కింద పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు.

కరోనా  వైరస్‌ ‌ను కట్టడి చేయడంలో ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను విజయవంతం చేయడంతోపాటు ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యవంతులను చేస్తూ అనుక్షణం అప్రమత్తం చేస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న జర్నలిస్టులు వైరస్‌ ‌బారిన పడే ప్రమాదం ఉండడం వలన ప్రతి జర్నలిస్టు 50 లక్షల బీమా సౌకర్యం కల్పించడంతోపాటు మాస్కులు, శానిటైజెర్లు తక్షణమే అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని అన్నారు.కరోనా బారినపడి మృతి చెందిన జర్నలిస్టు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గందశిరి రవి, మండల అధ్యక్షుడు  అక్తర్‌ ‌పాషా, జిల్లా నాయకులు జిన్నా లచ్చయ్య, మండల సహాయ కార్యదర్శి రేఖ అశోక్‌, ‌మచ్చ రాజేష్‌. ‌తదితరులు ఉన్నారు.

Leave a Reply

error: Content is protected !!