Take a fresh look at your lifestyle.

‌ప్రభుత్వం కార్మికులకు చేయూతనివ్వాలి

బూర్గంపాడు మండలం లో భవన నిర్మాణ కార్మికులు కూలీలు పని లేక కుటుంబం పోషించలేని పరిస్థితుల్లో ఆందోళన చెందుతున్నారు. కరోనా మహ మ్మారి వల్ల కేంద్ర ప్రభుత్వం లాక్‌ ‌డౌన్‌ ‌విధించడం వల్ల ఇళ్ళకే పరిమితమైన భవన నిర్మాణ కార్మి కులు పెయింటర్‌ ‌వలస కార్మికులు వారి ఆవేదన అంతా ఇంతా కాదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యులు యర్ల ఎకే అప్పారావు వారి సమస్యల పైన మాట్లాడుతు లాక్‌ ‌డౌన్‌ ‌విధించడంలో తీసుకున్న నిర్ణయం మంచిదే గాని భవన నిర్మాణ కార్మికులు ఏం తింటు న్నారు అని వాళ్ళు ఎట్లా బతుకు తారు వలస కార్మికుల పరిస్థితి ఏంటని ఆలోచించకుండా తొందర పాటుతో లాక్‌ ‌డౌన్‌ ‌విధించడం వల్ల చాలామంది వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. అంతేకాదు ప్రభుత్వం కనీసం కార్మికులకు 5,000 చొప్పున ప్రతి కుటుంబానికి బ్యాంకులో వేయాలని డిమాండ్‌ ‌చేసారు. కేరళ ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వం ఇంకా ఇతర రాష్ట్రాలు 5,000 చొప్పున నిర్మాణ కార్మికులకు వేశారు తెలంగాణ రాష్ట్రంలో కనీసం పట్టించుకోకుండా ఉండటం వల్ల చాలామంది ఉపాధి కోల్పోయి ఇతర పనులకు పోదామ న్నా పని దొరకటం లేదని అన్నారు.

అదే కాకుండా ఇసుక గోదావరిలో ఒక ఫర్లాంగు దూరంలో ఉండగానే ఉపాధి కార్మికులకు అందని ద్రాక్ష లాగా మిగిలిపోతుందని అన్నారు. చిన్న సన్నకారు రైతులు కార్మికులు ఇల్లు కట్టించుకోవాలి అన్నా దొరకని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఆదుకోవాలని కోరారు. ఈనెల 31 వ తారీఖు సోమవారం ఉదయం 10 గంటలకు బూర్గంపాడు తహశీల్దారు ఆఫీసు ముందు నిరసన వ్యక్తం చేయాలని భవన నిర్మాణ కార్మికులు పెయింటర్‌ అం‌దరూ హాజరు కావాలని భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కమిటీ కోరింది.ఈ కార్యక్రమంలో సిహెచ్‌ ‌రమణయ్య ,ప్రభాకర్‌ ,‌వెంకటేశ్వర్లు ,కోటేశ్వరరావు గూగుల్‌ ‌వీరన్న, పెరిక స్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply