Take a fresh look at your lifestyle.

పలువురు ఐపిఎస్‌లకు పదోన్నతులు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

The government issued promotions orders to many IPS

సుదీర్ఘ కాలంగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న పోలీసు అధికారులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. పలువురు సీనియర్‌ ఐపీఎస్‌లకు పదోన్నతులు కల్పిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీలకు డీఐజీలుగా, డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి లభించింది. డీఐజీ రాజేష్‌ ‌కుమార్‌, ‌శివకుమార్‌ ‌రెడ్డి, రవీందర్‌కు ఐజీలుగా, డీఐజీలుగా ఉన్న కార్తికేయన్‌, ‌రమేష్‌ ‌నాయుడు, సత్యనారాయణ, సుమతి, శ్రీనివాసులు, వెంకటేశ్వరరావు ఐజీలుగా ప్రమోట్‌ అయ్యారు.. కాగా, ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి 50మంది ఐఏఎస్‌లోను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తర్వాత రోజు ఐపీఎస్‌ల బదిలీలు ఉంటాయని భారీగా ప్రచారం సాగింది. కానీ, అలాంటిదే జరగలేదు. వాస్తవానికి ఐపీఎస్‌ల బదిలీలు, పదోన్నతులు 2018లోనే జరగాల్సింది. కానీ, అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల కారణంగా వాయిదా పడ్డాయి.

దీంతో ఏప్రిల్‌లో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా.. 2019 ఏప్రిల్‌లో రాష్ట్ర హోంశాఖ కేంద్రం అనుమతితో 23 మంది ఐపీఎస్‌లకు పదోన్నతులు కల్పించింది. వాస్తవానికి పదోన్నతితోపాటు బదిలీ తప్పనిసరి. కానీ, వీరికి పదోన్నతి దక్కినా.. పాత కుర్చీల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు 10 నెలలుగా తమకు కొత్త పోస్టింగ్‌లు వస్తాయని ఎదురు చూశారు. ఇక జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తోన్న దాదాపు 12 మంది ఐపీఎస్‌ అధికారులను నగరానికి తీసుకురావాలన్న యోచనలో డీజీపీ ఉన్నట్లు సమాచారం. వీరికి గ్రేటర్‌ ‌పరిధిలోని మూడు కమిషనరేట్లలో, ఇతర రాష్ట్రస్థాయి విభాగాల్లో పోస్టింగులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి పైరవీలకు తావులేకుండా.. పనితీరు ఆధారంగా సరైన స్థానంలో సరైన అధికారికి బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు సమాచారం.

Leave a Reply