Take a fresh look at your lifestyle.

రైతుల పంట చివరి గింజ వరకు కొనడానికి ప్రభుత్వం సిద్ధం

‌వికారాబాద్‌ :  ‌రైతులు ఎటువంటి దిగులు చెందవద్దని, పండించే ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్‌ ‌రైతులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం  ధారూర్‌ ‌మండలకేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆనంద్‌ ‌ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు గుమికూడకుండా ఉండేందుకు రైతులకు టోకెన్లు ఇచ్చి ఆ ప్రకారమే వారి నుండి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు తెలిపారు.

ముఖ్యమంత్రి  చెప్పినట్లు రైతులు పండించే పంట చివరి గింజ వరకు కొనాలని, అందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. కొరోన వైరస్‌ ‌నియంత్రణకై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తూచా తప్పకుండా అమలు చేయాలన్నారు. ఉపాధిహామీ పనులకు వచ్చే కూలీలు ఫిజికల్‌ ‌డిస్టెన్స్ ‌పాటించి, మాస్క్‌లు ధరించేలా ఈజీఎస్‌ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లాక్‌ ‌డౌన్‌ ‌కారణంగా ఏ ఒక్కరు ఆకలితో అలమటించకుండా వారికి నిత్యావసర వస్తువులు అందేలా చూడాలని ఆనంద్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో ధారూర్‌ ఎం‌పిపి  విజయలక్ష్మి, ఎడిఎ వినోద్‌ ‌కుమార్‌, ‌ధారూర్‌ ‌సర్పంచి చంద్రమౌళి, హన్మంత్‌ ‌రెడ్డి, యూనుస్‌, ‌రాజు నాయక్‌, ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply