Take a fresh look at your lifestyle.

మద్యానికి బానిసలను చేస్తున్న ప్రభుత్వం

The government is making slaves to alcohol kodandaram
మునిసిపల్‌ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ‌కోదండరాం

నర్సంపేట: తెలం గాణలో మద్యానికి బానిసలను చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడటానికి అధికార పార్టీ చూస్తోందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ‌కోదండరాం అన్నారు. మంగళవారం నర్సంపేట పట్టణంలోని పార్టీ ప్రధాన కార్య దర్శి అంబటి శ్రీనివాస్‌ ‌గృహంలో ఆయన అధ్యక్ష తన టీజేఎస్‌ ‌పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కోదం డరాం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా కొందరి చేతుల్లోకి తీసుకుని అధికారులను ఆదేశి స్తున్నారన్నారు. మునిసిపాలిటిలలో అధికార దుర్వినియో గానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

కొత్త సంవత్సరం పేరుతో యువతకు మద్యం, డబ్బులు ఎర చూపి యువతను తాగుడుకు బానిసలుగా చేస్తున్నారని కోదండరాం ఆరోపించారు. దీంతో హింసా, మహిళ పై లైంగిక దాడులు, జరుగుతున్నాయన్నారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అభివృధి మాత్రం గాలికి వదిలేసిందన్నారు. వేల కోట్ల రూపాయలు వెచించి నిర్మాణంచేసిన మానేరు డ్యామ్‌కు చిన్న చిన్న రంధ్రాలు ఐర్పడినట్లు అయన ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే మున్సిపాల్టీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జన సమితి ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజా సమస్యలే ఎ జెండాగా వస్తున్నట్లు తెలిపారు. బిసిలకు 50 శాతం రిజర్వేషన్‌ అం‌దకుండా చేస్తున్నారని ఆరోపించారు. దీంతో తెలంగాణలో రాజకీయాలు క్షీణించి పోతుందన్నారు. రిజర్వేషన్లు ప్రకటించకుండా ఓటర్ల జాబితా ఏవిధంగా విడుదల చేస్తున్నారనీ ప్రశ్నించారు. రాష్ట్రంలో దోమలు అధికంగా ప్రబలడంతో జిల్లా న్యాయమూర్తి సైతం మృత్యువాత పడ్డార ని తెలిపారు. న్యాయమూర్తి మరణంతో న్యాయస్థానం దీనిని సీరియస్‌గా తీసు కుందని, ఈ పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యాలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతుం దన్నారు. ఈసమావేశంలో టిజే ఎస్‌ ‌రాష్ట్ర పరిశీలకులు ధర్మ అర్జున్‌, ‌డోలు సుధాకర్‌, ‌పసునూరి ప్రభాకర్‌, ‌శివాజీ, రాజేంద్రప్రసాద్‌, ‌శశిధర్‌ ‌రెడ్డి, గుంటి రాంచందర్‌, ‌రవీందర్‌, ‌బొట్ల పవన్‌, ‌గుంతి సంజీవ, కందికొండ రాజు, అంబటి హన్మంతు పాల్గొన్నారు.

Tags: municipal elections, alone, TJS President, Prof Kandaram,

Leave a Reply