Take a fresh look at your lifestyle.

ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం విఫలం

  • కెజి టూ పిజి అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం
  • ఇంగ్లీష్‌ ‌డియం పేరుతో కొత్త డ్రామాలకు తెర
  • ప్రజల ప్రాణాలంటే కేసీఆర్‌కు లెక్కలేదు
  • మోదీ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు కాలేదు
  • మండిపడ్డ పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌జనవరి 18 : కేసీఆర్‌ ‌ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజుల నియంత్రణలో సర్కార్‌ ‌విఫలమైందన్నారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పిన ముఖ్యమంత్రి..ప్రజలను మోసం చేశారని చెప్పారు. మళ్లీ ఇప్పుడు ఇంగ్లీష్‌ ‌డియం స్కూల్స్ అని మరో మోసానికి తెరలేపారని రేవంత్‌ ‌ధ్వజమెత్తారు. విద్యపై కేసీఆర్‌కు నిజంగా ప్రేమ ఉంటే దాదాపు ఐదు వేల స్కూళ్లను ఎందుకు మూసివేశారో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్‌ ‌పోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదో తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేసీఆర్‌ ‌చదువును దూరం చేశారని రేవంత్‌ ఆరోపించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారు..కానీ అక్కడ స్కూళ్లను ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. యూనివర్సిటీల్లో నియామకాలు లేకపోవడంతో నిధులు ఆగిపోయా యన్నారు. టీఆర్‌ఎస్‌ ‌సర్కార్‌ అధికారంలోకి వొచ్చాక విద్యావ్యవస్థ ఆగమైందన్నారు. పిల్లలకు చదువు చెప్పించకుండా గొర్రెలు, బర్లు ఇస్తామని చెబుతూ రాతీయుగం వైపు సమాజాన్ని తీసుకెళ్తున్నారని అన్నారు.

ఐఏఎస్‌, ఐపీఎస్‌లను తయారు చేయాల్సిన విద్యావ్యవస్థలు మూతబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరికీ యూనివర్సిటీలలో 15శాతం మాత్రమే టీచింగ్‌ ‌ఫ్యాకల్టీ ఉందన్నారు. కేసీఆర్‌కు ఉద్యోగాలు భర్తీ చేయడం ఇష్టం లేదన్నారు. అందుకే ఆయా శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. రాజకీయ నిరుద్యోగులకు, కుటుంబ సభ్యులకి ఉద్యోగాలు ఇవ్వడమే సరిపోయిందన్నారు. ‘కేసీఆర్‌ ‌ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రైట్‌ ‌టు ఎడ్యుకేషన్‌ ‌యాక్ట్ అమలు చేస్తే పేదలకు 25 శాతం అడ్మిషన్లు ఫ్రీగా వొస్తాయి. యాక్ట్ ‌గురించి అడిగితే కేజీ టు పీజీ ఇస్తున్నాం అని కేసీఆర్‌ అం‌టాడు. అసలు టీచర్ల నోటిఫికేషన్‌ ‌ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వడం లేదు’ అంటూ రేవంత్‌ ‌ప్రశించారు. టీచర్లే లేనప్పుడు ఇంగ్లీషు డియం చదువును ఎలా అందిస్తారని అన్నారు. సింగిల్‌ ‌టీచర్‌ ‌స్కూల్‌ ‌పాఠశాలలను అన్నింటినీ మూసివేశారని రేవంత్‌ ‌మండిపడ్డారు. పేదలకు విద్యను దూరం చేసేందుకు కేసీఆర్‌ ‌కంకణం కట్టుకున్నారని, చదువును దూరం చేసి గోర్లు, బర్లు, చేపలు ఇస్తున్నారన్నారు.

విద్యకు పెట్టే నిధులు కేసీఆర్‌ ‌దృష్టిలో ఖర్చు-సమాజం దృష్టిలో పెట్టుబడి. తెలంగాణకు ముందు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది కాబట్టే జార్జ్ ‌రెడ్డిలాంటి లీడర్లు పుట్టారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత యూనివర్సిటీలు నిర్వీర్యం అయ్యాయని డియా చిట్‌చాట్‌లో రేవంత్‌ ఆరోపించారు. కేసీఆర్‌ ‌మనువాది. ఉద్యోగాల భర్తీ లేకుండా ఎన్ని చట్టాలు తెచ్చినా లాభం లేదన్నారు. కేసీఆర్‌ ‌రాజకీయ నిరుద్యోగులకు మాత్రమే నియమాకాలను చేపట్టారు. పాఠశాలలో కొరోనా వొచ్చి మరణాల సంఖ్య ఒక్కటి కూడా లేదు. అయినా వాటిని మూసివేశారు. బయట పార్టీలు పబ్‌ల వల్ల మరణాలు జరుగుతున్నాయి. అయినా వాటిని నియంత్రణ చేయరు ఎందుకంటే ఆదాయం ఉంటుంది కాబట్టి. బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ని చేస్తే- ఆ పార్టీ పని ముగిసిందనే విషయంలో ఎలాంటి డౌట్‌ ‌లేదు. బీజేపీ పక్క పార్టీల నుంచి తీసుకున్న నేతలతో కమిటీలు వేసుకున్నారు. కమిటీలు చూస్తేనే ఆపార్టీ దివాలా తీసిందని అర్థం అవుతుందన్నారు. అసలు రాష్ట్రంలో డీజీపీ ఉన్నాడా అని నా అనుమానం. యూపీలో ఎంఐఎంను కాదని.. ఎస్పీకి టిఆర్‌ఎస్‌ ‌సపోర్ట్ ‌చేస్తుందా అన్నారు. కేటీఆర్‌ ‌సినిమా వాళ్ళతో మాత్రమే చర్చిస్తాడు కావొచ్చన్నారు. మేము దొరలం కాదని చినజీయర్‌ ‌స్వామి మాకు రియల్‌ ఎస్టేట్‌ ‌కంపెనీ వారితో ఆహ్వానం పంపారని అన్నారు. దేవుని ముందు అందరూ సమానమే అన్న స్వాజీ ముందు మాత్రం సమానత్వం కనిపించడం లేదన్నారు.

చిన్నజీయర్‌ ‌స్వామి దగ్గర రియలేస్టేట్‌ ‌వ్యక్తులు ఉంటే ఆయన గౌరవమే తగ్గుతుందన్నారు. డీఎస్‌ది లక్కీ హ్యాండ్‌. ఆయన పీసీసీగా ఉన్నప్పుడే కాంగ్రెస్‌ ‌రెండుసార్లు అధికారంలోకి వొచ్చింది. డీఎస్‌ ‌వయసును చూడొద్దు, అనుభవాన్ని చూడాలన్నారు రేవంత్‌. ‌కొరోనాను కంట్రోల్‌ ‌చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్న రేవంత్‌ ‌రెడ్డి..కోవిడ్‌ ‌కట్టడికి సంబంధించి ప్రధాని చేపట్టిన వీడియో కాన్ఫెరెన్స్‌లో ముఖ్యమంత్రి ఎందుకు పాల్గొనలేదో సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లెక్క లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అందుకే మోడీ వీడియో కాన్ఫరెన్సుకు హాజరు కాలేదన్నారు. కొరోనా సాకుతో విద్యావ్యవస్థలు మూసివేశారు. కానీ బార్లు, వైన్‌ ‌షాపులు ఎందుకు బంద్‌ ‌చేయడం లేదని ప్రశ్నించారు. అవి ఆదాయ మార్గాలుగానే కనిపిస్తుండటంతో వాటిని క్లోజ్‌ ‌చేయడం లేదన్నారు. కేసీఆర్‌ ‌వద్ద మంత్రులు ఎవరు లేరని…మంత్రుల రూపంలో వున్నవారంతా బంట్రోతులని అన్నారు. ఇంటికో ఉద్యోగం, డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌, ‌దళిత బంధు, మూడెకరాల భూమి, ఉచిత విద్య, రైతులకు ఉచిత ఎరువులు అని లెక్కలేనన్ని హాలు ఇచ్చిన కెసిఆర్‌..‌వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. మేనిఫెస్టోలో పెట్టినవి ఐదేండ్లలో అమలు చేస్తామని చెప్పి.. ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. అందుకే 2014, 2018లకు సంబంధించిన టీఆర్‌ఎస్‌ ‌మేనిఫెస్టోలు కనిపించకుండా వెబ్‌ ‌సైట్ల నుండి తొలగించారన్నారు.

గతంలో ప్రకటించిన కేజీ టూ పిజి ఏమయ్యింది

  • విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలేవీ
  • సిఎం కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి
  • ఇప్పటికైనా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ ‌డియం పెడతామని చెప్పడం సంతోషమన్న ఎమెల్సీ

ప్రజాతంత్ర, జగిత్యాల, జనవరి 18 : రెండుసార్లు అధికారంలోకి వొచ్చినా విద్యారంగాన్ని సిఎం కెసిఆర్‌ ‌తీవ్ర నిర్లక్ష్యం చేసారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి అన్నారు. కేజీ టూ పీజీ ఉచిత విద్యనందిస్తామని చెప్పి 2014లో కేసీఆర్‌ అధికారంలోకి వొచ్చారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ ‌డియం పెడతామని చెప్పడం సంతోషమన్నారు. విద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పించినప్పడే విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు. పిల్లల భోజన సదుపాయాలపై కూడా దృష్టి పెట్టాలని కోరారు. అధికారంలోకి వచ్చాక కేవలం 2017లో ఒక్కసారి మాత్రమే ఉపాధ్యాయుల నియమాకాలు చేపట్టారని జీవన్‌ ‌రెడ్డి విమర్శించారు. గడిచిన 4 సంవత్సరాలుగా ఒక్క టీచర్‌ ‌పోస్టు నియమించలేదన్నారు.

ఖాళీగా ఉన్న 25 వేల టీచర్‌ ‌పోస్టులతోపాటు, మరో 25 వేల పోస్టులు భర్తీ చేయాలన్నారు. సీఎం ప్రకటనలు మాటలకే పరిమితమైతే.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడినట్లేనని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. మధ్యాహన భోజన కార్మికులు సమ్మెకు పోతే ప్రభుత్వం సంబర పడుతోందన్నారు. ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించాలనే చిత్తశుద్ధి ఉంటే గతంలో వేసిన తిరుపతి రావు కమిటీ నివేదికను బయటపెట్టాలన్నారు. 317 జీవోతో భార్య భర్తలను విడదీసి పాపం మూటగట్టుకుంటున్నారని కేసీఆర్‌ ‌పై మండిపడ్డారు. 317 ద్వారా ఉపాధ్యాయుల్లో ఉన్న అసంతృప్తిని డైవర్ట్ ‌చేయడానికి ఈ ప్రకటనలు చేస్తున్నారన్నారు. మహిళ యూనివర్సిటీ పేరు చెప్పి 4 ఏళ్ళు అవుతుందన్నారు జీవన్‌ ‌రెడ్డి. గతంలో ప్రకటించిన కేజీ టూ పీజీ విద్య ఏమైందని సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి నిలదీశారు. మంత్రి మల్లారెడ్డికి యూనివర్సిటీ ఎలా వొచ్చిందని ప్రశ్నించారు. ఎమ్మెల్సీలకు ప్రయివేటు కాలేజీలు ఎక్కడివని నిలదీశారు. 317 జీవోను వెంటనే రద్దు చేసి భార్యాభర్తలను ఒకే చోట చేర్చాలని జీవన్‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply