Take a fresh look at your lifestyle.

కొరోనా నేపథ్యంలో ప్రజల సమస్యలు తీర్చడంలో ప్రభుత్వం విఫలమైంది

  • ప్రభుత్వ బాండ్లను అమ్మగా వొచ్చిన ..నిధులు ఏమయ్యాయి?
  • ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి : ప్రతిపక్షాల డిమాండ్‌

రాష్ట్రంలో కొరోనా వైరస్‌ ‌నేపథ్యంలో ప్రజలు, రైతులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని టీ పీసీసీ చీఫ్‌ ఎన్‌.ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి విమర్శించారు. రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజనూ ప్రభుత్వమే కొంటుందని ముందుగా ప్రకటించిన సీఎం కేసీఆర్‌ ఇప్పుడు మూడు పంటలను మాత్రమే కొనుగోలు చేస్తుందని ప్రకటించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. బుధవారం నాంపల్లి ఏక్సిబిషన్‌ ‌గ్రౌండ్‌ ‌హాల్‌ ‌లో కరోనో వైరస్‌ ‌కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల విషయంలో టీపీసీసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అధ్యక్షత వహించారు. టీటీడీపీ అధ్యక్షులు ఎల్‌. ‌రమణ, సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌ ‌రెడ్డి, టీజేఎస్‌ అధ్యక్షులు కోదండరాం, ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్‌, ‌వి. హనుమంతరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి మాట్లాడుతూ గత నెల 22న ప్రకటించిన సాయం ఇప్పటికీ కూడా అందించలేదని మైగ్రేన్‌ ‌వర్కర్‌ ‌విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతున్నదని విమర్శించారు.

ప్రభుత్వ బాండ్లను విక్రయించగా వచ్చిన రూ. 1500ను ఏం చేసిందో ప్రభుత్వం ఇప్పటి వరకూ లెక్కచేపకపోవడం ఏమిటని ప్రశ్నించారు. తెల్ల రేషన్‌ ‌కార్డుతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ 12కిలోల బియ్యం అందరికి ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నట్గుగా చెప్పుకుంటున్న కిలో రూపాయి బియ్యం లో కేంద్రం ఇచ్చిన 5కిలోలు ఏమయ్యాయని ప్రశ్నించారు.కేంద్రం పప్పు ఇస్తామని చెప్పింది కానీ ఎక్కడా ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్‌ ‌తప్పుడు వ్యవహారం వల్లే రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఒక్క వారం పాటు లాక్‌ ‌డౌన్‌ ఉం‌టేనే ప్రభుత్వానికి వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందనీ, వైరస్‌ ‌ప్రభావం పెరిగి రోజుకు వెయ్యి మందికి టెస్టు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రైవేటు వైద్య సంస్థలలో ఎందుకు టెస్ట్ ‌చేయడం లేదని ప్రశ్నించారు.ఈ సమయంలో హరీశ్‌ ‌రావు మాటలు సరికాదని మండిపడ్డారు. వరి పంట ఎప్పుడు వస్తుందో తెలియదా…? ఇది మీ అసమర్థత కి నిదర్శనమన్నారు.పసుపు, బత్తాయి, మిర్చి,మామిడి కందులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూలంగా స్పందించాలని కోరారు. కొరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని పరిస్థితిపై చర్చించడానికి ప్రభుత్వం అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

- Advertisement -

ఇళ్ల కీరాయిల చెల్లింపు పై వాయిదా వేస్తూ ఆర్డర్‌ ‌తీసుకురావాలి: టీజెఎస్‌ అధ్యక్షుడు ప్రొ।। కోదండరామ్‌
అఖిలపక్ష సమావేశంలో టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ కోవిడ్‌ ‌వ్యతిరేక పోరాటంలో ముందుండి పోరాడుతున్న వైద్యులు, పోలీసులు ఇతర సిబ్బంది కి అఖిలపక్షం తరుపున అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు లాక్‌ ‌డౌన్‌ అమలు చేయడం ఒక్కటే సరిపోదనీ, ఏరియా ఆస్పత్రి అభివృద్ధి, 104, 108 అంబులెన్స్‌లను పునరుద్ధరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మినరల్‌ ‌ఫండ్‌ ‌ని వినియించుకోవాలని అన్నారు. తెల్ల షన్‌ ‌కార్డుతో సంబంధం లేకుండా మానవత్వంతో రాష్ట్రంలోని ప్రతి ఒక్క రికి రేషన్‌ ఇవ్వాలని ఇళ్ల కీరాయి ల చెల్లింపు పై వాయిదా వేస్తూ ఆర్డర్‌ ‌తేవాలని సూచించారు.ఆర్థిక వ్యవస్థా పై వెంటనే శ్వేతా పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు.అలాగే ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేయాలని, ప్రజా సంఘాలు అందరిని కలుపు పోవాలని సూచించారు. కొరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందనీ, నిరుపేదలకు బతకడం చాలా కష్టంగా మారిందనీ, ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరికీ రూ. 5 వేలు ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్‌ ‌చేశారు.

ఆర్థిక పరిస్థితి పై శ్వేత పత్రం విడుదల చేయాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.‌రమణ డిమాండ్‌ చేశారు.అఖిలపక్షం ఏర్పాటు కి లేఖ రాసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పట్టించుకోలేదని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు.అందరినీ కలుపుకొని పోతే వచ్చే నష్టం ఏంటని నిలదీశారు.వలస కార్మికుల కి కూడా 5వేలు,బియ్యం ఇవ్వాలని ఇప్పటి కైనా ప్రజా సంక్షేమం రీత్యా అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ ‌చేశారు.వలస కార్మికుల ను వారి సొంత ఊళ్లకు వెళ్లేందుకు చర్యలు చేపట్టాలని ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ ‌కోరారు.

Leave a Reply