Take a fresh look at your lifestyle.

రైతులను మోసం చేసిన ప్రభుత్వం

విపత్తులపై ముందస్తు హెచ్చరికేదీ
మండిపడ్డ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు

కాకినాడ,మే6: రైతులను ప్రభుత్వం అన్ని విధాలా మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. విపత్తు వస్తుందని తెలిసి ముందస్తుగా అప్రమత్తం చేయలేక పోయిందన్నారు. తడిసిన ధాన్యం కొంటారన్న భరోసా కూడా లేకుండా పోయిందన్నారు. శనివారం డియాతో మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో జరుగుతున్న అవినీతిపై చార్జిషీట్‌ ‌రూపొందిస్తామని.. దాన్ని జిల్లా ఎస్పీకే అందజేయనున్నట్లు చెప్పారు. నాలుగు రకాలుగా ఆందోళనలు చేయనున్నట్లు తెలిపారు. పోలీస్‌ ‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇస్తామన్నారు. జగన్మోహన్‌ ‌రెడ్డికి ఏ సహాయం చేసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్నామని చెప్పారు.

రైతులకు ఈ ప్రభుత్వం సంచులు ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని.. ఇందులో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. సివిల్‌ ‌సప్లై అధికారిని ఎందుకు ఎన్నో సంవత్సారాలుగా జిల్లాలో ఇలాగే ఉంచారని ప్రశ్నించారు. రైతు సమస్యలపై అఖిలపక్ష సమావేశం పెట్టాలని బీజేపీ డిమాండ్‌ ‌చేస్తుందని సోమువీర్రాజు తెలిపారు.

Leave a Reply