Take a fresh look at your lifestyle.

‌రైతులు తొందరపడొద్దు

వరిధాన్యం, పత్తి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
వానాకాలం పంటల కొనుగోలుపై సీఎం కేసీఆర్‌ ‌సమీక్ష

‌రాష్ట్రంలో వానాకాలంలో సాగైన వరి ధాన్యం, పత్తి పంటలను పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. పంటలకు పెట్టుబడి అందించడం ద్గరి నుంచి కొనుగోలు వరకు ప్రతీ విషయంలోనూ రైతులను కాపాడుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ‌వానాకాలం పంటల కొనుగోలుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 6 వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతీ గింజనూ కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఈ వానాకాలంలో రికార్డు స్థాయిలో మొత్తం 134.87 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయనీ, అందులో 52.77 లక్షల ఎకారాల్లో వరి, 60.36 లక్షల ఎకరాల్లో పత్తి, 10.78 లక్ష ఎకరాల్లో కంది సాగైందని వెల్లడించారు.

రైతులు తక్కువ ధరకు తొందరపడి అమ్ముకోవద్దనీ, వరి ధాన్యం 17 శాతం తేమకు తీసుకొస్తే ఏ గ్రేడ్‌ ‌రకానికి క్వింటాల్‌ ‌రూ. 1,888, బీ గ్రేడ్‌ 1868 ‌కనీస మద్దతు ధరను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఐకేపీ సెంటర్లు, కో ఆపరేటివ్‌ ‌సొసైటీలు, మార్కెటింగ్‌ ‌శాఖ ద్వారా రైతుల వరి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. పత్తిని కూడా కాటన్‌ ‌కార్పొరేషన్‌ ‌ద్వారా పూర్తిగా కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు. ఈ విషయంలో సిసిఐతో నిరంతరం చర్చలుజరుపుతున్నామనీ, రైతులకు ఏవైనా సందేహాలు ఉంటే ఎప్పటికప్పుడు కాల్‌ ‌సెంటర్‌ ‌ద్వారా నివృత్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, కమలాకర్‌, ‌రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ ‌శర్మ, ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ‌సివిల్‌ ‌సప్లయిస్‌ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌మారెడ్డి శ్రీనివాసరెడ్డి,, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్‌, ‌వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధనరెడ్డి, మార్కెటింగ్‌ ‌శాఖ డైరెక్టర్‌ ‌లక్ష్మీబాయి పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply