Take a fresh look at your lifestyle.

‌భారత్‌ ‌జోడో యాత్ర లక్ష్యం నెరవేరింది

  • ప్రజల సమస్యలను కళ్ళారా చూశాను
  • జోడో యాత్ర ఎన్నో పాఠాలు నేర్పింది
  • ముగింపు సభలో రాహుల్‌ ‌ప్రసంగం

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌జనవరి 30:  భారత్‌ ‌జోడో యాత్ర లక్ష్యం నెరవేరిందని కాంగ్రెస్‌ ‌నేతల రాహుల్‌ ‌గాంధీ అన్నారు. జోడో యాత్ర ఊహించిన దానికంటే విజయవం తమైందన్నారు. అన్ని వర్గాల ప్రజల కష్టాలను దగ్గరుండి తెలుసుకున్నారు. ఓ దశలో యాత్ర కొనసాగిస్తానా అన్న భయం కూడా వేసిందన్నారు. అయితే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మోదీ సర్కార్‌కు కనబడడం లేదన్నారు. జోడో యాత్ర నాకెన్నో పాఠాలు నేర్పిందన్నారు. భారత్‌ ‌జోడో యాత్ర ముగిసింది. కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర ముగింపు సభను శ్రీనగర్‌లో నిర్వహించారు.  అనంతరం ఆయన డియాతో మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా 145 రోజుల పాటు జోడో యాత్ర సాగిందన్నారు. ప్రజల సహకారం చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని రాహుల్‌ ‌పేర్కొన్నారు. ప్రజల సహకారం లేనిది ఏ పని ముందుకు సాగదన్నారు.

కశ్మీర్‌ ‌ప్రజలకు దేశమంతా అండగా ఉందన్నారు. కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ఇస్తామని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌ 7‌న రాహుల్‌ ‌పాదయాత్ర కన్యాకుమారిలో ప్రారంభమైంది. సుమారు 5 నెలలపాటు 4 వేల కి. మేర ఈ యాత్ర కొనసాగింది. ఇక జనవరి 30న కశ్మీర్‌లో ముగింపు సభ జరిగింది. ’మిలే కదం.. జుడే వతన్‌  అనే నినాదంతో ఈ యాత్ర ప్రారంభమైంది. 12 రాష్టాల్ల్రో రాహుల్‌ ‌యాత్ర సాగింది. అడుగడునా రాహుల్‌కు ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. కశ్మీర్‌లోని లాల్‌చౌక్‌లో జాతీయ జెండా ఎగురవేయడంతో ఈ యాత్రకు ముగింపు పలికినట్లయ్యింది. 145 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగింది. సుమారు ఐదు నెలలపాటు కొనసాగిన పాదయాత్రలో వివాదాలకు కొదువేం లేదు. చివరికి ఆయన ధరించిన టీ షర్ట్ ‌కూడా వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచింది. ముఖ్యంగా రాహుల్‌ ‌గాంధీ రూ.41వేల విలువచేసే టీ షర్టుపై యాత్ర ఆరంభంలోనే భాజపా తీవ్ర విమర్శలు చేసింది. వీర్‌ ‌సావర్కర్‌, ‌కొవిడ్‌ ‌నిబంధనలు వంటి అంశాలన్నీ చర్చనీయాంశమయ్యాయి. మరోవైపు ఈ పాదయాత్రలో రాహుల్‌ ‌పెళ్లిపై ఎన్నోసార్లు ప్రశ్నలు సైతం తలెత్తాయి. అన్నిటికీ చాలా సరదాగా సమాధానాలిస్తూ వెళ్లారు.

మంచుతో ఆడుకున్న రాహుల్‌, ‌ప్రియాంక
ఒకిరిపై ఒకరు మంచుగడ్డలు విసురుకుని ఆనందం

కాశ్మీర్‌ అం‌దాలకు ఆ ఇద్దరు ఫిదా అయ్యారు. మంచుతో చిన్నపిల్లిల్లా మారిపోయారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ.. మంచులో సరదాగా గడిపారు. చిన్నపిల్లల్లా మారిపోయి.. ఒకరిపై మరొకరు మంచు గడ్డలు విసురుకుంటూ ఎంజాయ్‌ ‌చేశారు. భారత్‌ ‌జోడో యాత్ర ముగింపు సందర్భంగా..ఈ దృశ్యం ఆవిష్క•తం అయ్యింది. కశ్మీరీ మంచు అందాలకు ఫిదా.. చిన్నపిల్లల్లా మారిపోయిన రాహుల్‌, ‌ప్రియాంకలు పరస్పరం మంచుగడ్డలు విసురుకున్నారు. జమ్ముకశ్మీర్‌లో మంచు అందాలను ఆస్వాదిస్తూ ఆనందం పంచుకున్నారు.  రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ.. మంచులో సరదాగా గడిపారు. చిన్నపిల్లల్లా మారిపోయి.. ఒకరిపై మరొకరు మంచు గడ్డలు విసురుకుంటూ ఎంజాయ్‌ ‌చేశారు. భారత్‌ ‌జోడో యాత్ర ముగింపు సందర్భంగా జమ్ముకశ్మీర్‌ ‌పీసీసీ ఆఫీస్‌లో..కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే జాతీయ జెండాను ఆవిష్కరించారు.  రాహుల్‌గాందీ •భారత్‌ ‌జోడో యాత్ర ఆదివారం ముగియగా
సోమవారం ఇక్కడ సభను ఏర్పాటు చేశారు.

యాత్రలో రాహుల్‌తో కలిసి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. శ్రీనగర్‌లోని కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యాలయంలో సోమవారం రాహుల్‌ ‌గాంధీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.  భారత్‌ ‌జోడో యాత్రలో కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌గాంధీతో మరో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. అచ్చు రాహుల్‌ ‌గాంధీని పోలిన యువకుడు కనిపించడంతో అతనితో ఫోటో దిగాడు కాంగ్రెస్‌ ఎం‌పీ. ఇద్దరు కలిసి చేయి కలిపి చిరునవ్వులు చిందిస్తు ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ  యువకుడి పేరు మహమ్మద్‌ ‌ఫైసల్‌ ‌చౌధరి. ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ ‌జిల్లా మవానా తహసీల్‌కు చెందిన యువరైతు.దూరం నుంచి చూస్తే అచ్చు రాహుల్‌ ‌పోలికలతో కనిపించే్గ ఫైసల్‌•ను స్థానికులు ’ఛోటా రాహుల్‌’ అని పిలుస్తారు. కాంగ్రెస్‌ అభిమాని అయిన తండ్రి మరణానంతరం బీఏ చదువును సగంలో ఆపి వ్యవసాయం చేపట్టినట్లుగా ఫైసల్‌  ‌తెలిపాడు. భారత్‌ ‌జోడో యాత్ర ఢిల్లీలో ఉండగా రాహుల్‌ ‌బృందంతో కలిసి నడకను మొదలు పెట్టాడు.  యాత్రికులతో కలిసి నడుస్తుండగా రాహుల్‌ ‌దృష్టిలో పడటంతో్గ ఫైసల్‌•ను దగ్గరకు పిలిచి అయిదు నిమిషాలు మాట్లాడారు.

Leave a Reply