Take a fresh look at your lifestyle.

‌ప్రతీ రైతుకూ రైతుబంధు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

రైతుల పంటల రుణమాఫీకి సంబంధించి 25 వేల రూపాయలఃలోపు ఇవ్వడం జరిగిందని, వానాకాలం రైతు బంధు ప్రతి ఒక్క రైతుకు అందాలన్నదే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. బుధవారం మంత్రి తన్నీరు హరీష్‌రావు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ..ప్రతి గ్రామంలో సకాలంలో రైతులకు ఎరువులు, విత్తనాలు అందేలా ప్రతీ గ్రామ సర్పంచ్‌, ‌పీఏసీఎస్‌ ‌చైర్మన్లు, మార్కెట్‌ ‌కమిటీ చైర్మన్‌ ‌ప్రత్యేక శ్రద్ధ, చొరవ చూపాలని.., గ్రామాల వారీగా రైతులు వానా కాలం ఏ పంటలు సాగు చేస్తున్నారని, గ్రామాలకు విత్తనాలు, ఎరువులు వచ్చాయా.. లేదా అంటూ.. గ్రామాల వారీగా సర్పంచ్‌, ‌వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకుని, ఎరువులు, విత్తనాల సరఫరాపై ఎప్పటికప్పుడు అందించేలా పీఏసీఎస్‌ ‌చైర్మన్లు, వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. కొరోనా ఉధృతి విజృంభిస్తున్న తరుణంలో వర్షాకాల దృష్ట్యా ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున, కొరోనా పట్ల ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని కరోనా విషయంలో మరింత జాగ్రత్తలు వహించాలని ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించి చెప్పాలన్నారు.

ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుచి, శుభ్రత అలవాటు చేసుకుని వేడి నీరు తాగండి. జలుబు చేస్తే ఆవిరి పట్టినట్లు, పసుపు వేసి ఆవిరి పట్టలన్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాన్ని తీసుకోండి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు.ప్రతి అరగంటకు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోండనీ, భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దు. గోరు వెచ్చని నీళ్లు తాగడం, కరోనా వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు విటమిన్‌ ‌సీకి సంబంధించన సంత్ర, ఉసిరి, నిమ్మ, బత్తాయి, దానిమ్మ, జామ, మామిడి తదితర సీ విటమిన్‌ ఎక్కువగా తీసుకుంటే.. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామ పంచాయతీ మైకు సిస్టమ్‌, ఇతర మీటింగులు, ప్రత్యేక చర్చల ద్వారా వేడిగా ఉన్న ఆహారం తినేలా ప్రజలకు అవగాహన కల్పించాలని స్థానిక ప్రజా ప్రతినిధులకు మంత్రి హరీష్‌రావు సూచించారు.

Leave a Reply