Take a fresh look at your lifestyle.

‌గ్రామాభివృద్ధియే పల్లెప్రగతి లక్ష్యం

The goal, rural development,prashant jeevan, warangalవరంగల్‌ అర్బన్‌: ‌పల్లెప్రగతిలో భాగంగా అర్బన్‌ ‌కలెక్టర్‌ ‌ప్రశాంత్‌ ‌జీవన్‌ ‌పాటిల్‌ ‌సోమవారం జిల్లాలోని మండలాల్లో అధికారులతో కలిసి గ్రామాల్లో పర్యటించారు. గ్రామాభివృద్ధిలో భాగంగా వివిధ గ్రామాల్లో నిర్వహిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమాలను పరిశీలించారు. అందులో భాగంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని వాటర్‌ట్యాంక్‌ (‌ట్రాక్టర్‌)‌ను నడిపి మొక్కలకు నీరు పోశారు. అనంతరం కమలాపురం మండలంలోని శంభునిపల్లె నర్సరీ ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, డంపింగ్‌ ‌యార్డు, వైకుంఠధామం నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభి వృద్ధియే పల్లెప్రగతి లక్ష్యమని తెలిపారు. వైకుంఠధామం కాంపౌండ్‌ ‌వాల్‌కు నిధులు మంజూరు అయ్యాయని, అవెన్యూ ప్లాంటేషన్‌, ఇం‌కుడు గుంతలు, డంపింగ్‌, ‌స్మశాన వాటికల నిర్మాణం పూరె్త యిన గ్రామాలకు నగదు ప్రోత్సాహకం అంది స్తామని తెలిపారు. అనంతరం భీంపెళ్లి కమ్యూ నిటీ టాయిలెట్‌ ‌ప్రారంభించారు. గ్రామంలోని వీధుల్లో రోజువారీ చెత్త సేకరణ షెడ్యూల్డ్‌పై ప్రజలకు అవగాహన కల్పిం చాలన్నారు. స్మశానవాటిక నిర్మాణ పనులను నెల రోజుల్లో పూర్తి చేయా లని తెలిపారు. అదేవిధంగా జిల్లా పరిషత్‌ ‌ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులను కలిశారు. అనంతరం వారితో మాట్లాడారు. విద్యార్థుల సంఖ్యను పెంచాలని, వచ్చే విద్య సంవత్సరంలో వార్డుకు 10 చొప్పున విద్యా ర్థులను చేర్పించాలన్నారు. 10వ తరగతిలో వందశాతం ఉత్తీర్ణత పెరిగేందుకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయాలని హెచ్‌ఎమ్‌ను ఆదేశించారు. అనంతరం కన్నూర్‌లో వైకుం ఠధామం నిర్మాణంపై సర్పంచ్‌ ‌రామ చంద్ర రావును ఆయన అభినందించారు.

Tags: The goal, rural development,prashant jeevan, warangal

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply