Take a fresh look at your lifestyle.

పత్రికల లక్ష్యం ప్రజాశ్రేయస్సే కావాలి: కలెక్టర్‌

District Collector, Dr. Sharath

‌పత్రికల లక్ష్యం ప్రజాశ్రేయస్సే కావాలని మంచి వార్తలతో సమాజాబివృద్దికి పాటుపడాలని జగిత్యాల జిల్లా కలెక్టర్‌ ‌డాక్టర్‌ ‌శరత్‌ అన్నారు. సోమవారం కలెక్టర్‌ ‌చాంబర్‌లో ప్రజాతంత్ర దినపత్రిక రూపోందించిన 2020 క్యాలెండర్‌ను అయన అవిష్కరించారు. అనంతరం కలెక్టర్‌ ‌మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మద్య అనుసందానంగా పత్రికలు పనిచేస్తున్నాయని ప్రజల సమస్యలను కథనాలుగా ప్రభుత్వానికి పత్రికల ద్వారా తెలియచేస్తున్నాయన్నారు.

ఆలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ది పనులను ప్రజలకు వివరించడంతో పత్రికలు ప్రధానపాత్ర పోషిస్తున్నాయన్నారు. సమాజ నిర్మాణంలో పత్రికల పాత్ర ఇంకా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈకార్యక్రమములో ప్రజాతంత్ర ప్రతినిధులు మెన్నేని రవీంరద్‌రావు, సిగిరి ప్రభాకర్‌తోపాటు నమస్తే తెలంగాణ జిల్లా బాద్యులు వుత్తూరి మహేష్‌కుమార్‌, ‌వుదయం విలేకరి బుక్యా రాజునాయక్‌తోపాటు డిపిఆర్‌వో వెంకటస్వామి, టైపిస్ట్ ‌రాంబాబులు ఉన్నారు.

Tags: The goal, magazines, public collector,

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply