Take a fresh look at your lifestyle.

ఆత్మనిర్భర భారత్‌ ‌లక్ష్యం

స్వయం సమృద్ధికి బలమైన సంకల్పం
కొరోనాను ఎదుర్కొనేలా కార్యాచరణ సన్నద్దం
దేశ సరిహద్దుల్లో పటిష్ట నిఘాతో గట్టి జవాబు
ప్రజల ఆరోగ్యానికి భరోసాగా ఆరోగ్య కార్డు
నాణ్యమైన వస్తువుల అడ్డాగా భారత్‌

ఆత్మనిర్భర భారత్‌ ‌లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని..భారత స్వాతంత్య్ర సంగ్రామం ప్రపంచానికి ఒక దీప శిఖలా నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు. సవాళ్లు మన సంకల్పాన్ని మరింత సుధృడం చేస్తాయన్నారు.74వ స్వాతంత్య ్రదినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసి, దేశప్రజలనుద్దేశించి ప్రధాని మాట్లాడారు. భారతీయ రక్షణ దళాలు, పోలీసులు దళాలు మనల్ని నిరంతరం రక్షిస్తున్నాయన్నారు. దేశ సరిహద్దులో అంతర్గత భద్రతను కాపాడుతున్న సైనికులు, పోలీసులకు వందనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంతో పాటు దేశం విపత్కర పరిస్థితుల్లో పయణిస్తోందని, కొరోనా తెచ్చిన ముప్పు ప్రపంచాన్ని పట్టి పీడిస్తోందన్నారు. కొరోనా విపత్కర పరిస్థితుల్లో పని చేస్తున్న వైద్య సిబ్బందికి ప్రణామం చేశారు. మహమ్మారి నివారణకు వైద్యులు, నర్సులు, అంబులెన్స్ ‌డ్రైవర్లు అందరూ ప్రజల ఆరోగ్యానికి కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. కొరోనా ఒక్కటే కాదు దేశవ్యాప్తంగా వరదలు, ప్రకృతి విపత్తులు మనల్ని చుట్టు ముట్టాయన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకతాటిపై ఉండి విపత్తులను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. 5 ఏళ్లు వచ్చిన ప్రతి బిడ్డ సొంత కాళ్లపై నిలబడాలని కుంటుంబం కోరుకుంటుందని, ఈ క్షణం స్వయం సమృద్ధికి బలమైన సంకల్పంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఆత్మనిర్భర్‌ అనేది కేవలం నినాదం కాదని, ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ‌కోసం మనందరి సంకల్పం కావాలన్నారు. దేశ యువత ఆత్మవిశ్వాసంతో ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ‌సాధించాలని చెప్పారు. భారత్‌ అం‌టే క్రమశిక్షణ మాత్రమే కాదు ఉన్నత విలువలతో కూడిన జీవనమన్నారు. ప్రపంచం ఇప్పుడు పరస్పర ఆధారితం.. ఏ ఒక్కర ఏకాకిగా మనలేరన చెప్పారు. విశ్వకల్యాణానికి మనవంతు కూడా నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.

వస్తూత్పత్తిలో ముందడుగు వేద్దాం..ప్రతి పౌరుడికి ఆరోగ్య కార్డు
ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ అం‌టే ప్రపంచంతో మరింత మమేకం కావడమన్నారు. మన శక్తి ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మలచుకోవాలని సూచించారు. ఇంక ఎంతకాలం ముడి పదార్థాల ఎగుమతి దారుగా మిగిలిపోదాం అని ప్రశ్నించారు. ప్రపంచానికి కావాల్సిన వస్తు ఉత్పత్తిని అత్యున్నత ప్రమాణాలతో తయారు చేద్దామని పిలుపునిచ్చారు. ఆధునిక వస్తు ఉత్పత్తే ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ అన్నారు. ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ అం‌టే మన రైతులు నిరూపించి చూపారని, భారత్‌ను ఆకలి రాజ్యం నుంచి అన్నదాతగా మార్చారని కొనియాడారు. మన రైతులే ప్రేరణగా అన్ని రంగాల్లో ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ను సాధిద్దామన్నారు. భారత్‌ ‌తయారీ వస్తువులను ప్రపంచం ఆదరించేలా వస్తు ఉత్పత్తి చేద్దామన్నారు. భారత్‌ అం‌టే నాణ్యమైన వస్తువుల అడ్డా అన్న ఆత్మగౌరవాన్ని తేవాలన్నారు. ఒక నాడు భారత వస్తువులంటే విశ్వవ్యాప్తంగా గౌరవం ఉండేదని, మళ్లీ భారత వస్తువులకు పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం చేయాలన్నారు. ఇదే సందర్భంలో ప్రతి పౌరుడికి ప్రత్యేక నంబర్‌తో కార్డు ఏర్పాటు చేస్తున్నామని మోదీ ప్రకటన చేశారు. తద్వారా పౌరులకు అందిన వైద్యం వివరాలు కార్డులో నమోదవుతాయన్నారు. దేశంలో ఏ డాక్టర్‌ ‌దగ్గరకు వెళ్లిన కార్డు ద్వారా వివరాలు తెలుస్తాయని మోదీ తెలిపారు. దేశ వ్యాప్తంగా వైద్య కాలేజీలు, వెల్‌నెస్‌ ‌సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. నేటి నుంచి జాతీయ డిజిటల్‌ ‌హెల్త్ ‌మిషన్‌ ‌ప్రారంభించనున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. 75 ఏళ్ల స్వతంత్య భారతంలో ఎన్నో సాధించామని, మనం ఇంకా సవాళ్లు ఎదుర్కొంటున్నామన్నారు. 75 ఏళ్లు పూర్తయ్యే సరికి మరో ముందడు వేస్తామని స్పష్టం చేశారు. ప్రాణాలు తృణప్రాయంగా వదలి మన పూర్వీకులు స్వాతంత్య్రం సాధించి పెట్టారన్నారు. జాతి ఒక్కటై స్వాతంత్య ్రసంగ్రామంలో నిలిచిందని, భారత స్వాతంత్య సంగ్రామం ప్రపంచానికి ఒక దీప శిఖవంటిదన్నారు. స్వాతంత్య్ర కోసం పోరాడుతున్న అనేక దేశాలకు ప్రేరణగా నిలిచిందని చెప్పారు. విస్తరణ వాదం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రపంచానికి భారత్‌ ‌కొత్త దారి చూపిందన్నారు. ప్రపంచమంతా భారత్‌ ‌చూపిన బాటలో నడిచి కొత్త ప్రపంచానికి నాంది పలికాయన్నారు. స్వాతంత్య ్రసంగ్రామ నిరంతర ప్రేరణతో దేశం ముందుకు సాగుతోందని, ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ‌పేరుతో దేశం మరో ముందడుగు వేసేందుకు సిద్ధమైందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశం ఒక్కటై నిలబడిందన్నారు.

కొరోనా కాలంలో కొత్తదారులు వెతుక్కుందాం
కొరోనా కష్టకాలంలోనూ మనం కొత్తదారులు వెతుక్కుందామన్నారు. పీపీఈ కిట్లు, ఎన్‌95 ‌మాస్కులు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉండేదని, నాలుగు నెలల్లో స్వయం సమృద్ధి సాధించి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు గుర్తు చేశారు. ఓకల్‌ ‌ఫర్‌ ‌లోకల్‌ ‌మాటను నిలబెట్టుకుందామని ప్రధాని పిలుపునిచ్చారు. మన ఉత్పత్తులను మనం గౌరవించకపోతే ప్రపంచం ఎలా గౌరవిస్తుందని, మన అనందరం మన ఉత్పత్తులకు మన ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పిద్దామనన్నారు. మన యువతకు కొత్త అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నామని, ఆహార ఉత్పత్తి నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో కొత్త అవకాశాలకు యత్నాలు చేస్తున్నట్లు మోదీ తెలిపారు. వ్యవసాయం నుంచి బ్యాంకింగ్‌ ‌వరకు అన్ని రంగాల్లో సంస్కరణలు ప్రారంభించామన్నారు. ఎఫ్‌డీఐల్లో గతేడాది 18 శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొన్నారు. ఆత్మనిర్భర్‌ ‌భారత్‌లో భాగంగా వందకుపైగా వస్తువులపై దిగుమతిపై నిషేధం విధించినట్లు ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.  మేకిన్‌ ఇం‌డియాలో భాగంగా భారత్‌లో రవాణా హెలీక్యాపర్ల నుంచి రైఫిళ్ల వరకు సొంతంగా తయారు చేయనున్నట్లు ప్రకటించారు. హిమాలయాల నుంచి సముద్ర తీరం వరకు ఏ ఆపద వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఇందులో భాగంగా రోడ్ల నిర్మాణం వేగవంతం చేశామన్నారు.

పునరుత్పాదకతలో ఐదోస్థానం
పునరుత్పాదక ఇంధన వనరుల విషయంలో భారత్‌ ఐదోస్థానంలో నిలిచిందన్నారు. 100 నగరాల్లో కాలుష్యం తగ్గించే చర్యలు చేపట్టామని మోదీ తెలిపారు. సముద్ర తీరంలోని 1300 ద్వీపాలను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. చెన్నై నుంచి సముద్ర అంతర్భాగ ఆప్టికల్‌ ‌ఫైబర్‌ ‌గ్రిడ్‌ ‌నిర్మాణం ప్రారంభించామన్నారు. ఢిల్లీ, చెన్నై మాదిరిగానే అండమాన్‌లోనూ ఇంటర్నెట్‌ ‌సౌకర్యం ఉంటుందన్నారు. సముద్ర తీర ప్రాంత జిల్లాల్లో ఎన్‌సీసీ కెడెట్లను తయారు చేస్తామన్నారు. వారిని నావికాదళం పర్యవేక్షిస్తుందని చెప్పారు. భూ సరిహద్దు కలిగిన ప్రాంతాల్లో ఎన్‌సీసీ కెట్లను సైన్యం పర్యవేక్షిస్తుందని వివరించారు. భారత్‌ ‌ప్రపంచంలో ఎవరికన్నా తక్కువ కాదని, ప్రపంచ స్థాయి ఉత్పత్తులకు కేంద్రంగా మారనుందన్నారు. ఉత్తమ ఉత్పత్తుల దేశంగా ఎదుగుతోందన్నారు. మనందరం లోకల్‌ ‌కోసం వోకల్‌గా మారాలని పిలుపునిచ్చారు. మన ఉత్పత్తులకు తగిన మార్కెట్‌ను మనమే సృష్టించుకోవాలన్నారు. మన వస్తువలకు మనం గౌరవం ఇస్తేనే ప్రపంచం గౌరవం ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా మోదీ అయోధ్య రామమందిర నిర్మాణానికి కూడా ప్రస్తావనకు తీసుకువచ్చారు. రామమందిర నిర్మాణాన్ని జాతియావత్తు సుహృద్భావంతో ఆహ్వానించిందన్నారు. జాతిజనుల మధ్య సయోధ్యకు ఇది గొప్ప తార్కాణమని, సుహృద్భావ జీవనంపై భారత్‌ ‌ప్రపంచానికి చూపిన మార్గదర్శకమిదన్నారు.

కాశ్మీర్‌లో సరికొత్త అభివృద్ది
ఆర్టికల్‌ 370 ‌రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి ప్రారంభమైంది ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఎర్రకోటపై ఆయన మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్‌లోమహిళలకు, ఎస్సీలకు తొలిసారి హక్కులు లభించాయన్నారు. అలాగే లడఖ్‌ అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. సిక్కీం తరహాలో లడఖ్‌, ‌లేహ్‌, ‌కార్గిల్‌ను సంపూర్ణ సేంద్రియ ప్రాంతాలుగా మారుస్తామన్నారు.లడఖ్‌ ‌నుంచి నుంచి అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ‌వరకు రోడ్ల నిర్మాణం వేగవంతం చేస్తామని ప్రకటించారు. సరిహద్దులు దాటేవారికి ఒకటే సమాధామని, సరిహద్దులు దాటే ప్రయత్నం చేసే వారికి మన సైన్యం గుణపాఠం నేర్పిందన్నారు. ఇకపై లడఖ్‌లో జరిగిన గుణపాఠమే ఎదురవుతుందని ప్రధాని హెచ్చరించారు. లడఖ్‌లో ఏం జరిగిందో ప్రపంచం చూసిందని, విస్తరణవాదం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడి భారత్‌ ‌పోరాడుతుందన్నారు. భారత్‌ ‌పోరాటానికి ప్రపంచం అండగా నిలబడడమే మన నైతికతకు నిదర్శనమన్నారు.బలమైన భారత్‌ ‌నిర్మాణమే లక్ష్యంబలమైనభారత్‌ ‌నిర్మాణమే మన ముందున్న కర్తవ్యమన్నారు.పొరుగు దేశాలతోసుహృద్భావ సంబంధాలను కోరుకుంటున్నామని మోదీ స్పష్టం చేశారు.నియంత్రణ రేఖ వెంబడి లేదా వాస్తవాధీన రేఖ వెంబడి మన దేశ సార్వభౌమత్వాన్ని సవాల్‌ ‌చేసిన పొరుగు దేశాలవారికి వారి భాషలోనే మన సైనికులు సరైన జవాబిచ్చారు.

డిజిటల్‌ ఇం‌డియా
దేశం డిజిటల్‌ ఇం‌డియా వైపు వేగంగా ప్రయాణిస్తోందని, చాలా నగరాల్లో ఇంటర్నెట్‌ ‌వాడకం తప్పనిసరి కావడంతోపాటు గ్రామాల్లో కూడా ఇంటర్నెట్‌ అవసరం మరింతగా పెరిగిందని, అటువంటి పరిస్థితిలో గ్రామాలను కూడా ఆప్టికల్‌ ‌ఫైబర్‌తో అనుసంధానించాలని, తద్వారా ఇంటర్నెట్‌ అక్కడివారికి అందుబాటులోకి వస్తుందని ప్రధానిమోదీ అన్నారు హైస్పీడ్‌ ఇం‌టర్నెట్‌ ‌ద్వారా గ్రాణుల జీవితాలను మార్చవచ్చన్నారు. గత ఐదేళ్లలో ఒకటిన్నర లక్షల పంచాయతీలు ఆప్టికల్‌ ‌ఫైబర్‌తో అనుసంధానమయ్యాయన్నారు. అన్ని పంచాయతీలకు ఆప్టికల్‌ ‌ఫైబర్‌ అం‌దించడమే తమ ప్రభుత్వం లక్ష్యమని, లక్ష పంచా యతీలలోఆప్టికల్‌ఫైబర్‌తోపనులుపనులువేగంగా జరుగు తున్నాయన్నారు.

Leave a Reply