Take a fresh look at your lifestyle.

నేర రహిత సమాజమే లక్ష్యం కావాలి: ప్రొ. హరగోపాల్‌

The goal of a crime-free society Prof. Haragopal
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక మహాసభలలో ప్రొ. హరగోపాల్‌
  • నేరానికి కారణాలు వెతకాలి
  • ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక మహాసభలలో ప్రొ. హరగోపాల్‌

నేర స్వభావం మనిషి ప్రవృత్తిలో ఉందా లేక సామాజిక నిర్మాణ లోపమా అనే విషయంలో లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్‌ ‌జి.హరగోపాల్‌ అన్నారు. నేరాలకు న్యాయస్థానాల రూపంలో శిక్షలు పడుతున్నప్పటికీ నేర రహిత సమాజ స్థాపనే ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక లక్ష్యం కావాలని ఆకాంక్షించారు. శనివారం మహబూబ్‌నగర్‌ ‌జిల్లా కేంద్రంలో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఐదో మహాసభలు ప్రారంభమయ్యాయి. పుట్ల హేమలత ప్రాంగణంలో నేరం,శిక్ష-భిన్న కోణాలు అనే అంశంపై రెండు రోజుల సమావేశాలలో భాగంగా అనిశెట్టి రజిత అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ‌కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో నేరం చేసిన వ్యక్తి బాధ్యుడా అని చూడకుండా నేరానికి గల కారణాలను చూడాలన్నారు. సమాజంలో ఏ నేరానికైనా సామాజిక కోణాలు కారణాలు పునాదులు ఉంటాయని అందుకోసం నేడు మౌలిక పరిష్కారం మార్గాలు వెతికి మానవీయ ప్రజాస్వామిక సమాజం సాధించడమే దిశగా ప్రజాస్వామిక రచయిత్రులు కృషి చేయాలన్నారు. సమాజం మారదు అనే క్రమంలో నేరం యొక్క నిర్వచనం కూడా మారుతుందని సమాజంలో అన్యాయం అసమానతలు ఉన్నాయని ఈ అసమానతలు పోయి ఒక సమానత్వ భావన కలిగిన మానవ సమాజం కావాలని పేర్కొన్నారు. ఈ సమాజం యొక్క మూలాన్ని ప్రశ్నించి మారాలని ఎవరైతే మాట్లాడి ప్రశ్నిస్తున్నారు విమర్శిస్తున్నారు అటువంటి వారిని సమాజం జైల్లో నిర్బంధించింది దాదాపు పదిమంది ప్రజాస్వామిక వాదులు నిజాయితీగా నైతికంగా ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్న వారిపై నిర్భంధం విధించడం హేయమైన చర్యగా భావిస్తున్నామన్నారు.

సమాజంలో పెరుగుతున్న కొద్దీ ఉద్వేగం పెరిగిపోతున్నది కానీ సంయమనం కోల్పోకుండా ఉండాలనీ, నేరాలకు మూలాలు ఎక్కడ ఉంటాయి నేరం చరిత్రలో ఎక్కడ ప్రారంభమైంది నేరం ఎన్ని రకాలుగా రూపాలు చెందింది వేస్తున్న శిక్షలు నేరానికి తగ్గట్టుగా ఉన్నాయా ఇటువంటి ప్రశ్నలతోనే శిక్షా స్మృతి వచ్చిందన్నారు. శిక్షా స్మృతి సమాజంలో ఉద్వేగంలో శిక్ష వేస్తుంది కాబట్టి సమాజం శిక్ష కాకుండా చేసిన నేరానికి న్యాయవ్యవస్థ నిర్ణయించిన పద్ధతిలోని విచారణ జరిగి న్యాయస్థానమే శిక్ష వేయాలనేది నాగరిక ప్రజాస్వామ్య సమాజం అందించిన గొప్ప విజయమన్నారు. అయినప్పటికీ అందుకు భిన్నంగా నేడు రాజ్యాంగం రాజ్యాంగబద్ధ ప్రమాణాలు కాకుండా సమాజం ఆవేశపడి ఆవేశంలో శిక్షలు వేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇటువంటి నాగరిక ప్రజాస్వామిక పాలన రాజ్యాంగ ప్రమాణాలు సమాజంలో కలదు కావున నేడు నేరాల మూలాల్లోకి వెళ్లి నేరం లేనటువంటి సమాజం సాధించాలనీ, నేరానికి కారణాలను పరిష్కరించే సమాజమే ప్రస్తుతం కావాలన్నారు. నేరాన్ని శిక్షించడం కాదు అలాగే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు నేరమని అందరూ అంగీకరిస్తారు ఇటువంటి ఘటనలు పాల్పడినవారిపై శిక్షలు విధించడంతో అత్యాచారాలు అవుతున్నాయా ఆగుతాయి అనుకోవడం సరికాదు అందుకు మూలాలను వెతకాలి చట్టం ముందు అందరూ సమానమే కానీ నేడు సమాజంలో కొన్ని నేరాలకు స్పందన లేదు అంతేకాక ఒక వర్గానికి చెందిన రాజకీయ నేతలకు మాట్లాడడమే సమాజంలో నేరంగా భావిస్తున్నారని ప్రొ.హరగోపాల్‌ అభిప్రాయపడ్డారు.

పాలమూరు అధ్యయన వేదిక రాఘవాచారి మాట్లాడుతూ పాలకుల నేరానికి ప్రభుత్వ నేరానికి పాలమూరు ప్రజలు శిక్షను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా 40 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్న అందుకు సాగు చేసుకునేందుకు తగినంత నీరు లేక యువత బ్రతుకుదెరువు కోసం వలస వెళ్తున్నారన్నారు జిల్లాలో జిల్లా మీదుగా నదులు ప్రవహిస్తున్న 100 టీఎంసీలు నీరు వ్యవసాయం కోసం అందుబాటులో లేవని అన్నారు. జిల్లాపై అందుబాటులో ఉన్న నీరు వాడుకునే వీలు లేక ఎన్నో సంవత్సరాల నుండి వలసలు వెళ్తూనే ఉన్నారన్నారు ఎందుకు ఈ ప్రాంత వాతావరణమే ఈ ప్రాంత నేరమా అని ప్రశ్నించారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నిస్తే రాజకీయ నాయకులు కన్నెర్ర చేస్తున్నారని విమర్శించారు. దాదాపు ఈ జిల్లా నుండి 14 లక్షల మంది వలస వెళ్లారనీ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే బతుకులు బాగుపడతాయని అనుకున్నారు కానీ మార్పు వచ్చింది ప్రజల వేషధారణలో మాత్రమేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ వచ్చాక కూడా ప్రజలు అణచివేతకు గురికావడం దౌర్భాగ్యరకమైన విషయమన్నారు సమావేశంలో ప్రారంభ ఉపన్యాసం చేసిన సాహిత్య విమర్శకుడు జి. లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ నేరం-శిక్షకు అన్ని సమయాల్లో ఒకే అభిప్రాయం ఉండదని అన్నారు.

దిశ, సమత అత్యాచారాలు, పాశవిక హత్య ల తర్వాత సమాజం, మీడియా స్పందించిన తీరులో వైరుధ్యాలను వక్తలు ప్రస్తావించారు. కాషాయికీకరణకు కోర్టులు కూడా లొంగిపోయాయని విమర్శించారు. నేరం, శిక్ష-రాజకీయ, ఆర్థిక కోణాల పై జరిగిన సెషన్‌ ‌లో ఆంధ్ర జ్యోతి ఎడిటర్‌ ‌కె. శ్రీనివాస్‌ ‌ప్రసంగించారు. మనుస్మృతిలోనే ఉన్న బ్రాహ్మణ, దళిత వర్గాల మధ్య శిక్ష వివక్షలను ఆయన వివరించారు. తెలుగు సాహిత్యంలో నేరం, శిక్ష పై ప్రముఖ రచయిత్రి కాత్యాయని విద్మహే మాట్లాడారు. ఏది నేరం? నేరాన్ని నిర్వచిస్తున్నది ఎవరు?శిక్ష ఎవరికి పడుతోంది… పలు కథలను ఉదాహరణలు చెబుతూ వివరించారు. వ్యాసాల సంపుటి ‘‘చిగురు కొమ్మ’’, ప్రరవే క్షేత్ర పర్యటనల వ్యాసాలు ‘‘ఏడాది ప్రయాణం’’ పుస్తకాలు ఆవిష్కరించారు. ఈ సమావేశం లో కె. ఎన్‌. ‌మల్లీశ్వరి, అనిశెట్టి రజిత, రెహాన, మందరపు హైమావతి, తిరునగరి జానకీ దేవి, రమాదేవి, కొమర్రాజు రామలక్ష్మి, కొలిపాక శోభారాణి, శివుని రాజేశ్వరి, శీలా సుభద్రా దేవి, పరిమళ్‌, ‌కొండేపూడి నిర్మల, ఇంద్రగంటి జానకీ బాల, నీళాదేవి, పాత శ్రీలక్ష్మి, నల్ల యామిని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply