Take a fresh look at your lifestyle.

కెసిఆర్‌ ‌కుటుంబ పాలనపై పోరాటమే లక్ష్యం

  • రాష్ట్ర రాజకీయాల్లో కదలిక వొస్తుంది
  • బండి సంజయ్‌ ‌ప్రజా సంగ్రామ యాత్ర షురూ
  • భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు
  • రాష్ట్రంలో నిజాం పాలన అంతం కోసమే : కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి

రాష్ట్ర ప్రజల్లో విశ్వాసం, ఆత్మస్థయిర్యం కల్పించేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. కెసిఆర్‌ ‌కుటుంబ పాలన, తెలంగాణ ఆకాంక్షలు ప్రజలకు వివరించేందుకు యాత్రకు పూనుకున్నానని ఆయన అన్నారు. అలాగే రాష్ట్రంలో రాజకీయ మార్పునకు ఈ యాత్ర వేదిక కానుందని చెప్పారు. శనివారం చార్మినార్‌ ‌భాగ్యలక్ష్మి అమ్మవారిని సందర్శించి, పూజలు నిర్వహించిన అనంతరం ప్రజా సంగ్రామ యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చార్మినార్‌ ‌సవి•పంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్‌ ‌మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన కోసం 1400 మంది బలిదానాలు చేశారు. అమరుల ఆకాంక్షలకు, ఆశయాలకు భిన్నంగా రాష్ట్రంలో ఒక్క కుటుంబమే పాలన సాగిస్తుందని బండి సంజయ్‌ ‌విరుచుకుపడ్డారు.

సీఎం కేసీఆర్‌ ‌హయాంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని,  మాటలతో మభ్యపెడుతూ కేసీఆర్‌ ‌పబ్బం గడుపుతున్నారని అన్నారు. రైతులందరికీ ఉచిత యూరియా ఇస్తానని చెప్పి రైతులను మోసం చేశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగ యువకులను మోసగించారు. ఏడెనిమిది ఏళ్లు దాటినా ఇంత వరకు వాటి గురించి పట్టించుకోలేదు. ఒక్కో నిరుద్యోగికి లక్ష చొప్పున కేసీఆర్‌ ‌ప్రభుత్వం బాకీ ఉంది. దళితులకు మూడెకరాల భూమి, దళితుడిని సీఎం చేస్తానన్న హావి•ని సీఎం కేసీఆర్‌ అటకెక్కించారు. ‘దళిత బంధు’ పేరుతో దళితులను..గొర్రెలు, బర్రెలంటూ బీసీలను వంచిస్తున్నారని బండి సంజయ్‌ ‌విమర్శలు గుప్పించారు. హావి•లను విస్మరించడం, కొత్తగా పథకాలతో బురిడీ కొట్టించడం అలవాటుగా మారిందన్నారు. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఆత్మహత్యల తెలంగాణంగా మార్చారని దుయ్యబట్టారు. పాతబస్తీలో ఉన్న ఎంఐఎం ఆగడాలను తట్టుకుని హిందువులు జీవిస్తున్నారని, పాతబస్తీని ఇదివరకే వదిలి వెళ్లిన హిందువులంతా తిరిగి రావాలని సంజయ్‌ ‌పిలుపునిచ్చారు.

కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో నిజాంలాంటి పాలన అంతం కావాలని, అక్రమాలు, అవినీతి, అప్పుల పాలన పోవాలన్నదే బిజెపి లక్ష్యమన్నారు. టీఆర్‌ఎస్‌ను గద్దె దించటానికే బీజేపీ నేత బండి సంజయ్‌ ‌ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. కుటుంబ పాలనకు తెరదించి ఒక ప్రజాస్వామ్య పాలనకు ప్రజలు స్వాగతం పలకాల్సి ఉందన్నారు. తెరాస ప్రభుత్వాన్ని గ్దదె దించే ఉద్యమం ఈ ప్రజా సంగ్రామ యాత్ర. కల్వకుంట్ల కుటుంబం అబద్దాలపై పాలన సాగిస్తోంది. అవినీతి పాలనపోయి.. నీతివంతమైన పాలన రావాలంటే కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క టీచర్‌ ‌పోస్టు కూడా భర్తీ చేయలేదు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతోందని కిషన్‌ ‌రెడ్డి అన్నారు.

తెలంగాణలో అవినీతి రూపంలో వేల కోట్లు వృథా అవుతున్నాయని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం ఎన్ని కుట్రలు చేసినా హుజురాబాద్‌లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. దళితులకు సీఎం పదవి, మూడెకరాల భూమి పేరుతో కేసీఆర్‌ ‌మోసం చేశారని, బీసీలకు టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ ‌పాలన నుంచి విముక్తి కలిగించాలని భాజపా రాష్ట్ర వ్యవహారాల బాధ్యడు తరుణ్‌ ‌చుగ్‌ అన్నారు. రాష్ట్రాన్ని ఆలీబాబా 40 దొంగల్లా కుటుంబ సభ్యులే పాలిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ ‌పాలనకు అంతం కోసమే ఈ యాత్ర నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని డీకే అరుణ అన్నారు.  రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే అని అన్నారు. తెరాస, కాంగ్రెస్‌ ‌రెండూ ఒకటేనని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని బీజేపీ నాయకురాలు డీకే అరుణ పేర్కొన్నారు.

హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలన్నారు. ఉద్యమ ఆకాంక్షను సీఎం కేసీఆర్‌ ‌ఫాంహౌస్‌లో బందీ చేశారన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని సీఎం కేసీఆర్‌ ‌మాట తప్పారన్నారు. కేసీఆర్‌ ‌నియంతృత్వ, అవినీతి పాలనకు త్వరలోనే చరమగీతం పాడుతామని డీకే అరుణ పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ యాత్రతో పెనుమార్పులు సంభవించబోతున్నాయని లక్ష్మణ్‌ అన్నారు. అవినీతి, కటుఉంబ పాలనపై బిజెపి విల్లు ఎక్కుపెట్టిందని అన్నారు. ఈ యాత్ర టిఆర్‌ఎస్‌లో గుబులు పుట్టిస్తుందని అన్నారు. కార్యక్రమంలో బిజేపి నేతలు పాల్గొన్నారు.

Leave a Reply