Take a fresh look at your lifestyle.

మహిళల భద్రతే లక్ష్యం దిశ యాప్‌తో భద్రతకు భరోసా

గుంటూరు,జూలై 27: మహిళల భద్రతే ప్రధాన ఆశయంగా ప్రభుత్వం, పోలీసుశాఖ పని చేస్తోందని చెప్పారు. వారికి క్షణ కవచంలా దిశ యాప్‌ ‌నిలుస్తుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు, 3 అర్బన్‌ ‌పోలీసు జిల్లాలు, 2 కమిషనరేట్‌లతో కలిపి 18 దిశ మహిళా పోలీసు స్టేషన్లను కేవలం మహిళల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఒక్కో పోలీస్‌ ‌స్టేషన్లో డీఎస్పీ స్థాయి అధికారి, సీఐ, ఐదుగురు ఎస్‌ఐలతోపాటు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళలు, బాలికల పట్ల జరిగే నేరాల సత్వర దర్యాప్తు కోసం ప్రతీ పోలీస్‌స్టేషన్‌కి ఒక వాహనం అందుబాటులో ఉంటుందన్నారు.

దిశ యాప్‌ ‌డౌన్‌లోడ్‌ ‌లక్ష్యంగా పోలీసు అధికారులు కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్‌ ‌వెంటనే మహిళా రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చార న్నారు. దిశ యాప్‌ని అత్యధికంగా డౌన్‌లోడ్‌ ‌చేసుకుని రాష్ట్రంలోనే నెంబర్‌ ‌వన్‌గా జిల్లాను నిలపాలని పిలుపునిచ్చారు. దిశ యాప్‌ ‌డౌన్‌లోడ్‌పై మహిళలు అడిగిన పలు సందేహాలను పోలీసు అధికారులు నివృత్తి చేసి డౌన్‌లోడ్‌ ‌చేయించారు.

Leave a Reply