- ప్రత్యేక తెలంగాణలో అభివృద్ది సాధించాం
- భువనగిరిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కెటిఆర్
ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గత సమైక్య పాలనలో అన్ని విధాల దోపిడీకి గురైన తెలంగాణ, స్వరాష్ట్రం వచ్చాక సిఎం కెసిఆర్ నేతృత్వంలో అన్ని విధాల అభివృద్ధి సాధించిందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత దినోత్సవం పాటిస్తున్నామని, పట్టణాల్లో, పల్లెల్లో పారిశుధ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలని కెటిఆర్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డులో నిర్మించిన మానవ మలవ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆర్అండ్బీ గెస్టుహౌస్ సవి•పంలో 14వ, 15వ ఆర్థిక సంఘం, పట్టణ ప్రగతి నిధులు రూ.8.70కోట్ల వ్యయంతో నిర్మించనున్న సవి•కృత మార్కెట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆర్అండ్బీ వసతిగృహం ఆవరణలో నిర్మించనున్న నిరాశ్రయుల వసతి గృహానికి శంకుస్థాపన చేశారు. ఐబీ కార్యాలయం ముందు ఎన్యూఎల్ఎం, పట్టణ ప్రగతి నిధులు రూ.11.50లక్షల వ్యయంతో వీధి వ్యాపారుల కోసం నిర్మించిన 25 దుకాణాలను మంత్రి ప్రారంభించారు. 30, 31, 32, 34వార్డుల్లో రూ.31.50లక్షలతో 197వి•టర్ల మేరకు ఎల్ఆర్ఎస్ నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 14వ ఆర్థిక సంఘం, పురపాలక సంఘ సాధారణ నిధులు రూ.1.51కోట్లతో నిర్మించనున్న స్మృతివనం ఆధునిక పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత తదితరులు పాల్గొన్నారు.