Take a fresh look at your lifestyle.

వైద్య సిబ్బంది దాతృత్వం అభినందనీయం

కరోనా లాక్‌ ‌డౌన్‌ ‌నేపద్యంలో గ్రామాల్లో నిత్యం వైద్య సేవలు అందిస్తూ ఆయా గ్రామాల్లో ఉన్న వికలాంగులకు, వృద్దులకు కూరగాయలు పండ్లు అందజేయడం అభినందనీయమని ఎంపిడిఓ బి. మళ్లీశ్వరి అన్నారు. బుదవారం ఆమె పెద్ద ఆర్లగూడెం సబ్‌ ‌సెంటర్‌ ‌కు చెందిన ఏఎన్‌ఎమ్‌ ‌మరియు ఆశావర్కర్లు ఆద్వర్యంలో వృద్దులు, వికలాంగుల కోసం అందజేసిన కూరగాయాలు, పండ్లు ఆమె అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి •క్కరు ఆరోగ్యవంతులు గా ఉండాలనే ఆలోచనతో వారు శక్తి మేర సుమారు 40 మంది వృద్దులకు, వికలాంగులకు కూరగాయలు, పండ్లు, మాస్క్‌లు, సబ్బులు అందజేసి ఆరోగ్యంతో పాటు పరిశుభ్రతను చాటారన్నారు.

ఈ సందర్బంగా ఆమె సబ్‌ ‌సెంటర్‌ ఏఎన్‌ఎమ్‌ ‌కె. నర్సమ్మను అభినందిం చారు. ఈ కార్యక్రమంలో మండల కరోనా టీము సభ్యులు దుమ్ముగూడెం ప్రభుత్వ వైద్యాధికారి బాలాజీ నాయక్‌, ఇజిఎస్‌ ఎపిఓ సుకన్య, ఖమ్మం ఆర్‌డిఓ ఆఫీసు ఆర్‌ఐ ‌కల్లూరి వెంకటేశ్వరావు, హెచ్‌వి లు అమ్మాజీ, సాగర్‌, ‌పంచాయితీ కార్యదర్శి యం. నరేశ్‌, ఆశా వర్కర్లు కె. వెంకటరత్నం, ఎస్‌ ‌లక్ష్మీ, పి. వీరమ్మ, టి. చెల్లెమ్మ  ప్గాన్నారు.

Leave a Reply