Take a fresh look at your lifestyle.

తెలంగాణ భవిష్యత్‌ – ‌బుద్ధిజీవులు

‘‘‌బుద్ధిజీవులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేకపోయిన పరోక్షంగా నియంతృత్వ రాజకీయాలను కట్టడి చేయాల్సిన అవసరముంది. నిజాయితికి-నిరంకుశత్వానికి మధ్య జరిగే ఈ ఎన్నికలో, ప్రజలకు-దోపిడి పాలకులకు మధ్య జరిగే ఎన్నిలో, త్యాగధనులకు-మోసకారులకు మధ్య జరిగే ఎన్నికలో, నిరుద్యోగులకు-రాజకీయ ఉద్యోగులకు జరిగే ఎన్నికలో, ప్రజాస్వామ్యానికి-నియంతృత్వానికి మధ్య జరిగే ఎన్నికలో, న్యాయానికి-హత్యా రాజకీయాలకు మధ్య జరిగే ఎన్నికలో, నోటుకు-వోటుకు మధ్య జరిగే ఎన్నికలో, మీడియా స్వేచ్చకు-నిర్బంధానికి మధ్య జరిగే ఎన్నికలో, పార్టీ పిరాయింపుదారులకు-ప్రజా నాయకులకు మధ్య జరిగే ఎన్నికలో, తెలంగాణవాదులకు-తెలంగాణ ద్రోహులకు మధ్య జరిగే ఎన్నికలో త్యాగధనులు కలలుకన్న తెలంగాణను కాపాడుకునే ఎన్నికలో మేధావులు, బుద్ధిజీవులు న్యాయం, విలువలు, ప్రజాస్వామ్యం, నిరుద్యోగులు, అణగారిన ప్రజల పక్షాన నిలబాడాల్సిన బాధ్యతను మరచి పోవద్దు..’’

‘‘మేధావులు మౌనం వహించినప్పుడు మూరు?ల సంఖ్య రెట్టింపు అవుతుంది. ఇది ఎదిగే సమాజ ఉనికికే ప్రమాదం..’’
….నెల్సన్‌ ‌మండేలా

ఓ బుద్ధి జీవులారా, విద్యార్థి యోధుల్లారా.. అమరులు కలలుగన్న తెలంగాణ కోసం మరో పోరాటాన్ని విజయవంతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. త్యాగధనులు కోరుకున్న తెలంగాణ కోసం బుద్ధి జీవులు, మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థి యోధులు హుజురాబాద్‌ ఉప ఎన్నికలో కీలకపాత్ర వహించాల్సి ఉంది. తెలంగాణలో దోపిడి, నిరంకుశ పాలన పరాకాష్టకు చేరిన సందర్భంలో జరుగుతున్న హుజురాబాద్‌ ఎన్నికల్లో మేధావులు, బుద్ధిజీవులు, కవులు, కళాకారులు, విద్యార్థులు కీలకపాత్ర వహించాల్సిన అవసరం చాలా ఉంది. తెలంగాణ కోసం జరిగిన చాలా ఎన్నికల్లో బుద్ధిజీవుల పాత్ర మరువలేనిది. ముఖ్యంగా కరీంనగర్‌ ‌పార్లమెంట్‌ ఉప ఎన్నిక సమయంలో బుద్ధిజీవులు, విద్యార్థి యోధులు, కవులు, కళాకారులు ఎంతో శ్రమించి కెసిఆర్‌ ‌ను గెలిపించి తెలంగాణ వాదాన్ని బతికించారు. నేడు అలాంటి కీలక సమయం ఆసన్నమైంది. త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో రోజురోజుకు పెచ్చుమీరుతున్న నిరంకుశ పాలనను కట్టడి చేయాల్సిన అవసరాన్ని బుద్ధిజీవులు గుర్తించాలి. ఆనాడు కరీంనగర్‌ ‌లో విజయం సాధించి తెలంగాణ ఉద్యమానికి బలం చేకూర్చుకున్నట్లుగానే నేడు హుజురాబాద్‌ ‌లో టిఆర్‌ఎస్‌ ‌ను ఓడించి సాధించుకున్న తెలంగాణలో దోపిడి పాలనకు అడ్డుకట్ట వేయాలి.

తెలంగాణ ఉద్యమాన్ని ఎన్నికల చుట్టూ తిప్పి రాజీ ధోరణితో కేసిఆర్‌ ఎం‌దరో యువకుల బలిదానాలకు కారకూడయ్యాడు. రాష్ట్రం సిద్ధించాక కూడా కెసిఆర్‌ అదే ఎన్నికల రాజకీయాలు తప్ప విలువల పాలనపై, అభివృద్ధిపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. మొదటి సారి అధికారంలోకి వచ్చిన కెసిఆర్‌ ‌తెలంగాణ అభివృద్ధి, ఇచ్చిన హామీలను మరువడంతో ప్రజల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత మొదలైంది. ప్రజల వ్యతిరేకతను గమనించిన కెసిఆర్‌ అది ఎక్కువ కాకముందు, ప్రతిపక్షాలు ఎన్నికలకు సిద్ధం కాకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి, తొండి ఆట ఆడి ఎన్నికల్లో విపరీతంగా డబ్బు వెదజల్లి మరోసారి అధికారంలోకి వచ్చాడు.

ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేయడం,వోటర్లకు డబ్బులు ఇవ్వడం, ఎన్నికల ముందు రైతు రుణ మాఫీ లాంటి హామీలు ఇవ్వడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌లో చంద్రబాబునాయుడు నాంది పలుకగా, చంద్రబాబు శిష్యుడిగా శిక్షణ పొందిన కెసిఅర్‌ ఎన్నికల్లో డబ్బులు వెదజల్లడం ద్వారా గెలుపొందుతామని ఇప్పటివరకు నోట్ల రాజకీయాలు చేస్తూ వస్తున్నాడు. తెలంగాణ వచ్చిన తరువాత జరిగిన రెండు సాధారణ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ పెద్ద ఎత్తున డబ్బు వెదజల్లి గెలుస్తూ వస్తుంది. అంతేకాక ప్రజల పక్షాన నిలబడి కలబడే ప్రజా సంఘాలను చీల్చడం, నిర్బంధించడం తో పాటు ప్రతిపక్ష నాయకులను అదిరించి, బెదిరించి కొనుగోలు చేయడం ద్వారా తనకు ఎదురులేని రాజకీయ వ్యవస్థను నిర్మించుకుని ఫామ్‌ ‌హౌస్‌ ‌నుండి పాలన కొనసాగిస్తున్న కెసిఆర్‌ ‌కు హుజురాబాద్‌ ఎన్నికల్లో చెక్‌ ‌పెట్టాల్సిన బాధ్యత బుద్ధిజీవులపై ఉంది. మొదటిసారి గెలిచి ముందస్తు ఎన్నికలకు పోయే ఉద్దేశంతో ప్రగతి నివేదన సభ పెట్టి రాష్ట్ర ప్రజల సొమ్మును వృధా చేసిన కెసిఆర్‌ ‌హుజురబాద్‌ ఎన్నికల తర్వాత వరంగల్‌ ‌లో విజయ గర్జన సభ పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. అభివృద్ధిని మరచిన కెసిఆర్‌ ఇలాంటి సభలు పెట్టి తెలంగాణ ప్రజలను మందు, విందులకు బానిసలను చేస్తూ తన పబ్బం గడుపుకుంటున్నాడు. ఇంతటి దుర్మార్గ పాలన కొనసాగిస్తున్న కెసిఆర్‌ ‌ను హుజురాబాద్‌ ఎన్నికల్లో ఓడించి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత మేధావులు, విద్యార్థులపైనుంది.

హుజురాబాద్‌ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తన ఆధిపత్య రాజకీయాలను కొనసాగించాలని రాష్ట్రంలో ఎక్కడా లేని ప్రలోభ పథకాలు ప్రకటించడంతో పాటు గత నాలుగు నెలలుగా హుజురాబాద్‌ ‌యువతను మందులో ముంచి మైనర్లకు సైతం మందు అలవాటు చేసినారు. ఇలాంటి తీవ్రవాద రాజకీయాలను కట్టడి చేయకుంటే రానున్న రోజుల్లో ప్రజలంతా ప్రజాస్వామ్య బానిసత్వంలోకి నెట్టబడుతారు. రాజనీతిజ్ఞులు, బుద్ధిజీవులు పుష్కలంగా ఉన్న మన దేశంలో రాజనీతిజ్ఞులు రాజకీయాల గురించి ఆలోచన చేయకపోవడం వల్లనే కెసిఆర్‌ ‌లాంటి నియంత పాలకులకు అవకాశం దొరుకుతుంది. బుద్ధిజీవులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేకపోయిన పరోక్షంగా నియంతృత్వ రాజకీయాలను కట్టడి చేయాల్సిన అవసరముంది. నిజాయితికి-నిరంకుశత్వానికి మధ్య జరిగే ఈ ఎన్నికలో, ప్రజలకు-దోపిడి పాలకులకు మధ్య జరిగే ఎన్నిలో, త్యాగధనులకు-మోసకారులకు మధ్య జరిగే ఎన్నికలో, నిరుద్యోగులకు-రాజకీయ ఉద్యోగులకు జరిగే ఎన్నికలో, ప్రజాస్వామ్యానికి-నియంతృత్వానికి మధ్య జరిగే ఎన్నికలో, న్యాయానికి-హత్యా రాజకీయాలకు మధ్య జరిగే ఎన్నికలో, నోటుకు-వోటుకు మధ్య జరిగే ఎన్నికలో, మీడియా స్వేచ్చకు-నిర్బంధానికి మధ్య జరిగే ఎన్నికలో, పార్టీ పిరాయింపుదారులకు-ప్రజా నాయకులకు మధ్య జరిగే ఎన్నికలో, తెలంగాణవాదులకు-తెలంగాణ ద్రోహులకు మధ్య జరిగే ఎన్నికలో త్యాగధనులు కలలుకన్న తెలంగాణను కాపాడుకునే ఎన్నికలో మేధావులు, బుద్ధిజీవులు న్యాయం, విలువలు, ప్రజాస్వామ్యం, నిరుద్యోగులు, అణగారిన ప్రజల పక్షాన నిలబాడాల్సిన బాధ్యతను మరచి పోవద్దు. ప్రభుత్వాల బలం ఎప్పుడూ ప్రజల అజ్ఞానంలో వుంటుంది. అందుకే ప్రజల్లో నిజమైన జ్ఞానాన్ని ఇవి వ్యతిరేకిస్తాయి. ఈ సత్యాన్ని బుద్ధిజీవులు గుర్తించాల్సిన సమయమిదే. ప్రజల్లో అజ్ఞానాన్ని వ్యాప్తి చేస్తూ, పథకాలతో ప్రలోభాలకు గురిచేస్తూ, ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి అభివృద్ధి మరచిన ప్రభుత్వాలను అలాగే వదలి వేయడం అత్యంత హానికరం.

– సాయిని నరేందర్‌
‌సామాజిక, రాజకీయ విశ్లేషకులు
9701916091

Leave a Reply