Take a fresh look at your lifestyle.

భవిష్యత్త్ అం‌తా దూరవిద్యదే !

‌”కొరోనా వైరస్‌ ‌ప్రభలిన తర్వాత, రెగ్యులర్‌ ‌విద్యకు, దూరవిద్యకు చాలతేడా వుందనే వాస్త వాన్ని కోంత ఆలస్యంగా అర్దంచేసుకోనే అవకాశం వుందని గ్రహించాలి, వాస్తవానికి  దూరవిద్య అభ్యసిస్తున్న విద్యార్థులు అందరుకూడా చదువుకోవడానికి అవకాశం లేక కోందరు, ఆర్థిక బారమై మరికోందరు ఉన్నత విద్యకు నోచుకోక ,మద్యంతరంగానే చదువులు ఆపేసి.  బ్రతుకు భారం అయి ప్రయివేటు, ప్రభుత్వ సంస్థలలో తాత్కాలికంగా ,పర్మినేంటుగా వివిధ శాఖలలో ఆయా పోజీషన్‌లలో పనిచేస్తున్న వారికి సార్వత్రిక విద్య ఒక వరంలాగా  మారి  ఎందరి,ఎందరు జీవితాలల్లో వెల్గునింపిన ఎన్నో సంఘటనలు దేశవ్యాప్తంగా కోకోల్లలు     వున్న సంగతి అందరికి తెల్సిన విషయమే.”

విద్యార్థులకు ఇబ్బంది లేదు
పరీక్షలకు టెన్షన్‌ ‌లేదు..

ఒక దేశ అభివృద్ధిలో ఉన్నత విద్య మరియు పాఠశాల విద్య కీలకమైనదని మనందరికీ తెలిసిన విషయమే. మన దేశ యువత జనాభాను మనకున్న ఉత్పాదక వనరులనుగా భావించి వారికి కావాలసిన విద్య మరియు శిక్షణను కల్పిస్తే వారు మన దేశానికి మంచి మానవ వనరులుగా రూపుదిద్దుకొని దేశ సంపదను పెంపొందించి, మన స్థాయిని పెంచడానికి దోహదపడుతారనడంలో సందేహం లేదు. కాని దీనికి కావాల్సిన చర్యలను సత్వరంగా చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎంతైనా ఉన్నది.

కరోనా వైరస్‌ ‌మహమ్మారి, మాయరోగం విద్యావ్యవస్థను అతలాకుతలం, చిన్నా బిన్నం చేసిందనడంలో ఎలాంటి సందేహం అవసరంలేదు. ప్రాథమిక విద్య నుండి  మొదలుకుంటే ఉన్నత విద్య వరకు ఈ కరోనా మహమ్మారి బారినపడి విద్యార్థి లోకం, చదువుల తల్లి, తల్లడిల్లింది. దాదాపుగా 4నెలల నుండి విద్యార్థులు చదువుకు ప్రత్యక్షంగా నోచుకోక   ప్రత్యామ్నాయం  వైపు ఆలోచనచేయడం ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా  కోవిద్‌-19 ‌రోజు, రోజూకూ పెట్రేగి, విలయతాండవం చేస్తున్న క్రమంలో యుజిసి, జూలై 31వరకు విశ్వ విద్యాలయాలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించిన విషయం అందరికితెల్సిన విషయమే. భారతదేశంలో, సాంప్రదాయిక వ్యవస్థ ద్యారా కోరిక నెరవేరని, తీర్చలేని ఉన్నత విద్య కోసం ఎప్పటికప్పుడు పెరుగుతున్న డిమాండ్‌ అనుకూలంగా ఉన్నత విద్య కోసం 1962లో కరస్పాండెన్స్ ‌కోర్సుల రూపంలో ప్రారంభించబడింది. మొదటగా డిల్లీ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ ‌డిస్టెన్స్ ‌కోర్సులు మరియు నిరంతర విద్యను ప్రారంభించి, దాని ఫలితాలతో దేశ వ్యాప్తంగా కరస్పాండెన్స్ ‌కోర్సుల విస్తరణకు శ్రీకారం చుట్టినారు. పర్యవసానంగా విశ్వ విద్యాలయ నిధుల కమిషన్‌(‌యుజిసి) భారతీయ  విశ్వవిద్యాలయాలలో  సార్వత్రిక విద్యా ప్రణాళిక ద్వారా ప్రవేశపెట్టడానికి మార్గదర్శకాలను రూపొందించింది. ప్రతి దశకంలో కొన్ని విశ్వవిద్యాలయాలలో కరస్పాండెన్స్ ‌కోర్సులను  ప్రారంభించి నూతన ఒరవడి సృష్టించి అన్నివర్గాలకు ఉన్నత విద్య అందించి సౌకర్యవంతమైన విద్యాగా తన మైలురాయిను దాటగల్గింది. కరోనా వైరస్‌ ‌ప్రబలిన తర్వాత, రెగ్యులర్‌ ‌విద్యకు, దూరవిద్యకు చాలతేడా వుందనే వాస్తవాన్ని కొంత ఆలస్యంగా అర్థంచేసుకోనే అవకాశం వుందని గ్రహించాలి. వాస్తవానికి  దూరవిద్య అభ్యసిస్తున్న విద్యార్థులు అందరు కూడా చదువుకోవడానికి అవకాశం లేక కొందరు, ఆర్థిక భారమై మరికొందరు ఉన్నత విద్యకు నోచుకోక, మధ్యంతరంగానే చదువులు ఆపేసి. బ్రతుకు భారం అయి ప్రయివేటు, ప్రభుత్వ సంస్థలలో తాత్కాలికంగా, పర్మినేంటుగా వివిధ శాఖలలో ఆయా పొజిషన్‌లలో పనిచేస్తున్న వారికి సార్వత్రిక విద్య ఒక వరంలాగా  మారి  ఎందరి, ఎందరు జీవితాలలో వెలుగు నింపిన ఎన్నో సంఘటనలు దేశవ్యాప్తంగా కోకోల్లలు వున్న సంగతి అందరికి తెల్సిన విషయమే.

భారతదేశంలో దూరవిద్య(సార్వత్రిక విద్య) వ్యవస్థ విభిన్న వర్గాలకు విద్యను అందించడానికి, అవతరించిన ఈ ఒపెన్‌ అం‌డ్‌ ‌డిస్టెన్స్ ‌లర్నింగ్‌ (ఒడియల్‌) ‌దాదాపుగా 6దశాబ్దాల నుండి సమాజహితం కోసం దేశ వ్యాప్తంగా ప్రాధాన్యతను సంతరించుకుంది, సార్వత్రిక విద్యకు ప్రాముఖ్యత పెరిగి ఇప్పుడు 250 విశ్వవిద్యాలయాల(సంస్థల)తో అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో ఉన్నతవిద్యను అభ్యసిస్తున్న విద్యార్థులో దాదాపుగా 25 శాతం దూరవిద్యలో చదవడాన్ని చూస్తే అర్థం అవుతుంది. కేంద్ర, రాష్ట్ర, డీమ్డ్, ‌ప్రయివేటు విశ్వ విద్యాలయాలల్లో దాదాపుగా అన్ని కోర్సులు ఆయా మౌలిక సదుపాయాలను బట్టి, దాదాపు 279 కోర్సులను, సర్టిఫికేట్‌, ‌డిగ్రీ, పీజి, డిప్లోమా, పిజి డిప్లోమా, ఎం.ఫిల్‌, ‌పిహెచ్‌.‌డి, వివిధ ప్రొపెషనల్స్ ఆయా కోర్సులలో రెగ్యులర్‌కు ధీటుగా, పోటీ పడి మౌలిక సదుపాయాలతో పాటు, జరిగే కాంటాక్ట్ ‌తరగతుల నిర్వాహణలో న్యాయం జరిగే విధంగా, విద్యార్థులకు సంతృప్తి చెందేందుకు పోటీ పడి ప్రాదేశిక సరిహద్దులు లేకూండా విశ్వవిద్యాలయాలు వారి అద్యయన కేంద్రాలను పొరుగు రాష్ట్రంలలో, విదేశాలలో కూడా ప్రారంభించి నాణ్యతలోపించే విధంగా ప్రవర్తించిన తీరుకు యూ.జీ.సి(డెబ్‌)‌సంచాలనాత్మక నిర్ణయంతో యూనివర్సిటీ పరిధి లేదా అన్ని సదుపాయాలుకలిగి ఉన్నట్లయితే, ఆయా రాష్ట్రంలలో మాత్రమే స్టడీ సెంటర్స్, ‌పరీక్షకేంద్రాల అనుమతితో కూడినషరతులు విధించి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో, పర్యవేక్షణలోనే నడిచేవిదంగా విశ్వవిద్యాలయాల(దూరవిద్య కేంద్రం)దూకుడుకు అడ్డుకట్టవేసింది. విశ్వవిద్యాలయాల పరిధిని దాటి, అధ్యయన కేంద్రాలు ప్రారంభించకూడదు అనే, నియమ నిబంధనలు పాటించాలని, అధ్యయన కేంద్రాలు పాస్‌ ‌గ్యారంటీ పేరుతో, నిబంధనలు ఉల్లఘించినట్లయితే కళాశాల అఫిలియేషన్‌ ‌రద్దు చేస్తామని ఆదేశాలు జారి చేయడంతో, కొన్ని విశ్వవిద్యాలయాలకు, అధ్యయన కేంద్రాలకు గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయ్యింది. యూ.జీ.సి(డెబ్‌)‌నిర్ణయంతో ప్రమాణాల మెరుగుతో పాటు, సరిహద్దుల, పరిధి సమస్యకు కూడా పరిష్కారం దొరికింది. ఎవరు అయిన ఉల్లంఘించినట్లు తెలిసినా వారి అనుమతి రద్దు చేస్తామని ఆయా విశ్వవిద్యాలయాలకు ఒడియల్‌ అనుమతిని రద్దుచేస్తామని, అనుమతి పోందని(ఫేక్‌) ‌డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌ ‌సంస్థలలోని  డిగ్రీలు చెల్లవని, గుర్తింపు ఇచ్చిన విశ్వవిద్యాలయాలకు, ఆయా అనుమతి   పోందిన  కోర్సులలో ప్రవేశం పొందిన వారి డిగ్రీలకు డోకా లేదని, యూనివర్సిటీ గ్రాంట్స్ ‌కమిషన్‌(‌డిస్టెన్స్ఎడ్యుకేషన్‌  ‌బ్యూరో ) ప్రత్యక్షంగా హెచ్చరించింది.

మన దేశంలో సార్వత్రిక విశ్వవిద్యాలయాలు ఒక(1) కేంద్ర విశ్వ విద్యాలయంతో పాటు(ఇందిరగాంది నేషనల్‌ ఓపెన్‌ ‌యూనివర్సిటీ) 13 రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయాలు, 28 ర్టాష్రాలలోని 35 ఏ కేటగిరీ విశ్వవిద్యాలయాలు, 145 ప్రభుత్వ, ప్రయివేటు, డీమ్డ్ ‌విశ్వవిద్యాలయాలలో డూయల్‌ ‌మోడ్‌ ‌పద్ధతిలో సార్వత్రిక విద్యా ప్రణాళిక విజయవంతంగా నడుస్తుంది. అక్కడవారి, వారి అవసరాలకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలలో కావల్సిన కోర్సులతో పాటు, రెగ్యులర్‌ ‌విశ్వవిద్యాలయాలకు ధీటుగా సార్వత్రిక విశ్వవిద్యాలయాలు ఎలాంటి అర్థిక భారం లేకుండా వివిధ కోర్సులల్లో ప్రవేశాలు ఇవ్వడం జరుగుతుంది. యూ.జీ.సి(డెబ్‌)ఉన్నత విద్యాలాగానే సెమిష్టర్‌కు నాంది పలికింది. కాని కొన్ని విశ్వవిద్యాలయాలు అమలు పరచడం, చాలా అమలుపరుచక పోవడం జరిగింది,  1920-21 విద్యా సంవత్సరంలో దాదాపుగా అన్ని విశ్వవిద్యాలయాలు కూడా అడ్మిషన్స్‌ప్రక్రియ ప్రారంభించిన సంగతి విదితమే. దినదినం కరోనా మహమ్మారి యవత్‌ ‌ప్రపంచంలో పేద, ధనిక అనే భేదం లేకుండా భావితరాలకు మార్గదర్శకులవుతారనుకున్న విద్యార్థి  లోకానికి పాలుపోని పరిస్థితి దాపరించివుంది.

2019-20 విద్యా సంవత్సరం దూరవిద్య ఆన్‌లైన్‌ ‌విధానం ద్వారా కూడా 24 కోర్సులతో, 5 రాష్ట్రలలో విజయవంతంగా నడుస్తుంది. ఉన్నత విద్య చదువాలనే కోరిక దూరవిద్యా ద్వారా మాత్రమే నెరవేరే పరిస్థితి ఉండడంతో ఈ విద్యా సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే రెగ్యులర్‌గా విద్యను అభ్యసించే యువత కూడా 15%శాతం పెరిగే అవకాశం వుంది. ఇప్పుడున్న స్థితిలో ఏ కోర్సు చదవాలన్నా లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి ఎలాంటి క్లాసులు వినకుండా ఏమాత్రం నేర్చుకోకుండా, చదువుకునేందుకు విద్యార్థి అంగీకరించడంలేదు. దూరవిద్యలో అందుబాటులో వున్న కోర్సులను చదివేందుకు  ప్రత్యామ్నయంగా చాల మంది విద్యార్థులు మొగ్గుచూపే అవకాశంవుండడానికి కారణం ఫీజులు తక్కువ,  డిగ్రీకి   భరోసా. కరోనా మహమ్మారి నుండి రక్షణతో పాటు, చదువుకోవాడానికి అన్ని   విశ్వ విద్యాలయాలు కూడ  కోర్సు మెటేరియల్‌ అం‌దించడం లాంటి సదుపాయాలతో విద్యార్థులను ఆకర్షించి కరస్పాండెన్స్ ‌కోర్సులో ప్రవేశంపొందేలా చేయడం ద్వారా తన లక్ష్యాన్ని సాధించుకునే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల సమన్వయంతో మంచి ప్రమాణాలు పాటించే విధంగా పర్యవేక్షణతో ముందుకు వెళ్లినప్పుడు అందరికి విద్య, ఉన్నతవిద్య ….విద్యతో ముందడుగు అనే నినాదంతో మంచి ఫలితాలు సాధించవచ్చు.

 

Leave a Reply

error: Content is protected !!