Take a fresh look at your lifestyle.

ములుగులో జెండా అవిష్కరించిన సీతక్క

తెలంగాణలో అసలు సిసలైన పరిపాలన సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలోనే సాగుతోందని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కార్మికుల కడుపునింపుతూ ఉపాధి కల్పిస్తూ ఉపాధి కూలీలకు వేతనాలు పెంచుతూ బియ్యం, డబ్బులు ఉచితంగా అందిస్తూ కార్మికులను కన్నబిడ్డల్లా చూసుకుం టున్నారని తెలిపారు. వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లా గీసుకొండ మండలం కోనాయిమాకులలో మే డే సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి ఎర్రజెండాను ఆవిష్కరించారు .

అనంతరం కూలీలు, కార్మికులు, ఆటోడ్రైవర్లు, నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలందరికీ క్షేమం, అందరికీ సంక్షేమం, రాష్ట్రానికి అభివృద్దిని అందిస్తున్న ముఖ్యమంత్రి పరిపాలన దేశంలో మరెక్కడా లేదనారు. కార్మికులకు సరైన పనికి సరైన వేతనాలు ఇప్పిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు . కార్మికులందరికీ కరోనా కాలంలో వేతనాలివ్వాలని యాజమాన్యాలను ప్రభుత్వం ఆదేశించినట్లు పేర్కొన్నారు.

Leave a Reply