- బయో టెక్నాలజీ యూనిట్ రాకతో మారనున్న ముఖచిత్రం
- జిల్లాలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం
అనంతపురం,జూలై 6 : రాష్ట్రంలో తొలి వ్యాక్సిన్ తయారీ కేంద్రం అందుబాటులోకి రానుండ డంతో పాటు, అనంతలో ఇది ఏర్పాటు కావడం ఈ జిల్లా ముఖచిత్రం మారనుంది. ఇప్పటికే వివిధ పరిశ్రమలతో పాటు కొత్తగా రూ.720 కోట్లతో అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు వద్ద బయో టెక్నాలజీ యూనిట్‌ను ఇండస్ జీన్ ఎక్స్ప్రెషన్స్ లిమిటెడ్ నెలకొల్పుతోంది. మొత్తం 3 దశల్లో ఈ యూనిట్ రూపుదిద్దుకుంటోంది. తొలిదశ పనులు రూ.220 కోట్లతో పూర్తికావచ్చాయి. ఈ యూనిట్ ఏర్పాటు ద్వారా స్థానికంగా వెయ్యి మంది బయో టెక్నాలజీ సైంటిస్టులు, బయోకెమిస్టీ విద్యార్థులకు అవకాశాలు లభిస్తాయని, ఇండస్ జీన్ కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
దీంతోపాటు మరో 1,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని వెల్లడించింది. ఈ యూనిట్ ద్వారా క్యాన్సర్, ఆర్థరైటిస్, మధుమేహం వంటి వ్యాధులపై పరిశోధనలు జరగనున్నాయి. కరువు జిల్లాగా పేరున్న అనంతపురం జిల్లాకు దీంతో మంచి గుర్తింపు రానుంది. పరిశ్రమల ఏర్పాటు, స్థానికులకు ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నందున జిల్లాలో అనుబంధ రంగాలకు ప్రాధాన్యం పెరగనుంది. అనంతపురం జిల్లా పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో అనువుగా ఉంటుందని కూడా రుజువు కానుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో పరిశ్రమలు రావడానికి మార్గం సుగమం కానుంది. ఇప్పటికే పలు కంపెనీలు ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయి.
పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతంలో కంపెనీల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. చిలమత్తూరు మండలంలో ఏర్పాటుకాబోతున్న ఇండ్సజీన ఎక్స్పెన్షన పరిశ్రమకు మంచి భవిష్యత్తు ఉంటుందన్న భరోసా కూడా ఉంది. జిల్లాలో కరువును పారదోలి పరిశ్రమల జిల్లాగా మార్చబోతున్నామని మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అన్ని వసతులు జిల్లాలో ఉన్నాయన్నారు. బెంగళూరు నగరం అతి సపంలో ఉండటం, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు, గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు ఉండటం వల్ల పరిశ్రమల ఏర్పాటు సులభమవుతోందన్నారు.
బయో టెక్నాలజీ హబ్‌గా ఎదిగేందుకు అనంతపురం జిల్లాకు అపార అవకాశాలున్నాయని అన్నారు. జిల్లాను పారిశ్రామికంగా అభివఅద్ధి చేయడం ద్వారా స్థానికులకు ఉపాధి కల్పించాలని సిఎం వైఎస్ జగన్ లక్ష్యంగా నిర్దేశిరచుకున్నారని చెప్పారు. ఈ యూనిట్ రాష్ట్రంలో నెలకొల్పు తున్న తొలి వ్యాక్సిన్ తయారీ కేంద్రమని, త్వరలో ఈ యూనిట్‌ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారని ప్రకటించారు.