- జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష పైగా వారియర్స్‌కు తొలి టీకా
- ఏర్పాట్లపై మేయర్ బొంతు రామ్మోహన్ సమీక్ష
జనవరిలో రాష్ట్రంలో కొరోనా టీకా వేసే పక్రియ ప్రారంభం కానుంది. అయితే టీకా అందుబాటులోకి వచ్చిన తర్వాత మొదటగా గ్రేటర్ హైదరాబాద్ లోనే వేయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న లక్ష మందికి పైగా ఉన్న వారియర్స్ కొరోనా వ్యాక్సిన్ మొదటగా వేయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొరోనా వ్యాక్సిన్ పక్రియకు సంబంధించిన ఏర్పాట్లపై మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల , రాష్ట్ర ఇమ్యునైజేషన్ ఆఫీసర్, టీఎస్ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీలో కొరోనా వ్యాక్సిన్ వేయడానికి 1100 ప్రాంతాలను గుర్తించనున్నారు.
ఆ 1100 ప్రాంతాల్లో వేయిస్తారు. టీకా సెంటర్లను గుర్తించే పక్రియ 2021 జనవరి 10 నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. మొదటి దశలో హెల్త్ కేర్ వర్కర్లకు టీకా వేస్తారు. నర్సులు, మహమ్మారిని ఎదుర్కోవడంలో సేవలు అందించే వారికి టీకా తొలిదశలో అందుతుంది. వారందరికీ పూర్తయిన తర్వాత రెండో దశలో పోలీసులు, మున్సిపల్ వర్కర్లకు కొరోనా వ్యాక్సిన్ వేస్తారు. మూడో దశలో 50 ఏళ్లు దాటిన వారికి ప్రాధాన్యత లభిస్తుంది. అలాగే, 50 ఏళ్ల కంటే తక్కువ వయసున్నా కూడా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడే వారికి కూడా మూడో దశలో టీకా లభిస్తుంది.