Take a fresh look at your lifestyle.

ప్రైవేట్‌ ‌సంస్థల భాగస్వామ్యంతో తొలి అంతరిక్ష ప్రయోగం

  • నేడు నింగిలోకి పీఎస్‌ఎల్వీ సీ 51వాహకనౌక
  • పలు శాటిలైట్లను పంపేందుకు ఏర్పాట్లు మొదలైన కౌంట్‌డౌన్‌

‌సరికొత్త అధ్యాయానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కౌంట్‌డౌన్‌ ‌ప్రారంభించింది. ప్రైవేట్‌ ‌సంస్థల భాగస్వామ్యంతో తొలి అంతరిక్ష ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఆదివారం చేపట్టనున్న పీఎస్‌ఎల్‌వీ -సీ51 ప్రయోగంతో వాణిజ్యరంగంలో తొలి అడుగు వేయనుంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం శ్రీహరికోటలోని సతీశ్‌ ‌ధావన్‌ అం‌తరిక్ష కేంద్రం షార్‌లో రాకెట్‌ ‌కౌంట్‌డౌన్‌ను శాస్త్రవేత్తలు ఉదయం 8.54 గంటలకు ప్రారంభించారు. సుమారు 25.30 గంటల పాటు పక్రియ కొనసాగనుంది. ఆదివారం ఉదయం 10.24గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ51 రాకెట్‌ ‌నింగిలోకిదూసుకెళ్లనుంది.

అమెజానియా-1తో పాటు మరో 18 ప్రైవేటు ఉపగ్రహాలను రాకెట్‌ ‌మోసుకెళ్లనుంది. న్యూస్పేస్‌ ఇం‌డియా లిమిటెడ్‌ ‌నేతృత్వంలో నింగిలోకి తొలి వాణిజ్య ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌ ‌కక్షలో ప్రవేశపెట్టనుంది. బ్రెజీలియన్‌ ‌శాటిలైట్‌ అమెజానియా-1 భూపర్యవేక్షణకు కీలకమైంది. అమెరికాకు చెందిన స్పేస్‌ ‌బీస్‌ ‌పేరుతో 12 ఉపగ్రహాలు, సాయ్‌?1 ‌నానో కాంటాక్ట్-2 అనే ఒక ఉపగ్రహంతో పాటు యూనిటీశాట్‌ ‌పేరుతో మూడు యూనివర్సిటీల విద్యార్థులు తయారుచేసిన మూడు ఉపగ్రహాలు, సతీశ్‌ ‌ధావన్‌ ‌శాట్‌, ‌సింధునేత్ర అనే ఉపగ్రహాలను రోదసీలోకి పంపనుంది.అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్‌ధవన్‌ ‌స్పేస్‌ ‌సెంటర్‌ (‌షార్‌) ‌వేదికగా 2021లో తొలి హిట్‌ ‌కొట్టేందుకు ఇస్రో సిద్ధమైంది. తన నమ్మకమైన వాహకనౌక పీఎస్‌ఎల్వీ సీ 51ను నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.

ప్రయోగానికి సంబంధించి శాస్త్రవేత్తలు అన్ని పరీక్షలు పూర్తి చేశారు. మొదటి ప్రయోగవేదిక నుంచి రోదసిలోకి రాకెట్‌ ‌దూసుకుపోవడమే మిగిలింది. ఇలాకరోనా లాక్‌డౌన్‌తో 2020 నింపిన చేదు అనుభవాలను అధిగమించి 2021లో సరికొత్త అడుగులేసేందుకు ఇస్రో ప్రణాళికలు రూపొందించింది. ఒక వైపు చంద్రయాన్‌ 3, ఆదిత్య ఎల్‌ 1, ‌గగన్‌యాన్‌కు సిద్ధమవుతూనే.. వాణిజ్యపరమైన ప్రయోగాలు చేసేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా షార్‌ ‌నుంచి ఆదివారం ఉదయం 10.24కు పీఎస్‌ఎల్వీ సీ- 51 ఉపగ్రహ వాహకనౌకకు నింగిలోకి పంపనుంది.

The first space launch in partnership with private companies

ప్రయోగానికి 25 గంటల ముందుగా శనివారం ఉదయం 8.54కు కౌంట్‌డౌన్‌ ‌ప్రారంభమైంది. ఈ ప్రయోగం ద్వారా బ్రెజిల్‌ ‌దేశానికి చెందిన 637 కిలోల బరువు కలిగిన అమెజానియా 01 అనే ఉపగ్రహంతో పాటు మరో 18 చిన్న తరహా ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశపెట్టనున్నారు. న్యూ స్పేస్‌ ఇం‌డియా లిమిటెడ్‌ ‌ప్రారంభించాక పూర్తి స్థాయి వాణిజ్యపరమైన మొదటి ప్రయోగం కావడం దీని ప్రత్యేకత.

Leave a Reply