Take a fresh look at your lifestyle.

జనవరి 13న తొలి కొరోనా టీకా..?

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ ‌భూషణ్‌
‌భారత్‌లో కొరోనా టీకా పంపిణీ ఎప్పుడనే విషయంపై ఇప్పటివరకూ నెలకొన్న తర్జనభర్జనకు కేంద్రం ఫుల్‌స్టాప్‌ ‌పెట్టింది. భారత్‌లో కొరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ ‌సిద్ధమైందని ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. పదిరోజుల్లో వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు సిద్ధమని కేంద్రం ప్రకటించింది. వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన 10 రోజుల్లో టీకాలను ప్రజలకు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇండియాలో తొలి కొరోనా వైరస్‌ ‌టీకా జనవరి 13న వేసే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ ‌భూషణ్‌ ‌వెల్లడించారు. మంగళవారం ఆయన వి•డియాతో మాట్లాడారు. దేశంలో ప్రధానంగా నాలుగు ప్రైమరీ వ్యాక్సిన్‌ ‌స్టోర్లు ఉన్నట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు. వీటిని జీఎంఎస్‌డీగా పిలుస్తారని, ఇవి కర్నాల్‌, ‌ముంబై, చెన్నై, కోల్‌కతాలలో ఉంటాయని తెలిపారు. మొత్తంగా దేశంలో 37 వ్యాక్సిన్‌ ‌స్టోర్లు ఉంటాయని వెల్లడించారు. ఈ స్టోర్లు భారీ సంఖ్యలో వ్యాక్సిన్‌ను నిల్వ చేస్తాయని, అక్కడి నుంచి వాటిని పంపిణీ చేస్తారని రాజేష్‌ ‌భూషణ్‌ ‌తెలిపారు. ఆయా స్టోర్లలో ఎన్ని వ్యాక్సిన్లు ఉన్నాయి, ఏ ఉష్ణోగ్రత దగ్గర వాటిని స్టోర్‌ ‌చేశారన్న వివరాలు డిజిటల్‌ ‌రూపంలో పరిశీలిస్తామని చెప్పారు. డ్రైరన్‌ ‌ఫీడ్‌ ‌బ్యాక్‌ ఆధారంగా టీకాల పంపిణీకి కేంద్రం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. జనవరి 13 నుంచి భారత్‌లో కొరోనా వ్యాక్సిన్‌ అం‌దుబాటులోకి రానున్నట్లు కేంద్రం తాజా ప్రకటనతో స్పష్టమైంది. ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్ ‌వ్యాక్సిన్‌, ‌భారత్‌ ‌బయోటెక్‌ ‌కోవ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి డ్రగ్‌ ‌కంట్రోలర్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ఇం‌డియా గత ఆదివారం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.

వ్యాక్సిన్‌ ‌పంపిణీకి సంబంధించి..తొలి దశలో భాగంగా హెల్త్ ‌కేర్‌ ‌వర్కర్లకు, అత్యవసర సేవల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, వయసు పైబడిన వారికి టీకా ఇవ్వాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. వ్యాక్సిన్‌ ‌తయారీ సంస్థలు త్వరలో ముంబై, చెన్నై, కోల్‌కత్తా, కర్నల్‌, ‌హర్యానాలోని ప్రభుత్వ మెడికల్‌ ‌స్టోర్‌ ‌డిపోలకు విమానాల ద్వారా వ్యాక్సిన్‌ను తరలించనున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య కార్యదర్శి  వెల్లడించారు. అక్కడి నుంచి 37 స్టేట్‌ ‌వ్యాక్సిన్‌ ‌స్టోర్లకు తరలించనున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి జిల్లాల్లోని వ్యాక్సిన్‌ ‌స్టోర్స్‌కు తరలించి.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్‌ ‌పంపిణీ మొదలుపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. కోవిషీల్డ్, ‌కోవ్యాక్సిన్‌లను నిల్వ చేసేందుకు 29,000 కోల్డ్ ‌చైన్‌ ‌పాయింట్స్‌ను భారత్‌లో సిద్ధం చేసినట్లు ఆరోగ్య కార్యదర్శి చెప్పుకొచ్చారు.

Leave a Reply