Take a fresh look at your lifestyle.

మండలంలో మొదటి కొరోనా పాజిటీవ్‌

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ‌రోజురోజుకు విజృంభిస్తున్న పరిస్థితులను చూస్తున్నాము. ఇప్పుడు ఈ వైరస్‌ ‌పల్లెల్లో కూడా వదలడం లేదు. ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న పల్లెలు ఇప్పుడు కరోనా వైరస్‌ ‌తో సతమతమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే మండలంలోని ఏడూళ్ల బయ్యారం గ్రామంలో మొదటి కేసు నమోదైంది. గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువకుడు కి కరోనా పాజిటివ్‌ ‌వచ్చినట్లు నివేదికను బట్టి వైద్యులు ధృవీకరించారు. కరోనా పాజిటివ్‌ ‌వచ్చిన యువకుడు హైదరాబాదు లోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అతను ఓ ప్రైవేట్‌ ‌ల్యాబ్‌ ‌లో పరీక్షలు చేయించుకొని ఈనెల ఒకటో తారీకు అనగా బుధవారం నాడు తన స్వగ్రామం అయినటువంటి పినపాక మండలం లోని ఏడూళ్ల బయ్యారం గ్రామానికి వచ్చాడు. మరునాడు రెండో తారీఖు మధ్యాహ్నం ఆ ప్రైవేట్‌ ‌ల్యాబ్‌ ‌నుండి పరీక్షల నివేదికలు రావడంతో ఆ పరీక్షలో అతనికి కరోనా పాజిటివ్‌ ‌గా వచ్చిందని వారు ఫోన్‌ ‌ద్వారా సమాచారం అతనికి అందించారు. ఈ విషయం తెలిసిన యువకుడు వైద్యం చేయించుకోవడం కొరకు తిరిగి హైదరాబాద్‌ అదే రోజు సాయంత్రం వెళ్లడం జరిగింది.

ఈ విషయం తెలుసుకున్న మండల అధికారులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, వైద్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది అతని నివాసానికి చేరుకుని వివరాలు సేకరించి ఆ ప్రాంతమం తా సోడియం హైపోక్లోరైడ్‌ ‌ద్రావణంతో పిచికారీ చేసి, బ్లీచింగ్‌ ‌చేశారు. అనంతరం కరోనా వచ్చిన యువకుడు ఎవరితో కలిశాడో వివరాలు సేకరించారు. ఆ యువకుడు కలిసిన వారిలో ప్రైమరీ కాంటాక్ట్ ఆరుగురు, సెకండరీ కాంటాక్ట్ 22 ‌మందిగా అధికారులు గుర్తించారు. వారందరూ గృహనిర్బంధంలో ఉండాలని వారికి సూచించారు. అనంతరం కరోనా వచ్చిన యువకుడు నివాసము నుండి అర కిలోమీటరు దూరం వరకు కంటోన్మెంట్‌ ‌జోన్‌ ‌గా తహశీల్దార్‌ ‌మహేశ్వర రావు ప్రకటించారు. కంటోన్మెంట్‌ ‌జోన్‌ ‌లో ఉన్నవారు భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండాలని ఆయన సూచించారు. అత్యవసర పరిస్థితి వస్తే పోలీసులు గాని, రెవెన్యూ సిబ్బంది గాని, వైద్య సిబ్బంది గాని, పంచాయతీ సిబ్బందికి తెలియజేయాలని ఆయన కోరారు. అందరూ అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు.

Leave a Reply

error: Content is protected !!