Take a fresh look at your lifestyle.

నిర్లక్ష్యపు నీడలలో శాతవాహనుల తొలి రాజధాని

నేడు జాతీయ పర్యాటక దినం

అవిభక్త కరీంనగర్‌ ‌జిల్లాకు 50 వేల సంవత్సరాలకు పూర్వపు చరిత్ర ఉంది. చరిత్రలో ఆంధ్రులకు లభించి నంత వరకు , శాత వాహనుల మొట్ట మొదటి రాజవంశం, ఆదీ మహా రాష్ట్ర లోని  పైఠానో లేక నాసిక ప్రాంతమో అనుకుంటే కాదని, అంతకు ముందే వీరు ఆంధ్రులని, కరీంనగర్‌ ‌జిల్లానే  వారి మూల పురుషులకు ఆవాస స్థానమని, చారిత్రక పరిశోధనలు స్పష్టం చేశాయి. శాతవాహన వంశానికి మూలపురుషుడు అని  భావింపబడే శ్రీముఖుడు కోటి లింగాలను రాజధానిగా చేసుకుని పాలించాడని స్పష్టం అయినాక, ఆయన నాణేలు కోటిలింగాలలో లభ్యమైనాక చరిత్రలో నూతన అధ్యాయానికి  నాంది పలికింది. నాటి జిల్లా కేంద్రమైన కరీంనగర్‌ ‌కు 65 కి.మీ .ల, నేటి జిల్లా కేంద్రమైన జగిత్యాలకు 27కి.మీల, ధర్మపురి క్షేత్రానికి 19 కి.మీ.ల దూరాన వెల్గ టూరు మండలం లోని గోదావరి, పెద్దవాగు సంగమ స్థాన మందుగల కోటిలింగాలలోని పుట్ట కోట గోడలు (పూర్వపు కోటలు) ఆంధ్రదేశ పాల కులైన శాతవాహనుల తొలి రాజులకు ఆటపట్టయినవి.  ఆంధ్రుల తొలిరాజుగా పురాణా లలో వర్ణించ బడిన శ్రీముఖ చక్రవర్తి నాణాలను , కప్పారావు పేట సమీపాన, ధర్మపురి వాస్తవ్యులు ప్రముఖ చారిత్రక పరిశోధకులు , పురావస్తు శాఖలో ఎవి ట్రాఫిక్‌ అని సెంటు (శాసన వ్యాఖ్యాత)గా పనిచేస్తూ మరణించిన సంగనభట్ల నరహరిశర్మ సేకరించి, పురావస్తు శాఖకు అప్పగించడంతో , ఈ ప్రాంత ప్రాశస్త్యం వెలుగు చూడ గలిగింది.

శాతవాహన కాలానంతర మైనట్టి వారికి ఉద్యోగ చెందిన ‘‘మహా తలవర, మహా సేనాధిపతి పతిస’’ ఆను నాణెములు ఇచ్చట లభించినవి. విదిశా నగరమును కేద్రముగా ఏలిన చివరి శుంగ రాజుల నాణెములు లభింపగా, వాటిపై బ్రాహ్మీ లిపిలో ‘‘రజోగో బదస, రజో సమగోపస’’ అని వ్రాసి ఉన్నవి. శుంగుల అనంతరం మగధను ఏలారని పురాణాలలో పేర్కొనిన కాణ్వరాజుల నాణెము లు కూడా లభించాయి. వీటి ఆధారంగా పురాణములందు పేర్కొన్నట్లు, మగధ రాజ్యమును మౌర్యుల అనంతరం శృంగులు, కాణ్వులు పిదప ఆంధ్రులు వరుస గా పాలించినట్లు తార్కాణం ఇచ్చు చున్నదని పురావస్తు శాఖ మాజీ డైరక్టర్‌ ‌పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శా స్త్రీ సోదాహరణంగా నిరూపిం చారు. వీటిలో కొన్ని కోటిలింగాల పొలములలో బ్రాహ్మీ లిపి లోని శిలా ఫలకాలు వెలుగు చూశాయి. ఇచట లభించినట్లు అపు రూప నాణెములు వేరెచ్చటా లభించని కారణంగా , కోటిలింగాల శాతవాహ నుల తొలి రాజధాని అని, పరిసర ప్రాంత కేంద్ర స్థానమని స్పష్టమైంది. కోటిలింగాలలో నే  నరహరిశర్మ పంచమార్క్ ‌నాణేలు , ఇతర అపు రూప నాణేలు సేకరించి పురావస్తు శాఖకు హస్తగతం చేశారు. వానిలో ‘‘రజో శాతవాహ , రజో సాతకం నిస’’ ఆని బ్రాహ్మీ లిపిలో వ్రాయ బడింది. లిపి ప్రకారం శ్రీముఖుని కన్నా ఇవి ప్రాచీనమైనవి.

సహజం గా ఉండవలసిన ఉజ్జయిని చిహ్నం వీటిలో లేదని నరహరి పరిశోధనలో పేర్కొన్నాడు. శాతవాహన కాలపు పొరల్లో అనేక శాతవాహన నాణేలు లభించాయి. లభ్యమైన నాణెము లను బట్టి శాతవాహన వంశ మూల పురుషుడైన శాతవాహనుడు ఆంధ్రగోపులను , శబరులను, మహా తలవరులను, తదితర ఆంధ్ర రాజులను ఓడించి శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. శాత వాహనులు తొలుత ఆంధ్రుల పాలనలో భాగమై, ఆంధ్ర భృత్యు లుగా ఉండి, బలవంతులై సామ్రాజ్య  స్థాపనకు పూనుకు న్నారని, శ్రీముఖుడు చివరి కాణ్వరాజును అంతమొందించి, స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరచి, విస్తరించారని జగిత్యాలకు చెందిన ప్రముఖ చారిత్రక పరిశోధకులు , రిటైర్‌ ‌రీడర్‌ ‌డాక్టర్‌ ‌జైశెట్టి రమణ య్య కరీంనగర్‌ ‌చారిత్రక సంస్కృతి గ్రంథంలోని వర్ణించారు. హాల చక్రవర్తి గాథా సప్తశతి లోని  గోదా వరి వర్ణన ఆధారంగా , లభ్యమై నట్లు ముఖ నాణాలను బట్టి కోటిలింగాల, శాతవాహనుల బలిష్ట దుర్గమని తెలియు చున్నది. కోటి లింగాల సమీపమున గల గుట్ట జైన మునులకావాస స్థానముగ నుండే దని తెలుస్తున్నది. సమీపాన క్రీ.పూ.రెండవ శతాబ్దపు బౌద్ద స్తూపం పాపాయిగాం గుట్టపైన ఉండేది. ప్రస్తుతం మధ్య యుగానికి చెందిన దేవాలయం గ్రామంలో ఉంది. రెండు గర్భగృహాలకు ఉమ్మడి మంటపముంది. ప్రతి గర్భగృహంలో అంతరాళం ఉంది. ప్రధానాలయంలో కోటీశ్వరుడు లింగ రూపుడుగా ప్రతిష్ఠితుడు
కాగా, దక్షిణ దిశలో ఉత్తర ముఖ గర్భగృహంలో అంతరాళం ఉంది. ప్రధాన ఆలయంలో కోటీశ్వరుడు
లింగరూపుడై ఉన్నాడు.

ఆలయం చాళుక్య రీతులలో నుండి, గోదా వరి ఒడ్డున అనేక శిల్ప ప్రతిమ లున్నాయి. పురావస్తు శాఖచే త్రవ్వకాలు జరపబడి, పర్యాటక శాఖ గుర్తింపు పొందింది ఈ ప్రదేశం. ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లా ప్రాక్చరిత్ర కు నిలువెత్తు నిలువుటద్దంగా నిలిచి, శాతవాహనుల తొలి రాజ ధానిగా చరిత్ర పుటలకెక్కి, జిల్లా  సంతరించుకున్న జిల్లా చరిత్ర గతినే  మార్చి, విశేష ప్రాధాన్యత కోటి లింగాల ఒడ్డు, గోదావరి నీటి వల్ల నానాటికీ కోతకు గురవు తున్నది. తవ్వకాలు జరిపితే చారిత్రక సత్యాలెన్నో వెలికి తీయగల చరిత్రకు పూర్వపు గ్రామం, ప్రమాదపు టంచున పయని సున్నది. స్థానికుల, దాతల చేయూత, ధర్మకర్తల మండళ్ళ కృషితో, ప్రత్యేక నిధులను ప్రోగు చేసుకుని దేవస్థానాన్ని అభివృద్ధి పరుచుకుంది. పర్యాటక శాఖ ఈ గ్రామంపై చాలా కాలం చిన్నచూపే చూసింది. గతంలో చాలా సందర్భా లలో ప్రథుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రముఖ పర్యాటక స్థలంగా తీర్చిదిద్ద గలమని ఇచ్చిన హామీలు, చేసిన ప్రకటన – నీటి మూటలు గానే మిగిలి పోయాయి. జిల్లాకు చెందిన కేంద్ర, రాష్ట్ర సాయి నాయకులు, ఉన్నతాధికారులు , చారిత్రక విషయాసక్తులైన వ్యక్తులు, రాష్ట్ర చరిత్రలో ప్రధాన ప్రదేశమైన కోటిలింగాలలో ప్రత్యేక అభివృద్ధి పనులు, ప్రాచీన చారిత్రక అవశేషాల సంరక్షణా చర్యలను చేపట్టడంపై, నిర్ణయాత్మక కార్యక్ర మాలను చేపట్టడంలో ఆలసత్వా న్నే ప్రదర్శించారు. ఈ కారణంగానే ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లా ప్రాచీన చరిత్రకు సాక్షీ భూతంగా నిలిచిన కోటిలింగాల నేడు కాలగర్భంలో కలిసి పోయే ప్రమాదంలో ఉంది. శ్రీపాద పాజెక్టు నిర్మాణ చర్యలలో భాగంగా చారిత్రక గ్రామానికి వరద ముప్పు భయభ్రాంతులకు గురి చేస్తున్నది.

దీనితో ఈ గ్రామ చరిత్ర పుటల నుంచి కనుమరుగు అయ్యే ప్రమాదమూ లేకపోలేదు. ఈ విషయాన్ని ఆలస్యంగా నైనా గ్రహించిన జిల్లా  మేధావి వర్గం, కోటి లింగాలను పరిరక్షించే చర్యలు గైకొనాలవి గత ప్రభుత్వానికి విన్నవించింది. రాష్ట్ర రాజధాని నుండి సైతం ఈ అంశంపై అవగాహన కలిగిన దివంగత ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌ ‌రావు, మల్లేపల్లి లక్ష్మయ్య, ఆచార్య జయధీర్‌ ‌తిరుమల రావు, నిమ్స్ ‌మాజీ డైరెక్టర్‌ ‌డాక్టర్‌ ‌రాజిరెడ్డి, ఐకాస కన్వీనర్‌ ‌కోదండరాం, తెలంగాణ జాగృతి వ్యవస్తాపకులు కవిత, కుర్రా జితేంద్ర బాబు, జైకిషన్‌, ‌కవి గాయకులు దేశపతి శ్రీనివాస్‌ ‌లాంటి మేధావులను  రప్పించి, కోటిలింగాల పరిస్థితిని ప్రత్యక్షంగా చూపించి, తద్వారా గత ప్రభుత్వం దృష్టి ఆకర్షించి, పరిరక్షిం చే ప్రయత్నం చేసింది. అపురూప నాణేలు లభ్యమైన కోటిలింగాల గ్రామం ఖాళీ అయితే, త్రవ్వకాలకు మరింత సానుకూలత ఉండగలదనే ప్రతిపాదన అందుకున్న రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్‌ ‌చెన్నారెడ్డి అందుకు సానుకూలంగా స్పందించి, కోర్‌ ‌కమిటీ నిర్ణయాన్ని అనుసరించి తవ్వకాలు జరిపేలా కృషి సల్పగల మని ప్రకటించి నామ మాత్రపు తవ్వకాలు చేపట్టి  చేతులెత్తేయడం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు ముంపుకు గురికాకుండా ఆలంపూర్‌ ‌లో నిర్మించినట్లు, కోటిలింగాల పరిర క్షణ గోడలు నిర్మించాలనే ప్రతిపా దన చాలా కాలంగా కాగితాలకే పరిమిత మైంది. గతంలో నాటి సంబంధిత మంత్రి పొన్నాల లక్ష్మయ్య వద్ద ప్రతిపాదనలు ఉన్నా, పట్టించు కోలేదు.

తెరాస ప్రభుత్వ సంబంధిత కార్యదర్శి వెంకటేశం దర్శించి, తగు చర్యలు తీసుకునేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. ఇలా ఉంటే తెరాస ప్రభుత్వంలో నేటి మంత్రి, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ ‌చీఫ్‌ ‌విప్‌ ‌గా చేరాక, ఆయన చొరవ కృషి, కృత నిశ్చయం ఫలితంగా, పర్యాట క శోభను సంతరింప చేయాలనే తపన కారణంగా, 2018 జనవరి 6వ తేదీన నాటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌, ‌చీఫ్‌ ‌విప్‌ ‌కొప్పుల ఈశ్వర్‌ ‌ల చేతుల మీదుగా  రెండు బోట్లను ప్రారంభించారు. 50 సీట్ల కెపాసిటీతో ‘‘శాతకర్ణి’’, 25 సీట్లు కెపాసిటీ గల ‘‘పులోమావి’’ తో పాటు 4 సీటర్ల స్పీడ్‌ ‌బోట్‌ ‌ను ప్రారంభించారు. మంత్రి కొప్పుల కృషికి, సీఎం కేసిఆర్‌ ‌చేయూతను అందించి, పర్యాటక సంబంధంగా ఎంతో చేయాల్సి ఉంది. రాష్ట్ర చరిత్రతో విడదీయ రాని సహస్రా బ్దుల సంబంధాన్ని కలిగిన అపు రూప చారిత్రక బంధాన్ని తత్సం బంధ ఆధారాలను పరిరక్షిం చి, గోదావరి వద్ద రక్షణ గోడ నిర్మిం చి,  కోటిలింగాల ఉనికిని కరు మరుగు కాకుండా ఉండగలం దులకు ప్రత్యేక చర్యలు చేపట్టా ల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉన్నాయి.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
   9440595494

Leave a Reply