Take a fresh look at your lifestyle.

నిప్పులు చెరుగుతున్న సూరీడు

  • ఉభయ తెలుగురాష్ట్రాల్లో వడగాడ్పుల తీవ్రత
  • కేరళను నైరుతి తాకే వరకు ఇదే పరిస్థితి
  • బయటకు రాకూడదంటున్న వైద్యులు
  •  రాష్ట్రంలో భానుడు భగ్గు మంటూ 

ఉదయం నుంచే నిప్పులు కురిపిస్తు న్నాడు. సాధారణ కంటే 5 డిగ్రీలు ఎక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జూన్‌ ‌మొదటివారం వరకు ఎండల తీవ్రత ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కేరళను రుతుపవనాలు తాకితే తప్ప వాతావరణంలో మార్పు సాధ్యం కాదని అంటున్నారు. అప్పటి వరకు ఎండలకు తోడు, వడగాలు ప్రభావం కూడా ఉంటుందన్నారు. మండుటెండలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలు అదిరి పోతున్నాయి. దీంతో జనం ఇంటి నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఏపీలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడగాల్పులు వీచే అవకాశముందని హెచ్చరింది. రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నట్లు తెలిపింది.  12 గంటలకే రాష్ట్రంలో 44 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయి. సాయంత్రం మూడు గంటలకు 47 డిగ్రీలు దాటే సూచనలున్నాయని పేర్కొంటున్నారు. వడగాల్పులు తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు ఎండల్లో తిరగకుండా ఉండాలని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, గుంటూరు, విజయనగరం చిత్తూరు, కృష్ణా, అనంతపురం జిల్లాలతోపాటు విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు ఉష్ణోగ్రతలు 45 నుండి 47 డిగ్రీలకు పైగా నమోదవుతాయని తెలిపింది. ఉభయగోదావరి జిల్లాలతోపాటు శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 నుండి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని చెప్పింది. వృద్ధులు, చిన్నారులు ఎండల్లో తిరగకుండా వీలైనంత వరకు నీడలోనే ఉండాలని కోరారు. మరోవైపు ఎండల కారణంగా సాయంత్రం ఆరు దాటితే ఎండలు చల్లారడం లేదు. మరోవైపు రాత్రివేళల్లో తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు  సూచించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు పగటి వేళల్లో బయటకు వెళ్లకపోవడం మంచిదని చెప్పారు. తప్పని పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు దగ్గర పెట్టుకోవాలని, తరచూ నీరు, ఓఆర్‌ఎస్‌ ‌ద్రావణం తీసుకోవాలని సూచించారు.

గతంలో ఎప్పుడూ లేనంతగా 48 డిగ్రీలకు చేరువల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వడగాల్పులు వీస్తాయని  హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురుగాలు లతోపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.  భానుడి భగభగలకు ఉదయం 10 గంటలు దాటాక జనం ఇండ్లనుంచి బయటకు వచ్చేందుకు జంకుతుండటంతో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. హైదరాబాద్‌ ‌మొదలుకొని ఆదిలాబాద్‌ ‌వరకూ ఇదే పరిస్థితి నెలకొన్నది. వడగాడ్పుల వల్ల భూమి వేడెక్కి ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం  వెల్లడించింది.  చాలాచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 4 నుంచి 7 డిగ్రీలు అధికంగా రికార్డవు తున్నాయని, దీంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ఎండలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని, మరో ఐదురోజుల వరకు చాలాచోట్ల వడగాడ్పుల తీవ్రత కొనసాగుతుందని తెలిపారు. హైదరాబాద్‌లోనూ ఎండలు దడపుట్టిస్తున్నాయి. ఈ నెలలో రెండుసార్లు పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటి నమోదైనట్టు హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం  తెలిపింది.  రాత్రి సమయంలోనూ ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

Leave a Reply